Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 10.08.2024
Share:

By Village Missionary Movement

Saturday, 10-Aug-2024

దిన ధ్యానము(Telugu) 10.08.2024

 

అంశం:- చిన్న గాలి

 

“ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనియ్యుడి” - కొలస్సీయులకు 4:6

 

ఊహియో ప్రాంతంలో నిర్మించబడిన కోర్ట్ ఒక శ్రేష్టమైన విధానంలో కట్టబడి ఉన్నది. ఆ కోర్టు ఉత్తర భాగమున వర్షములు పడేటప్పుడు అది ఆ కట్టడం పైన జారి సెయింట్ క్లారెన్స్ అనే సముద్రంలోనికి వెళ్లి చేరుతుంది. ఆ కట్టడం యొక్క దక్షిణ భాగంలో పడుతున్న వర్షము వలన మిసిసిటీ నదిలో కలిసి మెక్సికో ప్రాంతంలో గల నీటిలో కలుస్తాయి. వర్షాలు కూడా దక్షిణం వైపు పడుతుందా లేదా ఉత్తరం వైపు పడుతుందా అన్నది దానిపైన విసురుతున్న గాలి మీద ఆధారపడి ఉంటుంది. ఒకే వర్షపు నీరు తాను ఒక కట్టడం పైన పడుతుంది కానీ అవి చేరుకున్న స్థలాలు రెండు వేరే వేరే స్థలాలుగా ఉన్నాయి. రెండిటికి మధ్యలో ఇంచుమించు 2000 మైళ్ళు.

 

అలాగే మన మిత్రులకు చేసిన కార్యాలకు కూడా మాట్లాడే మాటలు కూడా ఇతరుల యొక్క మార్గాన్ని మార్చేస్తుంది. మనము వాళ్ళ పైన చూపిస్తున్న దయ, ప్రేమ, దేవుని మాటలు వాళ్లను పాతాళమునకు వెళ్లే వారైనా వాళ్లను తప్పించి పరలోక మార్గంలోనికి తీసుకోని వెళుతుంది. ఒక సమరయుడు మార్గ మధ్యలో మరణపాయకర స్థితిలో పడి ఉండిన ఆ సమరయుడు చూపించిన ప్రేమ వలన దేవుని నుంచి మంచి సమరయుడు అని మంచి పేరు బైబిల్ లో పొందుకొని ఉన్నాడు. అలాగే తనను బానిసగా తీసుకుని వచ్చిన సిరియా సైన్యాధిపతి నైమాను వద్ద ప్రేమతోనో, దయతోనే ఉండిన ఆ చిన్నది చెప్పిన మాట ఆ సైనికుడికి మాత్రమే కాదు ఆ సిరియా దేశమంతా కూడా దేవున్ని తెలుసుకొనుటకు మార్గాన్ని చూపించింది.

 

మనము ఇతరులతో మాట్లాడుతున్న కార్యాలు, చేసే కార్యాలు ఎలా ఉంటున్నాయి అనేదాన్ని మనం ఆలోచిద్దాం. అనేక పనుల అవసరంలో వెళ్లి ఉంటాడు సమరయుడు కానీ వాటన్నిటినీ పక్కనపెట్టి ఒక వ్యక్తికి సహాయం చేయడం వలన తన సమయాన్ని, తన వస్తువులను, తన ధనం అంతటినీ ఆ వ్యక్తి కొరకు ఖర్చు పెట్టాడు. మనకు ఇవ్వబడిన సమస్తాన్ని అనేక మందికి ప్రయోజనకరమైన విధానంలో ఇలా మార్చాలి అనేదాన్ని ఆలోచించి ఇతరులకు ప్రయోజన కరముగా మార్చేటప్పుడు అది వారి యొక్క జీవితాన్ని మారుస్తుంది.

 

దీనిని చదువుతున్న స్నేహితులారా! మీకు ఉన్నదాన్ని ఇతరులతో, అవసరతలలో కలిగిన వారితో పంచుకొనుడి. నాకు సదుపాయాలు లేవే నా యొద్ద పంచుకొనుటకు ఏమున్నవి అని అంటున్నారా దేవుడు రక్తము చేత కడగబడిన మీ హృదయం ఉన్నది. మీ యొక్క పెదవులు మంచిగా మాట్లాడగలిగిన బలము కలిగినది అది చాలు ఇతరులతో వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా దేవుని మాటలను దేవుడు నామాన్ని మహిమ కలిగించే మాటలు మాత్రమే మాట్లాడండి. అది వారి హృదయంలో నాటుకు పోతుంది. వారిని దేవుని వైపునకు నడిపిస్తుంది. రోజు చదివే దేవుని వాక్యముతో మాట్లాడండి అనేక మంది దేవుని రాజ్యము వైపు నడుచుటకు అది సహాయపడుతుంది.

- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్ గారు 

 

ప్రార్థన అంశం:- 

యవనస్తుల క్యాంపుకు వస్తున్న యవ్వనస్తులు దేవుని ఆత్మ చేత పట్టబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio royalbet betpas giriş milanobet bahiscasino betpas bahiscasino atlasbet romabet giriş holiganbet giriş bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom romabet betpas