Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 12.09.2024

దిన ధ్యానము(Telugu) 12.09.2024

 

అంశం: నిలిచి యుండుట ఎట్లు 

 

"ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు" - యోహాను 15:5

 

కూల్ విచ్ అనే నగరపు రైల్వే స్టేషన్లో ఒక రైలు బండి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. గ్రామ్ స్ట్రోక్ అనే ఒక దైవజనుడు కూడికలో మాట్లాడుకుని ముగించుకొని ఆ ట్రైన్ ఎక్కుతున్నాడు. హఠాత్తుగా అక్కడికి పరిగెత్తుకుని వచ్చిన ఒక యవ్వన సైన్యపు అధికారి గ్రామ్ స్ట్రోక్ తో ఇలా అడిగారు నేను మీ ప్రసంగాన్ని విన్నాను. ఒక మనుష్యుడు దేవుని మార్గంలో ఎలా నిలిచి ఉండగలడు అని అడిగాడు. అందుకు గ్రామ్ స్ట్రోక్ తన చేతుల్లో గల ఒక పెన్సిల్ చూపించి దానిని తన అరచేతుల నిల్చబెట్టాడు అది నిలబడలేదు ఎలాంటి సపోర్ట్ లేదు కాబట్టి పడిపోయింది కాబట్టి తన చేతితో ఆ పెన్సిల్ మధ్య భాగం పట్టుకున్నప్పుడు అది నిలబడింది. వెంటనే చెప్పారు మన జీవితం ఈ పెన్సిల్ వంటిదే. దేవుని హస్తము మనలను పట్టుకొనిన ఎడల మనము నిలిచి ఉండగలము లేనియెడల ఎలాంటి పట్టు లేదు కాబట్టి పెన్సిల్ పడిపోయినట్లు మనము కూడా పడిపోతాం అని అన్నారు. ఆ యవ్వనస్తుడు సొంత బలాన్ని కాదు దేవుని హస్తంలోనే నిలిచి ఉండగలం అని అర్థం చేసుకున్నాడు.

 

బైబిల్లో కూడా అబ్రహాము తన కష్ట కాలమున ఆకాశం వైపు తేరిచూచి దేవుని సహాయంను కోరుకున్నాడు. దేవున్ని సంపూర్ణముగా పట్టుకున్నాడు దేవుని యొక్క సహాయము పొందుతు నడిచాడు అందువలన విశ్వాసులకు తండ్రి అని పిలవబడ్డాడు. దేవుని హస్తము మనం పట్టుకొనిన యెడల మనం పడిపోతాం. దేవున్ని మనం పట్టుకున్నప్పుడు ఆయన గొప్ప కార్యము మన జీవితంలో చూడగలం. నెహెమ్యా తో దేవుని దయగల హస్తం తోడై ఉండినందున ఆయన ప్రారంభించిన కార్యము చివరి వరకు సంపూర్ణముగా చేసి ముగించారు. అలానే దేవుని హస్తము మనము పట్టుకుని లోకంలో ఉంటే ఈ లోకము, శరీరము అన్నింటిని మనము జయించగలం.

 

ప్రియమైన వారలారా! ఈ లోకంలో మీకు ఉపద్రవం కలవు అని బైబిల్ చెబుతుంది. ఆ ఇరుకైన పరిస్థితులలో నిలిచి ఉండి విజయం పొందుటకు ఆయన సహాయము లేకుండా జరగదు. లోకంలో మీకు ఉపద్రవం కలదు గానీ బలము పొందుకొని నేను లోకమును జయించాను అని యోహాను 16: 33లో బలము పొందుకోండి అని చెప్పి మీకు సహాయం గా నిలబడుటకు నేను మీకు తోడైయుండుటకు సిద్ధముగా దేవుడు ఉన్నాను అని అంటున్నారు. ఆయన మీ పక్కనే ఉన్నారు కనుక అన్ని శోధనలు, వేదనలు, శ్రమల మధ్యలో మనలను నడిపించుటకు, నిలబెట్టుటకు ఆయన శక్తివంతమైన దేవుడిగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన మన చేయి విడువడు కనుక మీరు కూడా ఎప్పుడూ ఆయన చేయి విడిచి పెట్టకుండా పట్టుకొనుడి. ఆయనను పట్టుకోని లోకములో నిలబడినప్పుడు మనం విజయాన్ని సాధిస్తాం.

- శ్రీమతి. బేబీ కామరాజు గారు 

 

ప్రార్థన అంశం:-

దేబోరాలు లేని మండలాల్లో ఇద్దరు దేబోరాలను నియమించుటకు దేవుడు సహాయము చేయు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)