Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 29.07.2024
Share:

By Village Missionary Movement

Monday, 29-Jul-2024

దిన ధ్యానము(Telugu) 29.07.2024

 

అంశం:- కార్యాలు మారుట 

 

"దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము" - రోమీయులకు 8:28

 

అశ్వరోషు రాజు తన రాజ్యంలో నాశనం నుండి తప్పించబడిన యూదులు ,అగ్నిగుండం నుండి తప్పించబడి ఎలాంటి హాని కలగకుండా బయటకు వచ్చిన షడ్రక్ మేషక్ ఆబేద్నగో మరియు సింహపు నోటి నుండి తప్పించబడిన దానియేలు, దేవుడైన యెహోవా చేత మరణ దినము ప్రకటించబడి ప్రార్థించి 15 సంవత్సరాలు ఆయుష్ పొందుకున్న హిజ్కియా రాజు వీళ్ళ కార్యాలు మేలు కలుగుటకే సంపూర్ణముగా ముగించబడిన దాన్ని చూసినప్పుడు మన యొక్క కార్యాలు కూడా మనము కోరుకున్న విధముగా మేలు కరముగా జరుగుటకు మనము కోరుకొనుట సాధారణమే. కానీ దీని గురించి బైబిల్ మనకు ఏమి నేర్పిస్తుందో దానిని ఈ దినం మనం ధ్యానిద్దాం.

 

మొదటిగా మనం అడుగుతున్న కార్యాలు దేవుని చిత్తానసారముగా ఉండిన యెడల వాటిని మనం పొందుకుంటాం. 1 యోహాను 5:14 యూదులు నాశనము నుండి తప్పించబడాలి అన్నది దేవుని చిత్తమై ఉన్నది అయినప్పటికీ ఎస్తేరు మరియు ఆమె పనివారు అలానే యూదులు అందరూ మూడు దినములు ఉపవాసం ఉండి ప్రార్థించుట అవసరమై ఉన్నది. దానియేలు మరియు ఆయన స్నేహితులు దేవుని పేరట పెంచుకున్న పౌరుషము మరియు విశ్వాసము ద్వారా రాజ భవనంలో దేవుని నామము మహిమ పరచబడుటకు వారి యొక్క కార్యాలు విజయవంతంగా మారాయి. హిజ్కియా రాజు యొక్క కన్నీటితో కూడిన విజ్ఞాపన ప్రవక్త అయిన యెషయ ప్రవచనాన్ని మార్చి వేసింది.

 

ప్రియమైన వారలారా! దేవుని చిత్తమైతే మనము ఉపవాసముతోనూ, కన్నీటితోనో చేస్తున్న ప్రార్థనలో మేలు కలిగేటట్లు దేవుడు చేయగలరు. మనము దేవుని కొరకు పౌరుషము గల క్రైస్తవులుగా జీవించేటప్పుడు మనకు వ్యతిరేకంగా రూపించబడుతున్న ఏ ఆయుధం కూడా నిలవదు. మనలను వ్యతిరేకించే వారు కూడా మన పక్షమున వస్తారు. అదే సమయంలో మన కార్యాలు మనం కోరుకునే విధంగా మారకపోయినా ఎలాంటి అననుకూలమైన పరిస్థితిలో నడిచి వెళ్ళవలసి వచ్చిన దేవుడు మనకు బలాన్ని ఇస్తారు. ఆయనను ప్రేమించే వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతున్నది అనే సత్యాన్ని ఎరిగి కదల్చబడకుండా విశ్వసించే వారిగా మనం ఉండాలి. మనము ఆయనను ప్రేమించిన వారిగా ఉన్నాము అనే విశ్వాసము చాలా అవసరం. ఇవి మనకు ఉంటే మన క్రైస్తవ జీవితం బండమీద పునాది వేయబడిన ఇల్లు వలె అన్ని పరిస్థితుల్లో కూడా దృఢముగా నిలబడుతుంది. ఆమెన్! 

- శ్రీమతి. గీత రిచర్డ్ గారు.

 

ప్రార్థన అంశం:-

మన క్యాంపస్లో జరుగుతున్న కట్టడ పనుల కొరకు వాటి అవసరతలు తీర్చబడేటట్లు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet kingbetting kingbetting giriş lunabet lunabet giriş rulobet betpas atlasbet grandpashabet