Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 14.09.2024

దిన ధ్యానము(Telugu) 14.09.2024

 

అంశం: కుయుక్తి 

 

"ఇది యొకటిమాత్రము నేను కను గొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించు కొని యున్నారు" - ప్రసంగి 7:29

 

ఒక అడవిలో సింహము, పులి, ఎలుగుబంటి, కోతి ఇలా అనేక జంతువులు పక్షులు నివసిస్తూ ఉన్నాయి. సింహము అడవికి రాజుగా ఉండేది. సమస్త జంతువులు పక్షులు అన్నీ సంతోషంగా ఉండేవి. నక్కకి తాను రాజును కావాలి అని కోరిక కలిగింది. ఊరిలోనికి వెళ్ళింది తన శరీరం మీద తెల్ల రంగు గల పెయింట్ వేసుకుంది, రెండు కళ్ళు నాలుగు కాళ్లకు ఎర్ర రంగు వేయించుకుంది. నేనే అడవికి రాజు అని అన్నది. జంతువులన్నీ పక్షులన్నీ ఇది కొత్త జంతువుగా ఉన్నది అని భయపడ్డాయి. కొన్ని దినముల తర్వాత మరల నక్కలు అన్నీ కలిసి అరవడం ప్రారంభించాయి వెంటనే ఈ రాజుగా ఉన్న నక్క కూడా తన స్థితిని మరిచిపోయి అరవడం ప్రారంభించింది. నక్క యొక్క కుయుక్తి బయటపడింది. దాన్ని చూసిన సింహము, పులి దాని మీద పడి దాన్ని చంపేశాయి.

 

సమస్త జీవ జంతువుల కంటే సర్పము కుయుక్తి కలిగినదిగా ఉండేది. అందువలన సాతానుడు సర్పము ద్వారా హవ్వతో మాట్లాడి దేవుడు తిరస్కరించిన పండ్లని తినేటట్లు చేసింది. ఇందువలన ఆదాము హవ్వ దేవుని మహిమను కోల్పోయారు. ఏదేను తోటలో నుండి బయటకు వచ్చేశారు, శాపాన్ని పొందుకున్నారు. తర్వాత చూస్తే ఆదికాండము 27వ అధ్యాయములో నీ సహోదరుడు కుయుక్తితో ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అని ఇస్సాకు ఏసావుతో చెబుతున్నాడు. అందువలన సహోదరుల మధ్యలో శత్రుత్వం పెరిగింది. యాకోబు తన మామగారింటికి వెళ్తున్నాడు. తర్వాత తన భార్యలను, పిల్లలను తాను సంపాదించిన పశువులన్నీ కూడా తీసుకుని తన దేశమునకు తిరిగి వస్తున్నాడు. దానిని విన్న ఏశావు వాడికి వ్యతిరేకంగా వస్తున్నాడు. యాకోబు సాష్టాంగ పడి ఏసావును ఏడు మార్లు నమస్కరించాడు కానీ వీరు జన్మించినప్పుడు పెద్దవాడు చిన్నవాడిని నమస్కరిస్తాడు అని వాగ్దానం ఇవ్వబడింది. కుయుక్తితో యాకోబు తన జీవితంలో పనిచేయడం వలన తన సహోదరుని ఎదుర్కొనుటకు భయము ఆవరించింది. చుట్టూ చీకటిగా ఉన్న పరిస్థితి కనిపించింది. ఆ పరిస్థితిలో దేవుని పట్టుకోవడం వలన ఆ చీకటి వెలుగుమయమైంది. భయం పారిపోయింది. అయినప్పటికీ తన సహోదరుని ఏడు మార్లు నమస్కరించవలసి వచ్చింది.

 

ప్రియమైన దేవుని పిల్లలారా కొందరు జ్ఞానముగా పనిచేస్తున్నాను అని చెప్పి కుయుక్తితోపని చేస్తూ ఉంటారు. జ్ఞానము వేరుగా ఉంది కుయుక్తి వేరుగా ఉంది. జ్ఞానముగా పనిచేసేటప్పుడు సమాధానము సంతోషం ఉంటుంది. కుయుక్తిని పక్కనపెట్టి జ్ఞానముతో నడుచుకొనిన ఎడల మన జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చట సమాధానాన్ని సంతోషాన్ని మన జీవితంలో చూడగలం. కుయుక్తితో ఉండి మనుషులను మోసగించవచ్చు కానీ హృదయ అంతరంగం యెరిగిన దేవుడిని మన మోసగించలేము అనేదాన్ని మన మనసులో పెట్టుకుందాం.

- సిస్టర్. ఆర్. సలోమి గారు 

 

ప్రార్థన అంశం:-

మన ఆమెన్ విలేజి టీవీ శాటిలైట్ ఛానల్ గా మార్చబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)