Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 31.03.202

దిన ధ్యానము(Telugu) 31.03.202

ఏది శ్రేష్ఠమైనది

"...నా ప్రాణమును  ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు" - అపో.కార్యములు 20: 24

దక్షిణ అమెరికాలో ఎవ్వరు వెళ్ళలేని దట్టమైన అడవి ప్రాంతంలో ఆకయి ఇండియన్స్ అనే ఆదివాసీ ప్రజలు నివసిస్తూ ఉండేవారు. వీరు తమ ప్రజలను తప్ప వేరే ప్రజలను చూసిన వెంటనే విషపూరితమైన బాణములు వేసి వాళ్ళను చంపేస్తారు. ఇలాంటి ప్రజలకు దేవుని ప్రేమను పంచుటకు సమర్పించుకున్నారు జిమ్ ఇలియట్ అనే యవ్వనస్తుడు. వాళ్ళ భాషను నేర్చుకొని వాళ్ళతో సంభాషించుటకు, వాళ్లకు దేవుని సువార్తను ప్రకటించుటకు ఒక మార్గాన్ని కనుగొన్నారు. తన నలుగురు స్నేహితులతో కలిసి చిన్న విమానంలో అడవిపైన ఎగురుతూ చిన్న చిన్న వస్తువులను వాళ్లకు బహుమానంగా వేశారు. వాటిని ఆ ప్రజలు సంతోషంగా స్వీకరించిన వెంటనే జిమ్ తమ ప్రాణములను లెక్క చేయకుండా తెగించి ఆ  అడవిలోకి వెళ్లుటకు నిర్ణయించుకొని ఒక దినమున ఎంచుకున్నారు. వెళ్లిన వెంటనే ఆ ఆదివాసి ప్రజలలో కొందరు వీరిపైన విషపూరితమైన బాణములను వేసి వాళ్ళను చంపివేశారు. ఇలాంటి వేదన కరమైన పరిస్థితుల మధ్యలో కూడా వాళ్ళ భార్యలు పరిచర్య చేస్తూవచ్చారు. ఈ దినము ఆక ప్రజల మధ్యలో సంఘములు, సేవకులు ఏర్పడి అరధిస్తున్నారు. 

యేసుక్రీస్తు సేవకుడైన పౌలు కూడా ఎఫెస్సు సంఘములో పెద్దలను మిలేతు అనే పట్టణమునకు పిలిపించి మాట్లాడుతున్నప్పుడు నా ప్రాణము సహితము ప్రియముగా ఎంచలేదు అని చెబుతున్నారు. పౌలు తన జీవము కంటే దేవున్ని ఎక్కువుగా తలంచారు. చెరసాలలో బందించ బడినప్పటికి, కొరడా దెబ్బలు తిన్నప్పటికి, నావ ప్రయాణములో అనేక కష్టములు వచ్చినప్పటికీ దేనిని లెక్క చేయకుండ పరిచర్య చేశారు. నిరుత్సాహపడి ఒకే చోట ఉండిపోకుండ అనేక దేశములకు వెళ్తూవుండేవారు. మరణమును సంతోషంగా అంగీకరిస్తున్నాను ఎందుకంటే దేవుని పిలుపును నేను సంపూర్ణంగా నెరవేర్చాను అని చెబుతున్నారు.

దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా యేసుక్రీస్తు పరలోకమునకు వెళ్ళక ముందు మీరు సర్వ లోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నదే. ఈ పిలుపును మీరు ఎలా తీసుకుంటున్నారు? పౌలు, జిమ్ ఇలియట్ వీళ్ళు దేవుని పిలుపును గొప్పగా తలంచుట వలన తమ ప్రాణములను లెక్క చేయకుండ సువార్తను ప్రకటించారు. ఈ దినము మన జీవితంలో ఏది శ్రేష్ఠమైనదిగా ఉన్నది. ధనమా, పదవులా, చదువులా, ప్రాణమా, లేదా దేవుని ప్రేమ?. మీ యొక్క ధనమును మిషనరీ పరిచర్య కొరకు ఖర్చుపెట్టవచ్చు, మీ సమయాన్ని మిషనరీల కొరకు ప్రార్ధించడానికి కేటాయించవచ్చు. ఎందుకు మీరే మిషనరీలుగా రావచ్చు. తమ ప్రాణాన్ని రక్షించుకొనువాడు దానిని కోల్పోవును, నా నిమిత్తము తన ప్రాణాన్ని వెచ్చించు వాడు దానిని రక్షించుకొనును. ఆమెన్
-    శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్

ప్రార్థన అంశం:-
మన యవ్వన మిషనరీలకు దేవుడు మంచి జీవిత భాగస్వాములను దయచేయులాగున ప్రార్థిద్దాం

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)