Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 07.09.2024

దిన ధ్యానము(Telugu) 07.09.2024

 

అంశం: పర్యవేక్షించే దేవుడు 

 

"అదిచూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచినవాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను" - ఆదికాండము 16:13

 

నేరాలు పెరిగిపోతున్న ఈ దినములలో సీసీటీవీ కెమెరా చాలా అవసరముగా ఉన్నది. ప్రజలు గుమ్మి కూడుతున్న స్థలాలైనా ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్, షాపింగ్ మాల్స్, వీధులు, రోడ్లు అంతెందుకు ఇంట్లో కూడా సీసీటీవీలో అమర్చించబడి పర్యవేక్షిస్తూ ఉన్నారు. జరిగిన కార్యాలు ఆధారంగా అవసరమైన సంఘటనలో ప్రాముఖ్యమైన సాక్షులుగా పోలీస్ డిపార్ట్మెంట్లు పనిచేయటం సహాయపడుతుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు ఒకసారి ప్రజలు కానుకలు వేస్తున్న కానుక పెట్టె దగ్గర కూర్చుని శ్రద్ధగా దాని గమనిస్తున్నారు. ధనవంతులకంటే ఒక పేద వెధవరాలు వేసినటువంటి కానుక చూసి ఆమె సంపూర్ణంగా, ఉత్సాహంగా, యదార్ధంగా ఆసక్తితో సమస్తాన్ని వేసింది అని దేవుని కొరకు ఇచ్చిన కానుక గురించి పొగుడుతున్నారు. పాత నిబంధనలో అబ్రహాము పనిమనిషి అయిన హాగరు తాను గర్భవతిగా ఉన్నప్పుడు తన యజమానురాలైన శారా చేత హింసించబడి నందున అరణ్యంలోనికి పారిపోయింది. దేవుడు ఆమె కన్నీటిని చూసి ఆమెతో మాట్లాడుతున్నారు తనతో మాట్లాడిన దేవునికి నీవు చూచుచున్న దేవుడవు తన పేరు పెట్టి ఆయన మాట చొప్పున తన యజమానురాలు ఇంటికి వెళ్ళింది. నేను పి.యు.సి పూర్తిచేసుకుని టి.ఇ.ఎల్.సి హాస్టల్లో

 

పనిచేస్తున్నప్పుడు 1978 వ సంవత్సరము హోమ్ సైన్స్ కాలేజీలో చదివే అవకాశం దేవుడు నాకు ఇచ్చారు. మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఒక మీటింగ్లో మా కాలేజ్ వాళ్ళ అందరి ఎదుట నన్ను పిలిచి నా కొరకు అక్కడ ఉన్న వారందరినీ కూడా చప్పట్లు కొట్టమని చెప్పారు. ఎందుకంటే మూడవ అంతస్తులో ఆయన గది ఉంది. అక్కడి నుండి చూచినప్పుడు ఆ కాలేజీ క్యాంపస్ లో పడిపోయిన చిన్న చిన్న కాగితపు ముక్కలు పడి ఉన్నప్పుడు తీసి చెత్తకుండీలో వేయుట అలానే సాయంకాలం ప్రేయర్ లో జాగ్రత్తగా పాల్గొనుట హాస్టల్లో ఉండి చదువుతున్న నా యొక్క కొన్ని కార్యాలను గుర్తించి నన్ను అభినందించారు. ఆ దినము నేను నా డైరీలో ఇలా రాసుకున్నాను నా దేవా మీరు కూడా నన్ను ప్రతిక్షణం పర్యవేక్షిస్తున్నారు. నేను నా కార్యాలను మనుషులు ఎదుట మాత్రమే కాదు మిమ్మల్ని కూడా సంతోషపెట్టే విధంగా ఉండుటకు నా జీవితాంతం సహాయం చేయండి అని రాసి పెట్టాను. ఇప్పుడు నాకు 71 సంవత్సరాలు ఈ దినం వరకు నేను అలా జీవించుటకు ప్రయత్నిస్తూ ఉన్నాను. కొన్నిసార్లు నేను ఓడిపోయినప్పటికీ క్షమాపణ అడిగి నన్ను నేను సరిచేసుకొని మరలా నన్ను నేను దేవుని ఎదుట సమర్పించుకుంటున్నాను. అవును మనలను పర్యవేక్షిస్తున్న కెమెరా మన దేవుని దృష్టియే.

 

మీకు ఇష్టమైన వాటిని చేయట నాకు బోధించుడి, మీరే నా దేవుడు మీ ఆత్మను నాకు దయచేసి మీ మార్గంలో నన్ను నడిపించుడి. ఆమెన్! 

- శ్రీమతి. సరోజ మోహన్ దాస్ గారు 

 

ప్రార్థన అంశం:-

ఆగస్టు 15వ తారీఖున జరిగిన యవ్వనస్తుల కూడికలో నిర్ణయం తీసుకున్న వారందరూ ఆ మాట చొప్పున నిలబడే విధంగా ఉండు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)