By Village Missionary Movement
Tuesday, 20-Aug-2024దిన ధ్యానము(Telugu) 20.08.2024
అంశం: విశ్వాసులు
"అందుకాయన కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను" - మార్కు 5:34
కొన్ని సంవత్సరాలుగా ఒక గ్రామంలో వర్షం లేకుండా ఉండేది. కొంతమంది క్రైస్తవుల ఆ గ్రామంలో ఉండేవారు. అందరూ చర్చికి వెళ్లి వర్షం కొరకు ఉపవాసం చేసి ప్రార్థించడానికి బయలుదేరినప్పుడు ఒక చిన్న బాబు మాత్రము గొడుగు తన చేతిలో పట్టుకుని వెళ్ళాడు. ఒకాయన ఆ బాబుతో ఎందుకు గొడుగుని తీసుకొస్తున్నవు అని ఆగినప్పుడు మనము ప్రార్థన చేయబోతున్నాం దానిని ప్రభువు విని వర్షాన్ని ఇస్తారు. నేను తడుసుకొని ఇంటికి వెళ్ళాలి కదా అందుకొరకు గొడుగు తీసుకొస్తున్నాను అని చెప్పాడంట. చూడండి ఆ చిన్న బాలుడు యొక్క విశ్వాసము ఎంత గొప్పదో అలాగే ఆ చిన్న బాలుడు యొక్క విశ్వాసాన్ని ఘనపరిచిన దేవుడు అదే రోజు పెద్ద వర్షాన్ని కురిపింపజేశారు.
ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకంలో జీవించిన దినాలలో అనేకమైన అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను చేసి చూపించారు. అనేకమంది రోగులను స్వస్థపరిచారు. చూపు లేని వారికి చూపు దయచేసి, చెవిటి వారికి వినికిడి కలుగజేశారు. కుంటివారికి నడకనిచ్చారు ఇలాగే అనేకులకు యొక్క విశ్వాసము యేసయ్య మీద ఉండేది. యేసయ్య వారి విశ్వాసం చూసి వారిని స్వస్థత పరిచారు. అలాంటి ఒక స్త్రీ యొక్క విశ్వాసాన్ని మన మెరుగుదము. ఆమె 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ. ఆమె అనేక మంది వైద్యులు చేత వైద్యము చేయించుకొని తనకు కలిగిన దంతయు ఖర్చుపెట్టినప్పటికీ ఎంత మాత్రం ఆరోగ్యం లేకుండా యేసయ్య గురించి విని ఆయన వస్త్రపు అంచును ముట్టుకుంటే నేను స్వస్థపరచబడతాను అని ఆయన వస్త్రాన్ని తాకి స్వస్థపరచబడింది. ఇందుకు గల కారణము ఆ స్త్రీ యొక్క విశ్వాసం మాత్రమే.
ప్రియమైన వారలారా! అయస్కాంతము ఎలాగు ఇనుమును ఆకర్షించుకుంటుందో అలాగే ఆ రక్తస్రావము కలిగిన స్త్రీ యొక్క విశ్వాసము యేసయ్యలో ఉండిన స్వస్థపరచే శక్తిని ఆకర్షించింది. పరిపూర్ణ ఆరోగ్యం పొందుకున్నది. విశ్వాసము లేకుండా ప్రార్థన చేయటము తూటాలేని తుపాకీ వంటిది. విశ్వాసము గల ప్రార్ధన రోగులను స్వస్థపరుస్తుంది. 12 సంవత్సరాల నుండి బాధపడుతున్న ఆమె, గొప్ప విశ్వాసం కలిగి ఉన్నందున ఆమె స్వస్థత పొందుకున్నది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై యుండుట అసాధ్యము. కాబట్టి మన విశ్వాసము దేవుని పైన మాత్రమే ఉండనివ్వండి. ప్రతిరోజు మనకు విశ్వాసాన్ని అధికము చేయమని దేవుని అడుగుదాం.
- శ్రీమతి. సలోమి గారు
ప్రార్థన అంశం:-
ఇనియవలె అనే స్త్రీల కార్యక్రమం ద్వారా అనేక మంది స్త్రీలు క్రీస్తులో బలపరచబడి దేవుని కొరకు లేచే వారిగా ఉండాలని ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250