Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 20.03.2021

దిన ధ్యానము(Telugu) 20.03.2021

సంతోషం కలిగించే మాట. 

"సరిగా ప్రత్యుత్తరమిచ్చినవానికి దానివలన సంతో షము పుట్టును సమయోచితమైన మాట యెంత మనోహరము!” - సామెతలు 15:23

రాత్రి వేళల్లో అమ్మ అమ్మ అని పిలుస్తున్న స్వరము వినబడింది. తల్లి చిన్న లైట్ వెలుగులో తన కుమారుడ్ని చూచి కూర్చొని ఉండేది. ఆ చిన్న బాలుడు తన తల్లి యొద్ద నాకు ఊపిరి ఆడటం లేదు నేను చనిపోతానా అని అడిగాడు. అందుకు ఆ తల్లి తనని కౌగలించుకొని లేదు బాబు నీవు నా కడుపులో వుండేటప్పుడు నేను నిన్ను దేవుని పరిచర్య కొరకు నిన్ను ఆయన చేతికి సమర్పించాను. నీవు పెద్దవాడై దేవుని పరిచర్య చేసేవరకు నీవు జీవిస్తుంటావు, నీకు ఏమికాదు. నీవు దేవుని కొరకు సమర్పించ బడినవాడవు దేవుడు నిన్ను చూసుకుంటారు అన్నారు ఆ తల్లి. ఈ ఆదరణ కరమైన మాటలు ఆ చిన్న బాలుడు యొక్క భయాన్ని తీసివేసి ధైర్యాన్ని ఇచ్చాయి. తల్లి కౌగిట్లో ప్రశాంతంగా పడుకొని ఉదయము మంచి ఆరోగ్యముతో లేచాడు.

గొప్ప ధనవంతుడైన నాబాలు తన గొర్రెలకు బొచ్చు కత్తిరించే పండుగలో విందు చేసి తన పనివారితో సమయం గడుపుతున్నాడు. ఈ సమయంలో దావీదు తన కొరకు తనతో ఉన్న వాటికొరకు భోజనము ఇమ్మని అడుగుటకు తన పనివారిని పంపించారు. కాని నాబాలు అయితే తన పనివాళ్లకు చేసిన దానిని ముక్కుమొఖం తెలియని వ్యక్తికి నా విందు భోజనం ఇస్తాను అని చెప్పి వట్టిచేతులతో వాళ్ళను వెనుకకు పంపించాడు. కాని దావీదు ఆయన స్నేహితులు నాబాలు యొక్క గొర్రెల కాపరులకు అరణ్యంలో సహాయకులుగా ఉన్నారు.  అయినప్పటికీ నాబాలు పలికిన కఠినమైన మాటలను బట్టి దావీదు కోపగించుకున్నాడు. నాబాలుకు కలిగిన సమస్తమును నాశనము చేయాలి అని తుఫాను వలె బయలుదేరాడు. దీనిని గ్రహించిన నాబాలు భార్య అభీగయేలు అవసరమైన ఆహార పదార్థములు అన్నింటిని తీసుకొని దావీదును కలుసుకొని, తన భర్త యొక్క తప్పిదమును ఒప్పుకొని మీరు రాజు కాబోతున్నారు కాబట్టి మీ చేతిలో రక్తపు మరకలు ఉండవచ్చునా అని అడిగింది. దావీదు యొద్ద క్షమాపణ అడిగింది. దావీదు అభీగయేలు మాట వలన తన మనస్సు మార్చుకున్నాడు. తుఫాను వలె వచ్చిన దావీదు అభీగయేలు యొక్క తగ్గింపు గల, దయ గల మాట వలన తన కోపాన్ని నాబాలు మీదనుండి తగ్గించుకొని ప్రశాంతంగా తిరిగి వెళ్ళాడు.

ప్రియమైన వారలారా!  మీ మాటలు ఎలా ఉంటున్నాయి? రాబోతున్న గొప్ప ప్రమాదాన్ని అపి వేసి సంతోషాన్ని ఇస్తున్న అభీగయేలు మాటల వలె ఉన్నాయా? లేదా తుఫాను లేపుతున్న నాబాలు మాటలు వలె ఉంటున్నాయా? ఆలోచించండి. మనము మాట్లాడుతున్న మాటలు కృప గలిగిన మాటలు గాను, గాయాన్ని కట్టేటట్లుగాను, ఆదరణ ఇచ్చేటట్లుగాను ఉండనివ్వండి. అలాంటి మాటలు మాట్లాడుటకు నిర్ణయించుకుందాం. దేవుడు అటువంటి మాటలు మన హృదయములో నింపును గాక! ఆమెన్.
- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్.

ప్రార్థన అంశం:-
మోక్ష ప్రయాణము, దిన ధ్యానమును ముద్రించుటకు అవసరమైన ధన సహాయము అందేటట్లు ప్రార్థిద్దం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)