Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 16.09.2024

దిన ధ్యానము(Telugu) 16.09.2024

 

అంశం: విజయం 

 

"మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము" - 2 కోరింథీయులకు 2:14

 

యుద్ధంలో ఓడిపోయిన ఒక రాజకుమారుడికి విజయం పొందుకున్న ఒక రాజు ఒక నిబంధనలను విధించాడు. నీళ్లుతో నిండిన ఒక గ్లాసుని అని చేతికిచ్చి ఒక చుక్క కూడా కింద పడకుండా దాన్ని తీసుకుని వెళ్లాలి. ఒక మైలు దూరం అవతల ఉన్న రాజుకు దానిని చేరవేస్తే యుద్ధములో ఓడిపోయిన ఆ రాజకుమారునికి విమోచనతో విడుదల చేస్తాను అని నిబంధన చేశాడు. 

 

ఆ రాజకుమారుడు ఆ గ్లాస్ ను చేతితో పట్టుకొని నడిచినప్పుడు ఒక చుక్క నీళ్లు పడితే ఆయనను ఖడ్గముతో నరికి వేయడానికి రెండు వైపులా ఇద్దరు సైనికులు ఆయనను వెంబడించారు కానీ మార్గమధ్యంలో ఆయన రాజకుమారుడు కాబట్టి ఆయనను ఉత్సాహపరిచే విధంగా ఒక గుంపు వారు ఆయనను పొగుడుతూ శబ్దాలు చేశారు. మరియు మరియొక గుంపు ఆయనను తిడుతూ తిరస్కరించారు. కానీ ఆ రాజు కుమారుడైతే కుడిపక్క గాని ఎడంపక్క గాని చూడకుండా ఆ నీళ్లతో నిండిన గ్లాసు మీద తన శ్రద్ధను పెట్టుకుని చివరి వరకు వెళ్లి విజయమును సాధించాడు. ఆ రాజకుమారుని చూసి నీ విజయానికి కారణం ఏమిటి అని అడిగినప్పుడు నేను నన్ను పొగుడుతున్న వారిని గమనించలేదు నన్ను దూషించిన వారిని పట్టించుకోలేదు. నా మనసంతా ఈ గ్లాసులో ఉన్న నీళ్లు పడిపోకుండా నా దృష్టి అంతా గ్లాసు మీద పెట్టాను. నేను చాలా శ్రద్ధతో నడవగలిగాను అని చెప్పాడు.

 

బైబిల్లో తన జీవితంలో ఎలాంటి పొగడ్తలను ఎలాంటి తిరస్కరింపును ఎంత మాత్రం తీసుకొనకుండా మన ప్రభువైన యేసుక్రీస్తు జీవించారు. ఆయన సంపూర్ణ శ్రద్ధాంతా తండ్రి చిత్తము చేయుటలో ఉండేది. కాబట్టి ఆయనను రాజుగా చేయుటకు ఒక గుంపు వెతికినప్పటికీ ఆయన చంపుటకు మరొక గుంపు వెతికినప్పటికీ ఆయనైతే నా రాజ్యము ఈ భూ సంబంధమైనది కాదు అని చాలా తేటగా చెప్పి తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు.

 

ప్రియమైన వారలారా! మన జీవితంలోను అనేక అపజయాలు, సిగ్గుపడే పరిస్థితిలో అవమానాలు వస్తూనే ఉంటాయి. వాటిని చూచి నిరుత్సాహపడిపోకుండా ధైర్యంతో మనం ముందుకు ప్రయాణం చేయాలి. మన పైన సాతాను ఎన్ని ఆటంకాలు తీసుకుని వచ్చినప్పటికీ వాటిని యేసుక్రీస్తు నామములో జయించాలి. మన శ్రద్ధ అంతా నేను యేసయ్య బిడ్డను నేను యేసయ్య రక్తము చేత కడగబడినవాడును అనే తలంపుతో ఎవరి యొక్క హేళనకరమైన మాటలు, అపహాసం చేసే మాటలు గమనించకుండా మన ఆలోచన శ్రద్ధ అంతా కూడా శిలువ పైన ఉన్న యేసయ్య మీదే ఉండాలి. యేసయ్యను ముందు ఉంచండి విజయము మీ కొరకే. ఆమెన్! ఆమెన్! ఆమెన్!

- శ్రీమతి. హెబ్సిబా రవిచంద్రన్ గారు 

 

ప్రార్థన అంశం:-

మనతో తర్ఫీదులో ఉన్న యవ్వన మిషనరీల కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)