By Village Missionary Movement
Wednesday, 31-Jul-2024దిన ధ్యానము(Telugu) 31.07.2024
అంశం:- సమయం ఆలస్యము చేయకము
"అనుకూల సమయమందు నీ మొరనాలకించితిని; రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా!" - 2 కోరింథీయులకు 6:2
డిఎల్ మూడీ ప్రసంగీకుడు చికాగో నగరంలో కూడిక ఒకటి నడిపిస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద వ్యాపారి ఆ కూడికలో చాలా ఆసక్తితో పాల్గొన్నారు. కానీ ఆయన యేసయ్యను నమ్ముకొనుట తిరస్కరించాడు. ప్రతి దినము కన్నీటితో మూడీ ప్రసంగిస్తూ సలహాలు ఇచ్చినప్పటికీ అయ్యా కొంచెం అవకాశం ఇవ్వండి నాతోపాటు వ్యాపారం చేసిన వ్యక్తి రక్షింపబడని వ్యక్తి కాబట్టి ఆయన నన్ను హేళన చేస్తారు. నేను వ్యాపారిగా ఉన్నందువలన నేను ఆయనను అంగీకరించలేను అని చెప్పారు. మరల మరల మూడి యేసయ్య గురించి చెప్పడం కొనసాగించినప్పుడు ఆయన మందిరమునకు రావడం మానేశాడు. కొన్ని నెలల తర్వాత ఆయన రోగి అయి మరల స్వస్థపరచబడ్డాడు అప్పుడు యేసుని అంగీకరిస్తాను అని అంగీకరించాడు అప్పుడు మూడీ ఆయన కొరకు ప్రార్ధించినప్పుడు స్వస్థత పొందుకున్నాడు. మరల యేసయ్యను తిరస్కరించిన తర్వాత ఆయన మరల వ్యాధి బారిన పడ్డాడు. తరువాత ఆయన మరణించారు. మరణించే సమయంలో ఆయన ఆఖరి మాట ఇదే కోతకాలము వెళ్ళిపోయింది వేసవి కాలము సమాప్తమైనది అన్నదే.
యేసయ్యతోపాటు సిలువ వేయబడిన దొంగలు ఇద్దరిలో ఒకడు తనకు ఇవ్వబడిన సమయాన్ని సరిగా వాడుకోని పరదేశి జీవితాన్ని పొందుకున్నాడు. మరియొక దొంగ అయితే సిలువలో ఉండి తనను విడిపిస్తే ఆయనకు బలం ఉన్నదని నమ్ముతాను అని చెప్పాడు. ఆఖరికి నష్టపోయినది ఆయనే. మనము యేసయ్యని ఎరగకపోతే ఎరుగుటకు ఇది చివరి అవకాశం అనుకొని వెంటనే అంగీకరించాలి. మరియొక అవకాశం దొరుకుతుంది అని చెప్పడానికి మనకు లేదు దీంట్లో ఒకవేళ అలా చేయకపోతే వ్యర్ధమైనది మీ జీవితమే. పరదేశ జీవితాన్ని కోల్పోతారు అందువలన ఈ దినమే ఆయనను విశ్వసించి ఆయనను అంగీకరించిన దొంగ వలె పరదేశి జీవితాన్ని పొందుకొనుడి. ఈ తరుణాన్ని విడిచిపెట్టిన యెడల మరియొక అవకాశం మీకు దొరకకపోవచ్చు.
యేసయ్య మిమ్మల్ని పరలోకము చేర్చేవాడు మీకు వచ్చే నష్టాల నుండి మిమ్మల్ని విమోచించుటకు ఆయన సమర్థుడు. ఈ పరదేశి జీవితాన్ని పొందుకొనుటకు యేసయ్య నా హృదయములోనికి రండి అని మన పాపాన్ని విడిచిపెట్టి ఆయనను వేడుకుంటే చాలు అంత మాత్రమే కాదు బైబిలు చదివి ఆయనను వెంబడిస్తే ఆయనతో కలిసి ఉండగలం. అప్పుడు ఆయన నిత్యజీవాన్ని మనము పొందుకొని దేవునితో నడిచే బంధాన్ని భూమి పైన ఉన్నంతకాలం మన కాపాడుకోగలం.
- శ్రీమతి. గ్రేస్ జీవమని గారు
ప్రార్థన అంశం:
సేవకులు నివసించుటకు గదులు కట్టించే షునేమీరాలు లేచేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250