By Village Missionary Movement
Tuesday, 06-Aug-2024దిన ధ్యానము(Telugu) 06.08.2024
అంశం:- శోధన
"యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును" - యిర్మియా 17:7
ఆ స్కూల్లోనే పరుగుపందెంలో శ్రేష్టమైనవాడు అని పేరు రాజుకి కలదు. ఆయన ఆ స్కూల్ కొరకు తెచ్చిపెట్టిన బహుమతులు అనేకం ఉన్నాయి. అదే స్కూల్లో పీటర్ అనే విద్యార్థి కొత్తగా చేరాడు. పీటర్ ఏ పోటీకైనా మోకరించి ప్రార్థించి వెళ్లేవాడు. అలానే మొదటి బహుమతులు సంపాదించుకునే వాడు. రాజు రెండుసార్లు పీటర్ యొద్ద ఓడిపోయాడు. కోపగించుకున్న రాజు ఈసారి నాకే మొదటి బహుమతి వస్తుంది అని చెప్పుకున్నాడు. ఆ పోటీ జరిగే దినమున మొదటి వ్యక్తిగా పరిగెడుతూ వచ్చాడు రాజు కానీ ఆ పోటీలో పీటర్ కి మొదటి బహుమతి అని ప్రకటించబడినప్పుడు దిగ్భ్రాంతికి గురయ్యాడు రాజు కారణం ఏమిటి అంటే ఆయన కొరకు నిర్ణయించబడిన రెండవ ట్రాక్లో పరిగెత్తకుండా మారి నాలుగో ట్రాక్లో పరిగెత్తి మొట్టమొదటి స్థానానికి వచ్చాడు కానీ చివరికి రాజు సిగ్గుతో తలవంచుకున్నాడు.
బైబిల్లో కూడా తనను చక్కని దేశమైన కానానుకు తీసుకొని వచ్చిన దేవుడు కచ్చితంగా కరువు కాలంలో కూడా పోషిస్తారు అని నమ్మకుండా అబ్రహాము ఐగుప్తులోనికి వెళ్లి అనేక శోధనలకు గురయ్యాడు. అదే సమయంలో అలానే మోషే కూడా అనేక లక్షల కోలది మంది ప్రజలను ఐగుప్తునుండి నడిపించి కానానుకు చేరుకునేటప్పుడు ఆ బండను చూచి మాట్లాడమని దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని మరిచి పూర్వం చేసినట్లే ఆ బండను కొడుతున్నాడు. ఆ బండ నుండి నీళ్లు వచ్చినప్పటికీ ఆయన కానానుకు చేరుకోలేకపోయాడు. మనము మన ఆలోచనల ప్రకారము జీవించుటకు ప్రయత్నించకూడదు. యేసు ప్రభువు మన కంటికి కనబడుతున్న కార్యాలు చూచి తీర్పు తీర్చకూడదు మన వింటున్న వాటిని బట్టి తీర్పు చేయకూడదు అంటున్నారు (యెషయా 11: 3) మనకు కూడా శోధనలు వచ్చే కాలంలో మన ఆలోచన ప్రకారం దేవుని వైపు ఎదురుచూద్దాం. ఆయనే శోధన కాలంలో తప్పించుకోగలిగిన మార్గాన్ని మనకు చూపిస్తారు. శోధన జయించుటకు బలాన్ని ఇస్తారు. ఈ లోకంలో నూరంతల దీవెనలు, పరమందు ఉన్న కానానును సొంతము చేసుకొనుటకు తన సహాయము చేస్తారు.
- శ్రీమతి. జాస్మిన్ పాల్ గారు
ప్రార్థన అంశం:-
క్యాంపులో పాల్గొబోతున్న యవ్వనస్తులు తీసుకోబోతున్నటువంటి నిర్ణయాలలో దృఢంగా నిలబడేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250