Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 04.08.2024 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 04-Aug-2024

దిన ధ్యానము(Telugu) 04.08.2024 (Kids Special)

 

దిన ధ్యానం(కిడ్స్ స్పెషల్)

 

“యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు” - యోహాను 14:6

 

హలో పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారా ? మంచిగా భోజనం చేస్తున్నారా అమ్మ ఇచ్చే ఆహారమును వేస్ట్ చేయకుండా తినాలి తరచుగా హోటల్లో తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లి టాబ్లెట్ తినవలసి వస్తది. అలాగు వద్దు కదా ? హెల్తీ ఫుడ్ తిని హెల్తీగా ఉండాలి. ఓకే పిల్లలు కథ ఉంటామా ?

 

ఒక రాజు ఉండేవారు ఈ రాజుని రాజభవనంలోనికి తీసుకొని వెళ్లడానికి ఒక్క ఏనుగు చాలా చక్కగా అలంకరించబడి రెడీగా ఉండేది. ఇప్పుడు ఉన్న కారు అప్పుడు లేదు అందువలన ఏనుగు మీద రాజును కూర్చో పెట్టి ఒక పెద్ద సైన్యము ఆయన వెనక వెళ్తుంది. రాజుని చూచుటకు ప్రజలు వరుసలో నిలబడి ఉన్నారు. అలా వెళుతూ ఉండేటప్పుడు ఒక కుక్క వెనక వచ్చి అరుస్తూ ఉంది. హరే ఈ ఏనుగు ఒక దెబ్బ వేస్తే అంతే కుక్క పని అయిపోతుంది. కానీ ఏనుగు ప్రశాంతంగా వస్తుందే అని అందరు ఆశ్చర్యపోయారు .

 

ఏనుగు ఏమి ఆలోచించింది తెలుసా నేను కుక్కను చూసి ఏదైనా చేయడం పోయి అది రాజ్ కి య భయాన్ని ఇబ్బంది కలిగించకూడదు .రాజును జాగ్రత్తగా రాజ్య భవనంలోనికి తీసుకొని వెళ్లాలి ఇదే నా పని. దాన్ని నేను చక్కగా బాధ్యతను నెరవేర్చాలి అని తలచుకొని కుక్కను పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. రాజుని సంతోషముతో ఏనుగు రాజ భవనంలోనికి చేర్చింది 

 

కథ విన్నారు కదా పిల్లలు.ఈ ఏనుగు కలిగి ఉంటున్న గుణాతిశయము మనకు కూడా ఉండాలి . కుక్క అరిసినా మనం రాజుని జాగ్రత్తగా తీసుకువెళ్లాలి అలాగే మీలోనూ యేసు రాజు ఉన్నారు ఆయనను కష్టపడే విధంగా ఎలాంటి పని చేయకూడదు. హోంవర్క్ చేయకుండా మిస్ నీ మోసగించడం టెస్టులో పక్క వాళ్ళని చూసి రాయడం లోబడకుండా ఉండడం అని చెబుతూ వెళ్ళవచ్చు. ఇలాంటి కార్యాలు మనలను పరలోకానికి వెళ్ళనివ్వకుండా ఆటంగ పరుస్తుంది. యేసు రాజును నీవు విడవకుండా పట్టుకుని పరలోకం వెళ్లాలి. యేసు లేకుండా పరలోకం వెళ్ళలేరు. పిల్లలు నేను చెప్పేది మీకు అర్థం అవుతుందా? ఓకే బాయ్.

- సిస్టర్. దేబోరా .

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al