Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 02.09.2024

దిన ధ్యానము(Telugu) 02.09.2024

 

అంశం: ఫిల్ అప్ (Fill up-ఖాళీలను పూరించుడి)

 

“ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై యున్నది” - ఎఫెసీయులకు 1:23

 

మనం స్కూల్లో చదివేటప్పుడు పరీక్ష పేపర్లో ఖాళీ స్థలమును పూరింపుము అను రాసి ఉండేది. అందులో ఒక చిన్న గీతను ఖాళీగా ఉంచుతారు. ఒక మాటలో చెప్పాలంటే ఆ స్థలము నింపబడాలి. ఆ స్థలము నింపబడితే ఆ వాక్యము పూర్తి అవుతుంది. ఇలానే దేవుడి సమస్తాన్ని నింపుతున్న దేవుడు. మనలను మన స్థలములో నింపి ఉన్నారు. మనము దీనిలో నుండి పొరపాటు చేసినప్పుడు లేదా దాటి వెళ్ళేటప్పుడు దేవుడు ఆ స్థలములో ఉండి మనలను తీసి వేస్తారు. మనం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్లేటప్పుడు వెంటనే మరి ఒకరిని ఆ స్థలంలో భర్తీ చేస్తున్నారు. అనగా సౌలు దేవునికి లోబడకుండా దేవున్ని దుఃఖ పరుస్తున్నారు వెంటనే దేవుడు రాజు స్థానం నుండి ఆయనను త్రోసి వేస్తున్నారు. ఆ పదవికి మరియొకరిని నింపడానికి దేవుడు ఒక వ్యక్తిని వెతికి దావీదును ఎన్నుకున్నారు. సౌలు ఉండిన ఖాళీ స్థలంలో దేవుడు దావీదును అభిషేకించారు. అదేవిధంగా రాణి అయినా వస్తి రాజు విందుకు పిలిచినప్పుడు రావడానికి తిరస్కరించింది రాజు యొక్క మాటకు లోబడనందున రాణి స్థానం నుండి ఆమె త్రోసి వేయబడింది. ఆ స్థలములో భర్తీ చేయుటకు ఆ ప్రాంతంలో గల అందమైన స్త్రీలు పిలవబడ్డారు. వారిలో ఎస్తేరు ఎంపిక చేయబడి రాని అయిన వస్తి స్థానంలో భర్తీ చేయబడింది. ఈ స్థలము ఎస్తేరు యొక్క అందము లేకపోతే తెలివి దానికి తగిన చోటు కాదు వస్తి తిరస్కరించబడినందున ఆ ఖాళీ స్థలంలో ఎస్తేరు నింపబడింది. ఒక పెద్ద ప్రమాదకరమైన కార్యము హామాను ద్వారా వచ్చింది . అప్పుడు ముర్దేకై చెబుతున్నారు నువ్వు ఇలాంటి కార్యములో సహాయముగా ఉండినప్పుడు నీకు ఇలాంటి ఘనత దొరికి ఉండవచ్చు కదా మరియు నీవు ఈ కాలంలో మౌనముగా ఉండన యెడల యూదులకు రక్షణ మరియొక చోట నుండి వస్తుంది అని అన్నారు. అనగా నీవు త్రోసివేయబడి నీ స్థలంలో వేరొకరు భర్తీ చేయబడవచ్చు అని అంటున్నారు.

 

దీన్ని చదువుతున్న ప్రియ స్నేహితులారా ఇప్పుడు మీరు ఉంటున్న స్థానము, అవకాశము అన్ని మీ తలాంతులకు అర్హతలకు దొరికినది కాదు ఎవరో ఒకరు స్థానమును పొరపాటుగా వాడినందున మీకు స్థానం ఇవ్వబడింది. మీరు దీనిని తప్పిదముగా వాడిన ఎడల మీ స్థలము నుండి మీరు తీసివేయబడి మరి ఒకరికి ఆ స్థానాన్ని ఇచ్చుటకు దేవునికి అది సులువైన కార్యము అని మర్చిపోకూడదు. అందువలన మనకు ఇవ్వబడిన కార్యములో బైబిల్ చదివి, ప్రార్థించి దేవునితో గల బంధములో నిలిచి ఉండి దేవునికి భయపడుతూ జాగ్రత్తగా ఉందాం. దేవుడు మనలను పెట్టి ఉన్న స్థలములలో భయభక్తులతో మనలను మనము తగ్గించుకుందాం. ఈ ఆలోచన మనకు ఉండిన యెడల గర్వము, అశ్రద్ధ రానేరాదు. జాగ్రత్తగా పని చేద్దాం దేవుని యందు నిలిచి ఉందాం.

- బ్రదర్. డేవిడ్ గణేష్ గారు.

 

ప్రార్థన అంశం:

ఈ నెల జరిగే పరిచర్యలో సేవకుల యొక్క ప్రయాణలలో సేవకుల యొక్క సంరక్షణ కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)