Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 06.09.2024

దిన ధ్యానము(Telugu) 06.09.2024

 

అంశం: కదల్చబడని మనుషుల యొక్క వంతెన

 

"క్రీస్తుయేసు యొక్క మంచి సైనికునివలె నాతో కూడ శ్రమను అనుభవించుము" - 2 తిమోతికి 2:3

 

ఫ్రెంచ్ రాజైన నెపోలియన్ తన సైనికులతో ఒక నదిని దాటుటకు ప్రయత్నం చేశారు. ఆ వంతెన కదల్చబడకుండా ఉండాలి అనుకున్నాడు. కాబట్టి తాత్కాలికంగా ఆ వంతెనను నియమించాలి అని నిర్ణయించుకున్నాడు. కొందరు సైనికులను ఆ నదిలోనికి దింపి స్తంభం వలె పలకలను పట్టుకోమని నిలబెట్టి దానిపైన పలకలను ఇనుప రాడ్డులను పెట్టి తాత్కాలికంగా వంతెన నిర్మించాడు. ఆ సైన్యము ఆ నదిని దాటింది. వెంటనే రాజైన నెపోలియన్ స్తంభం వలె నిలబడిన వాళ్లను పైకి రమ్మని ఆజ్ఞాపించారు. ఏ ఒక్కరు కూడా పైకి రాలేదు. కారణము ఆ చలిలో మొద్దు బారిపోయి మరణించారు. వారిని చూచిన నెపోలియన్ కన్నీరు కార్చారు. నశించిపోతున్న రాజ్యం కొరకు రాజు కొరకు తమ ప్రాణాన్ని ఇచ్చారు.

 

మనం ఎవరము? రాజుల రాజైన, దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క సైనికులము. యేసుక్రీస్తు మన కొరకు పాప పరిహారార్థమైన బలిగా మరణించి మూడో దినమున తిరిగి లేచారు. తర్వాత 40 దినములు తన శిష్యులకు కనబడి తర్వాత ఆయన పరలోకమునకు వెళ్లినప్పుడు ఆయన ఇచ్చిన ఆజ్ఞ సర్వలోకమునకు వెళ్లి సువార్త ప్రకటించుడి. తండ్రి, కుమారా, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము ఇచ్చి నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని వాళ్ల పాటించేటట్లు వారికి ఉపదేశించండి అని చెప్పారు. అవును మనము ఆయన మనకు ఇచ్చిన చివరి ఆజ్ఞను నెరవేర్చుటకు ఎంతైనా ప్రయాస పడుటకు మనల్ని మనం సమర్పించుకోవాలి. ఆయన పని కొరకు కీడును అనుభవించుటకు ధైర్యముగా సిద్ధపడి ఉండాలి.

 

ప్రియమైన వారలారా రాజాధిరాజు యొక్క ఈ ఆజ్ఞను ఎలా మనం నెరవేర్చకు లోబడుతున్నాం? దేవుని రాజ్యము విస్తరింపజేయుటకు ప్రయాసపడుతున్నామా? సాతాను యొక్క ఉచ్చులో పడిపోయి మరణం వైపు వెళ్ళిపోతున్న ఆత్మలను గూర్చిన బాధ మనకు ఉన్నదా? పాపపు మార్గములో ప్రయాణం చేస్తూ ఉన్న యవ్వనస్తులు పరమ దేవుని వైపు నడిపించబడుటకు పరిశుద్ధముగా మారుటకు ఇంకను లోతైన ఆత్మీయ కార్యంలో ఎదగడానికి మనం ఇతరులను ప్రోత్సహిస్తున్నామా? ఒక మంచి సైనికుడిగా యేసుక్రీస్తు ప్రభువు కొరకు కీడును అనుభవించుటకు మనలను మనము సమర్పించుకుంటున్నామా లేదా సుఖమంతమైన జీవితాన్ని కోరుకుంటున్నామా? ఆలోచించి చూద్దాం, ప్రార్థిద్దాం, ప్రయాస పడదాం. దేవుని కొరకు సమయాన్ని, ధనాన్ని ఇద్దాం.

- శ్రీమతి. వనజ పాల్ రాజు గారు 

 

ప్రార్థన అంశం:-

మన ట్యూషన్ మిషనరీల యొక్క జ్ఞానము, భద్రత, ఆరోగ్యము కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)