Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 19.07.2024
Share:

By Village Missionary Movement

Friday, 19-Jul-2024

దిన ధ్యానము(Telugu) 19.07.2024

 

అంశం:- నీ కొరకు 

 

"ఈ నా కుమారుడు చనిపోయిమరల బ్రదికెను, తప్పిపోయి దొరకెనని చెప్పెను; అంతట వారు సంతోషపడసాగిరి" - లూకా 15:24

 

అది ఒక అందమైన రోడ్డు. ఒక యవ్వనస్తుడు యేసయ్యతో కలిసి నడుస్తూ ఉన్నాడు. ప్రభువుతో మాట్లాడుతున్న మాటలు ఆ యవ్వనస్తుడికి చాలా సంతోషాన్ని కలిగించాయి కానీ కొంత దూరం వెళ్లేసరికి కొత్తగా ఒక రోడ్డులో రంగురంగుల లైట్లు ఆకర్షించే విధముగా కార్యాలను ఆయన చూశాడు. వెంటనే ఆయన యేసయ్య వైపు చూసి యేసయ్య ఇది ఒక మంచి రోడ్డు వల్లే కనబడుతుంది రండి ఈ ఈ మార్గం గుండా వెళ్దాం అని అన్నాడు. అందుకు యేసయ్య నీవు అటువైపు వెళ్ళకూడదు అది నిన్ను నిత్యం లోనికి నడిపించుదు అని అన్నాడు. వెంటనే ఆ యవ్వనస్తుడికి కోపం వచ్చింది మీరు రాకపోతే పర్వాలేదు నేను వెళ్తాను అని యేసయ్యను విడిచిపెట్టి ఆ రోడ్డులో ఒంటరిగా వెళ్ళాడు. కొన్ని దినములు జాలిగా తిరిగాడు. తర్వాత ఆయన హృదయంలో తెలియని బాధ చోటుచేసుకుంది ఆలోచించి చూసాడు ఏడ్చాడు ఏమి చేయాలో తోచక వచ్చినదారిలో మరలా వెనక్కి నడిచాడు. యేసుతో నడిచిన దినాలు గుర్తుకు వచ్చాయి అయ్యో ఆయనను విడిచి పెట్టేసానే అని కన్నీరు కారుస్తూ నడుచుకుని వెనక్కి వచ్చాడు. ఆశ్చర్యమేమిటంటే ఏ స్థలమందు అయితే యేసయ్యను విడిచి వెళ్ళాడో అదే స్థలములో యేసయ్య ఆయన కొరకు వేచి ఉన్నాడు. పరిగెత్తుకుని వచ్చి యేసయ్యను కౌగిలించుకుని ఏడ్చాడు. యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో చూశారా?

 

ఇలానే బైబిల్లో కూడా లూకా సువార్త 15వ అధ్యాయంలో చిన్న కుమారుడు తనకు రావలసిన ఆస్తి తీసుకుని వెళ్లి సమస్తమును ఆయన కోల్పోయి బుద్ధి వచ్చిన వాడిగా దుఃఖపడి మరల తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు. తండ్రి తన కుమారుడిని దూరం నుండే చూసి పరిగెత్తుకొని వచ్చి మెడ పైన పడి కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నారు. సంతోషంగా ఇద్దరు ఉన్నారు.

 

దీనిని చదువుతున్న ప్రియ సహోదరి సహోదరుడా ఒక దినము నీవు యేసయ్యతో సంతోషంగా నడిచావు కానీ ఈరోజు నీ సంతోషం ఎక్కడ? నీ దారి మళ్లించింది ఎవరు? మనుషుల? డబ్బా? సెల్ఫోన్? లేక నువ్వు చేస్తున్న ఉద్యోగమా లేక ఇంకా ఏ కార్యము అనేది ఆలోచించి చూడండి. అప్పుడే ఏమి అయిపోలేదు మునిగిపోలేదు యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు వేచి ఉన్నారు. రెండు హస్తాలు చాపి ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ ప్రేమ గల దేవుడు లోకంలో రక్షింపబడని ప్రతి ఒక్కరి కొరకు కన్నీరు కారుస్తున్నారు, వేచి ఉన్నారు. చిన్నారుల మధ్యలో గ్రామాల మధ్యలో నిలబడి ఆయన చేతులు చాపుతూ ఏడుస్తూ ఎదురుచూస్తూ ఉన్నారు నీవు వచ్చి ఆయన కన్నీరుని తుడుచుటకు సిద్ధమేనా? ఆలోచిద్దాం పనిచేద్దాం.

- శ్రీమతి. భువిత ఎబినేషన్ గారు 

 

ప్రార్థన అంశం:-

మన పత్రిక పరిచర్య ద్వారా అనేకులు రక్షింపబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet