Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 08.02.2021

దిన ధ్యానము(Telugu) 08.02.2021

కలిసి ప్రార్ధించండి.

"మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనినిగూర్చియైనను భూమిమీద ఏకీభవించినయెడల అది పరలోకమందున్న నాతండ్రివలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను" - మత్తయి 18: 19

ఇద్దరు ముగ్గురు స్త్రీలు కలిస్తే పక్కింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళను గురించి కధలను మాట్లాడుతూ ఇంటి పూనాదులనే కదిలింపజేసేస్తారు. అదే స్త్రీలు ఏకమనస్సు కలిగి ప్రార్థిస్తే పరలోకమునే కదిలించగలము అనే సత్యాన్ని గ్రహిస్తే దీవెన కరమైన కార్యమే. ఇలాగు వ్యర్థమైన కధలను మాట్లాడి సమయాన్ని వృధా చేసిన ముగ్గురు స్నేహితురాళ్ళు కరోనా ప్రారంభ కాలములో కఠినమైన దినములలో ప్రార్ధించాలి అని నిర్ణయించుకున్నారు. అమెరికా, ఇంగ్లండ్, ఇటలీ దేశాల్లో కరోనా యొక్క ప్రభావం గూర్చి విని ఒకరికొకరు పంచుకొని ప్రార్ధించడం ప్రారంభించారు. చివరికి వాళ్ళు ఉంటున్న వీధిలో ఒకరికి కరోనా వచ్చింది అని తెలియగానే కన్నీటితో ప్రార్ధించారు. రెండు వారాల్లో ఆ వ్యక్తి స్వస్థపరచబడి ఇంటికి వచ్చారు. అది ఇంకా ఎవరికి సోకలేదు అనే మాట విన్నప్పుడు ఇప్పుడు వరకు చేసిన ప్రార్థన యొక్క మహిమను గ్రహించిన వారిగా ఆ ప్రార్ధనను ఉత్సాహంగా నడిపిస్తున్నారు. పేతురు సువార్త ప్రకటించుట వలన ఆయనను సంకెళ్ళుతో బంధించి చెరసాలలో వేసాడు హేరోదు రాజు. అనంతరం మరణ శిక్ష విధించాలి అన్న మాట విన్న పేతురు అయితే ఎలాంటి భయము లేకుండా నిద్ర పోతున్నారు. కాని సంఘ ప్రజలు కలిసి ఉజ్జివంతో ప్రార్థిస్తున్నారు. అదే సమయంలో జైల్లో ఉన్న పేతురును దూత కొట్టి లేపుతున్నది. అప్పుడు సంకెళ్ళు తెగిపోయాయి. అప్పుడు పేతురు సంకెళ్ళు దాటుకుని సంఘస్తులు కుడి ప్రార్ధించే చోటునకు దేవదూత ద్వారా నడిపించబడ్డాడు. వారు కలిసి ప్రార్ధించే సమయంలోనే దేవుడు పని చేయడం ప్రారంభించారు. పేతురు కూడా ఇంకా పరిచర్యలో ముందుకు వెళ్ళడం ప్రారంభించారు. ఆయన వలె అనేకులు రక్షించబడి సంఘంలో చేర్చబడ్డారు. 

ప్రియమైన వారలారా! ఏకమనస్సు కలిగి గుంపుగా ప్రార్ధించే ప్రార్ధనకు బలము కలదు. ఐక్యత కలిగి ప్రార్ధించుటకు ఇదే మంచి సమయం. కాబట్టి సమయాన్ని వృధా పరచకుండా మీతో ఏదో ఒక కార్యంలో ఐక్యపడుతున్న వ్యక్తులను యేసు నామం నిమిత్తంగా ఏక మనస్సు కలిగి వారానికి ఒక రోజుఒక గంట  ప్రార్ధించుట ప్రారంభించండి. నికి దేవుడు మీకు ఇచ్చే జవాబును చూసి ఆశ్చర్యపోతారు. మీ యొక్క ప్రార్థన అనేకుల యొక్క బంధకములను తెంచుతుంది. మూయబడిన ఇనుము తలుపులను తెరుస్తుంది. ఈ దినము అనేక మంది సేవకులు, మిషనరీలు కూడా పేతురు వలె అనేకమైన  చట్టాలు, అధికారములు, కుటుంబ భారముల చేత బందింప బడిన పరిస్థితుల్లో నిద్ర మత్తులో ఉన్నారు. వారి యొక్క బంధకములు తెరవడానికి, భారంతో మెలుకువ  కలిగి పరిచర్య చేయడానికి మన ప్రార్థన అవసరం. మీ యొక్క ప్రార్థనల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నారు. ఆయుధములు చేయలేనిదాన్ని, మందు మాత్రలు చేయలేని దానిని మన మోకాళ్ళు సాదించగలవు. కనీసం వారానికి ఒక రోజైన లేదా ఒక గంట అయిన ఇద్దరు కలిసి ప్రార్ధించుటకు నిర్ణయించుకోండి. దానిని వాడుకగా ఉండనివ్వండి. తరువాత ప్రార్ధనే మీ జీవితంగా మారిపోతుంది. ఆమెన్
-    శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్

ప్రార్థన అంశం:-
బైబిల్ కాలేజిలో జాయిన్ అయిన పిల్లల యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్ధించండి.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)