By Village Missionary Movement
Thursday, 01-Aug-2024దిన ధ్యానము(Telugu) 01.08.2024
అంశం:- బంధకాలను తెంచుదము
"వారి కాడిమ్రాను నీమీద ఇక మోపకుండ నేను దాని విరుగగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును" - నహూము 1:13
ఒక గ్రామంలో నేను చిన్నపిల్లల పరిచర్య చేస్తూ ఉన్నాను. చిన్నపిల్లలకు పాటలు కథలు నేర్పించేటప్పుడు ఒక చిన్న బాలుడు చాలా అల్లరి చేస్తూ మిగతా పిల్లలను ఆలకించినవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టేవాడు. నాకు అతని మీద చాలా కోపం వచ్చింది. అంతా అయిపోయిన తర్వాత నేను పిల్లలతో కంటత వాక్యం చెప్పమని అడిగాను అప్పుడు ఆ బాబును కూడా అడిగాను. వాడు అ అ అ అని తడబడుతూ వాక్యాన్ని చెప్పాడు. నేను ఎంత సమయము అని చూడకుండా ఆడుకుంటున్నాడు అని ఆలోచించుకొని ఇప్పుడు చెప్పరా చూస్తాను అని కొట్టడానికి చేయి పైకి ఎత్తాను. వెంటనే ఆయన వాక్యాన్ని చెప్పేసాడు. ప్రార్థించి ముగించి పిల్లల్ని పంపించేటప్పుడు నేను వెళుతుండగా ఆ బాబు తన తల్లితో వచ్చాడు. దానిని చూసి నేను భయపడిపోయి అంతే ఈరోజు మనకు దెబ్బలు పడబోతున్నాయి అనుకున్నాను. కానీ ఆమె అయితే నా కుమారుడు ఇన్ని రోజులు మాట్లాడలేని ముగవాడిగా ఉన్నాడు ఇప్పుడు బాగా మాట్లాడగలుగుతున్నారు ఏమి చేశారు తమ్ముడు అని అడిగింది. నేను యేసయ్య గురించి ఆమెకు చెప్పి ఆయన అద్భుతం చేశారు అని అన్నాను.
ఇలాగే పాపపు బంధకాలతో, శాపముతో బంధింపబడి కదలలేని పరిస్థితిలో ఉన్నవారు మన చుట్టూ అనేకులు ఉన్నారు. మీరు లేచి బయలుదేరి వెళ్ళండి మీ ద్వారా యేసయ్య అనేకమంది బంధకాలు తెంపుటకు సిద్ధంగా ఉన్నారు. విశ్వాసం ఉంచితే చాలు ఇలాగే యేసయ్య శిష్యులలో రోగము గల ఒక కుమారుడిని ఒక తండ్రి తీసుకొని వచ్చారు. వారు ప్రార్థించి స్వస్థపరచలేకపోయారు వెంటనే యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చారు. అప్పుడు ఆయన ప్రార్థన చేసి ఆ కుమారుడికి స్వస్థత దయచేశారు. వెంటనే శిష్యులు మావల్ల ఎందుకు ఈ పని జరగలేదు అని అడిగారు అందుకు యేసయ్య మీకు విశ్వాసం లేనందువలన అని అన్నారు. పేతురు కొరకు సంఘస్తులు కలిసి ప్రార్ధించినప్పుడు పేతురు యొక్క బంధకాలు తెంచి వేయబడ్డాయి.
ఇప్పుడు దీన్ని చదువుతున్న స్నేహితులారా ఇలాగే బంధింపబడిన వారిగా విమోచన కొరకు గ్రామాలలో మీ ప్రాంతంలో అనేకులు ఉన్నారు. మీరు బయలుదేరి వెళ్ళుడి లేనియెడల వారిని యేసు వద్దకు తీసుకుని రండి. ఈ నెల 15వ తారీఖున యవనస్తుల బంధకముల నుండి విడిపించబడాలి అని యవనస్తులు ఉజ్జీవపు కూటమును ఏర్పాటు చేసాం. తిరుచి మొరాయి సిటీలో పెట్టి యవ్వనస్తుల మధ్య ఉద్యమం రావాలి అని ప్రయత్నం చేస్తున్నాం. మీ ఇంటిలో ఉన్న యవ్వనస్తులను మీ ఇంటి పక్కన ఉన్న యవ్వనస్తులను తీసుకొని రండి. వారు వారికున్న బంధకాల నుంచి విడిపించబడి ఉజ్జీవాన్ని పొందుకుంటారు.
- బ్రదర్. కే. డేవిడ్ గణేష్ గారు
ప్రార్థన అంశం:-
తిరుచిలో జరగబోతున్న యవ్వనస్తులకు ఉజ్జీవపు కుటమునకు లక్ష మంది యవ్వనస్తులు పాల్గొనేటట్లు ప్రార్థద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250