Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 11.09.2024

దిన ధ్యానము(Telugu) 11.09.2024

 

అంశం: అక్ష

 

"ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయ పడును ఘనతకు ముందు వినయముండును" - సామెతలు 18:12

 

ఒక తండ్రి యుద్ధములో గెలిచిన వారికి తన ఒక్కగానోక కుమార్తె ఇచ్చి వివాహము చేస్తానని ప్రకటించాడు. ఒక యవనస్తుడు యుద్ధములో గెలిచి విజయాన్ని సాధించాడు. ఆ తండ్రి చెప్పిన విధముగానే తన కుమార్తెను అతనికి ఇచ్చి వివాహం చేశాడు. అంత మాత్రమే కాక తన కుమార్తెకు కొన్ని పొలములు కూడా ఇచ్చాడు. ఆమె వాటిని స్వీకరించి ఆమె తన భర్తతో గాడిద ఎక్కి వెళ్తున్నప్పుడు ఒక ఆలోచన కలిగింది. తండ్రి తనకిచ్చిన పొలాలన్నీ కూడా ఎండిన ప్రాంతంలో గల పొలాలు కాబట్టి మరియొక పొలాన్ని కూడా తీసుకుంటే బాగుండు అని ఆలోచించి వెంటనే భర్త యొక్క అనుమతి తీసుకుని తండ్రితో నీళ్లు మంచిగా ఉన్న స్థలాన్ని అడిగింది. తండ్రి చాలా సంతోషించి తూర్పు పక్కన ఉన్న మరియు పడమర భాగంలోనూ నీళ్లు ఎక్కువగా ఉన్న స్థలాన్ని ఆమెకు ఇచ్చాడు. ఆమె మరెవరో కాదు కాలేబు కుమార్తె అయిన అక్ష. మన పరమ తండ్రి కూడా దీవెనలు ఇచ్చుటకు ఆసక్తితో ఉంటున్నాడు. మనమైతే కోపము, అసూయ, గర్వము అనే గాడిదల నుండి దిగడానికి ఇష్టపడడం లేదు. వీటి నుండి దిగితే చాలు అవసరమైన దీవెనలను పొందుకొనవచ్చు. గాడిద నుండి దిగుట దీనత్వాన్ని చూపిస్తుంది. అవును దీనత్వం గల వారికి దేవుని కృప విస్తారంగా దొరుకుతుంది. ఆయన కృప దొరికితే చాలు మనము మనల్ని తగ్గించుకునేటప్పుడు మన పరమ తండ్రి మన ఆశయాలు అన్ని కూడా నెరవేరుస్తారు. మన యొక్క ఎండిపోయిన పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. ఈ లోకపు తండ్రి తన కుమార్తె యొక్క ఆశయాలకు తగినట్లుగా చాలా మంచి నేల నిచ్చినప్పుడు మన పరమ తండ్రి మనము వేడుకున్న దానికంటే మరి ఎక్కువగా ఇచ్చే గుణం గలవాడు. మన పరమ తండ్రి యొద్ద లేనివి అని ఏమీ లేవు. భూమి దాని సంపూర్ణతయు లోకంలో ఉన్నవి అన్నియు ఆయన ప్రజల కొరకే సిద్ధము చేసి ఉంచారు. కాబట్టి మనం దేనిని అడిగిన ఇచ్చుటకు ఆయన శక్తి కలిగినవాడిగా ఇచ్చుటక సమర్థుడై ఉన్నాడు. మీరు మీ పరిస్థితుల నుండి దిగివచ్చి ఆయనను అడిగితే చాలు అదే ప్రాముఖ్యం.

 

దీన్ని చదువుతున్న సహోదరి సహోదరులారా మిమ్ములను దేవుని ఎదుట తగ్గించకుండా ఉంచే కార్యాలు ఏమిటో దాని గురించి ఆలోచించి చూద్దాం. ఆక్ష గాడిదని విడిచిపెట్టి దిగింది జక్కయ్య చెట్టు నుండి దిగి దిగాడు ఇద్దరు కూడా దీవెనలు పొందుకున్నారు. అలాగే మీరు కూడా దేవుని విడిచి దూరముగా వెళ్లినా కూడా ఈ దినం పరమ తండ్రి యొద్దకు వెతుక్కుంటూ రండి మిమ్మలను తగ్గించుకోనినప్పుడు మిమ్మల్ని కౌగిలించుకొని మీ ఎండిపోయిన పొలములను కూడా దీవెనకారంగా మారుస్తాడు. మనల్ని తగ్గించుకొనుటకు దీవెనకరంగా ఉండిన ఎడల కార్యాలు దీవెనకరముగా మారి మనం ఆశీర్వాదకరంగా జీవించగలం. మీ స్థితి నుండి దిగి పరమ తండ్రి వద్దకు రండి ఆయన వద్దకు వచ్చే వారందరినీ కూడా అంగీకరించుటకు సిద్ధంగా ఉన్నారు.

 

ప్రార్థన అంశం: 

మన ఆమెన్ విలేజ్ టీవీ చూస్తున్న అందరూ దేవుని కొరకు ప్రయాస పడుతున్న వాళ్ళుగా లేచేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)