Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 22.04.2021
Share:

By Village Missionary Movement

Friday, 23-Apr-2021

దిన ధ్యానము(Telugu) 22.04.2021

క్షమాపణ యొక్క ప్రారంభము.
 
"…ప్రభువు (క్రీస్తు)మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి” - కొలస్సీయులకు 3: 13

అమెరికా హైడాహో అనే పట్టణములో హెరి ఆర్చర్ అనే వ్యక్తి ఆ పట్టణమునకు గవర్నర్ గా ఉండిన ఫ్రాంక్ స్టూడెంట్ బర్గ్ అనే వ్యక్తిని బాంబులు పెట్టి చంపేశారు. అందువలన ఆయనకు జీవితకాల శిక్ష విధించబడి చెరసాలలో బందించబడ్డాడు. ఒక వైద్యుడు చికాగో నుండి ఒక బైబిల్ ను అయనకు పంపించాడు. కాని అతనికి ఆ బైబిల్ పైన ఎంత మాత్రము ఆశక్తి లేదు. కాని ఆ నల్లటి అట్ట కలిగిన పుస్తకం మీద ఆయనకు ఆశక్తి కలుగుట అతను గ్రహించాడు. ఒక రోజు దానిని ఆ గడిలోనుంది తీసివేయమని అక్కడ ఉన్న అధికారితో చెప్పాడు. కాని ఏమైందో తెలియదు కాని మరల దానిని తెప్పించుకొని చదవడం ప్రారంభించాడు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయడం ప్రారంభించారు.

ఒక దినము హెరి ని చూచుటకు ఒక యవ్వనస్తుడు వచ్చాడు. మా అమ్మగారు దీనిని మీకు ఇవ్వమని చెప్పి ఒక పార్సిల్ ను ఇచ్చాడు. మీరు చేసిన నేరమును క్షమించి వేశాము అని వ్రాయబడి ఉంది. ఆ పార్సిల్ లో క్రీస్తు యొద్దకు వెళ్లే మెట్లు అనే పుస్తకం ఉంది. ఆ యవ్వనస్తుడు ఎవరో కాదు హెరి వలన చంపబడిన గవర్నర్ యొక్క కుమారుడు. హెరి ఆ పుస్తకాన్ని చదివి తన యొక్క జీవితాన్ని యేసయ్యకు సమర్పించుకున్నాడు. తరువాత గవర్నర్ యొక్క భార్య హెరిని దర్శించి అనేక ఆత్మీయ పుస్తకాలను హెరికి ఇచ్చారు ఆమె. నిజమైన మారుమనస్సును పొంది చెరసాలలో నుండి బయటకు వచ్చి సమర్పణ కలిగిన క్రైస్తవునిగా హెరి జీవించారు. 

పరిశుద్ధ బైబిల్లో తనకు కీడు చేసిన వాళ్ళను కూడా మనస్ఫూర్తిగా అంగీకరించి క్షమించిన వ్యక్తుల గురించి చదువుతున్నాం. యోసేపు, దావీదు, స్టెపెను అనే వాళ్ళ గురించి చదువుతున్నాం. వీరు తమకు కీడు చేసిన వాళ్లకు ప్రతి కీడు చేయకుండా  మేలు చేశారు. అన్నింటికీ పైగా యేసుక్రీస్తు తనను సిలువలో వేసి, ముఖం మీద ఉమ్మి, తన ప్రక్కలో బల్లెపు పోటును పొడిచిన, కొరడాలతో కొట్టిన అందరి కొరకు తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తున్నారు. తండ్రి వీరేమి చేయు చున్నారో వీరెరుగక యున్నారు వీళ్ళను క్షమించు అని ప్రార్థిస్తున్నారు. 

దేవుని యందు ప్రియమైన వారలారా! మనకు కీడు చేసిన వాళ్లకొరకు ప్రార్థన చేస్తున్నామా ఒక వేళ అలా చేయగలిగితే వాళ్లను క్షమించుటకు సులువుగా మారిపోతుంది. వాళ్ళ యొక్క ఆత్మ మీద మనకు కనికరం ఏర్పడుతుంది. నిత్యం వాళ్ల యొక్క రక్షణ కొరకు మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎవరినైన రక్షించుటకు శక్తిమంతుడైన దేవుడు వాళ్ళను రక్షిస్తారు. అవును క్షమాపణ యొక్క ప్రారంభం ప్రార్ధనలో ప్రారంభం అవ్వనివ్వండి. 
-    బ్రదర్. పి. శివ

ప్రార్థన అంశం:-
గ్రామాల్లో నడిపించ బడుతున్న యవ్వనస్తులు, చిన్న పిల్లలు యేసుని విడిచిపెట్టి వెనుకకు వెళ్లిపోకుండా ఉండులాగున ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet güncel giriş holiganbet holiganbet giriş casibom giriş casibom casibom giriş casibom matbet matbet giriş casibom casibom giriş supertotobet supertotobet giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş ngsbahis ngsbahis giriş matbet matbet giriş casibom casibom giriş nakitbahis nakitbahis giriş marsbahis marsbahis giriş interbahis interbahis giriş mariobet mariobet giriş betpas betpas giriş artemisbet artemisbet giriş betsmove betsmove giriş restbet restbet giriş egebet egebet giriş https://yourfilterconnection.com/ jojobet jojobet giriş Hiltonbet Hiltonbet giriş jojobet alobet alobet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş holiganbet holiganbet giriş jojobet jojobet giriş jojobet jojobet giriş pashagaming tarafbet editörbet perabet perabet giriş grandbetting hitbet xslot betkom giriş betkanyon giriş perabet perabet giriş jojobet holiganbet jojobet cratosroyalbet betgit jojobet betpuan gameofbet grandpashabet grandpashabet teosbet holiganbet Hiltonbet Hiltonbet giriş grandpashabet imajbet matbet grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel