Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 11.08.2024 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 11-Aug-2024

దిన ధ్యానము(Telugu) 11.08.2024 (Kids Special)

 

అంశం:- నీవు కూడా సాధించవచ్చు 

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కొరకు

 

"దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక ఆయన తన ముఖకాంతి మామీద ప్రకాశింపజేయును గాక" - కీర్తనలు 67:2

 

హలో పిల్లలు ప్రతివారం కూడా కథ వింటున్నారు కదా. అది మీకు ఉపయోగకరంగా ఉంటుందా లేదంటే ఒక చెవితో విని మరొక చెవితో విడిచి పెట్టేస్తున్నారా? మీరు వింటున్న మంచి విషయాలు ప్రకారము నడుచుకొనుటకు యేసయ్య మీకు సహాయం చేస్తారు. ఓకేనా పిల్లలు సరే కథ విందామా ?

 

కయల్ ఆటలో చాలా ఆసక్తిగా ఉంటుంది. బాస్కెట్బాల్ ఆడుట ప్రాక్టీస్ కి వెళ్ళుట అని ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఆ దినము ఉదయం లేచింది మొదలుకొని టీవీ చూడడం ప్రారంభించి. టీవీని ఆఫ్ చేయనే చేయలేదు. సాయంత్రం బాస్కెట్ బాల్ ప్రాక్టీస్ కూడా వెళ్లడం మర్చిపోయి టీవీ చూస్తూ ఉండిపోయింది. దాన్ని చూచిన వాళ్ళ అమ్మ తట్టుకోలేకపోయింది. కయల్ ఎందుకమ్మా ప్రాక్టీస్ కి వెళ్ళలేదు అని అడిగింది అమ్మ. లేదమ్మా అది నాకు సెట్ అవ్వదు అని చెప్పింది కయలు. ఏమైంది ఎందుకు అని కనికరము కలిగిన స్వరముతో అడిగారు అమ్మ. నిన్న మా స్కూల్లో లాంగ్ జంప్ కోటి పెట్టారు అని చెప్పేటప్పుడే కళ్ళల్లో కన్నీరు కారింది. నేను పాల్గొన్నాను మా సార్ అందరినీ వరుసలో నిల్చోబెట్టి పరిగెత్తమని ఎత్తయిన ఆ స్థలమును దాటమన్నారు. నేను పరిగెత్తుకుని వచ్చినప్పుడు బోల్తా కొట్టి పడిపోయాను. అబ్బాయిలందరూ కూడా నన్ను చూసి నవ్వారు అని చెప్పి ఏడవడం ప్రారంభించింది.

 

హలో పిల్లలు మీరు కూడా స్కూల్లో జరిగిన విషయాలను మీ అమ్మానాన్నతో పంచుకుంటారు కాదు. చేయాలి వెరీ గుడ్. తరచుగా కయలు చెప్తూ ఉండేది. అందుకని ఇవన్నీ నాకు సెట్ అవ్వమ్మ చక్కగా చదువుకొని టీవీ చూసి ఇంట్లో ఉంటాను అని చెప్పింది. ఓహో అలాగా సరే అని అమ్మ చెప్పి నేను ఒకటి అడుగుతాను దానికి జవాబు చెప్పు అన్నారు. ఉదయం నుండి టీవీ చూసావు కదా ఆ టీవీని కనుక్కున్నది ఎవరో తెలుసా అని అడిగారు అమ్మ. జాన్ యోహి యార్డ్ అని జవాబు చెప్పింది కయల్. వెంటనే బుజ్జగించి అమ్మ సూపర్ అని అన్నారు.

 

ఆయన టీవీ ను తయారు చేసినప్పుడు హఠాత్తుగా ఆయన చేతిలో 1000 ఓల్డ్ గలిగిన కరెంట్ షాక్ కొట్టి తన చేతులన్నీ కూడా కాలిపోయాయి. అందుకొరకు భయపడి ఆయన తన పరిశోధనలు విడిచిపెట్టలేదు. కఠినంగా ప్రయాసపడ్డాడు తర్వాత మూడు సంవత్సరాలలో చక్కని టీవీని కనుగొని ఈ లోకానికి బహుమానంగా ఇచ్చారు. అనేక కష్టాలను దాటుకొని వచ్చిన వాళ్లే సాధించగలరు అని అమ్మ యొక్క నిరీక్షణ ఇచ్చే మాటలు కాయల్ కు నూతన ఉజ్జీవాన్ని కలిగించింది. నేను కూడా సాధించగలను అనే నిరీక్షణ చిగురించడం ప్రారంభించింది.

 

హలో పిల్లలు కయలు తల్లిగారు మాట నిన్ను కూడా ఉత్సాహపరిచి ఉంటుందని నేను నమ్ముతున్నాను. మీరు కూడా ప్రభువు దయవల్ల సాధించగలరు. ఓకేనా!

- శ్రీమతి. జీవా విజయ్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet