Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 19.03.2021

దిన ధ్యానము(Telugu) 19.03.2021

నిరీక్షణ

"ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను" - యోబు 13: 15

నావ ఒకటి బయలుదేరింది. అందరూ మిక్కిలి సంతోషంతో ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణికులలో వృద్దాప్యంలో ఉన్న ఒక నావికుడు కూడా ఉన్నారు. కొంత దూరం వెళ్ళేసరికి హఠాత్తుగా తుఫాను వచ్చి గాలి వీచడం ప్రారంభించింది. నావ ఎక్కువగా కదలడం ప్రారంభించింది. అప్పుడు ఆ నావ నడిపించే నావికుడికి ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఆ వృద్దాప్యంలో ఉన్న ఆ నావికుడు ఈ విధముగా చెప్పారు. నావను ఒక స్థలంలో నిలిపివేసి కదలకుండా ఒకే స్థలంలో ఉంచు అన్నారు. ఆలాగుననే ఆ నావ యొక్క నావికుడు చేసి కొన్ని గంటలు పోరాడి ఆ నావను నిలిపివేశారు. కొన్ని  గంటల తరువాత ఆ తుఫాను తగ్గిన వెంటనే మరల వారు బయలుదేరారు. నావ యొక్క నావికుడు వచ్చి ఆ వృద్దాప్యంలో ఉన్న నావికుడు దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు చెప్పారు.  కఠోరమైన తుఫాను వచ్చినప్పుడు మనము నావను అక్కడే నిలిపి వేసి అక్కడే ఉండేటట్లు చూసుకోవాలి అనే సంగతి మరవకుము అన్నారు.

యోబు అనే ధనవంతుడు తన జీవితంలో తుఫాను వంటి అనేక పోరాటములు వచ్చినప్పుడు దేవుని మీద నిరీక్షణతో ఉంటాను అంటున్నారు. యోబుకు 10 మంది పిల్లలు, ఒంటెలు, ఎడ్లు, గాడిదలు, గొర్రెలు, అనేక మంది పనివారిని కలిగి మిక్కిలి ధనవంతునిగా ఉండే వాడు. కాని ఒక దినములోనే తన జీవితంలోతుఫాను వంటి శ్రమ విసిరింది తన పిల్లలు, ఒంటెలు, గాడిదలు, ఎడ్లు, గొర్రెలు, పనివారు అందరిని కోల్పోయారు. దేవుడే ఇచ్చెను ఆయనే తీసుకొనెను దేవుని నామమునకు మహిమ కలుగును గాక అన్నారు. మరుసటి దినం ఆయన దేహమంత కూడా కురుపులతో నిండి పోయి చిల్ల పెంకుతో వాటిని పైన గోకోవడం ప్రారంభించాడు. తన జీవితం అనే నావలో విశ్వాసం అనే లంగారును దేవుని మీద వేసిన వాడిగా ఆయన నన్ను చంపివేసినను ఆయన మీద నిరీక్షణతో ఉంటాను అంటున్నారు. నా ప్రాణము పోతున్నప్పటికి నా దేవుడు నన్ను రక్షించడానికి సమర్థుడు అని అంటున్నాడు. చివరికి తాను కొల్పయిన వాటన్నింటిలోను రెండంతలు ఆశీర్వదాన్ని పొందుకున్నాడు. 

దీనిని చదువుతున్న స్నేహితులారా! తుఫాను వంటి కష్టాలు మీ మీదకి లేస్తున్నప్పుడు మీరు ఏమి చేస్తున్నారు. నిలబడలేక తడబడుతూ జీవిత నావను మునిగిపోనివ్వకండి. విశ్వాసమనే లంగరును క్రీస్తు యేసు మీద వేసి నిలిచి యుండేటట్లుచేయుడి. మీ జీవితంలో కచ్చితంగా దీవెనను పొందుకుంటారు అనేది కచ్చితం.
-    శ్రీమతి. జాస్మిన్ పాల్

ప్రార్థన అంశం:-
రోజు ఉదయం జియో మీట్ యాప్ లో జరుగుతున్న ఆన్లైన్ ప్రేయర్ లో అనేకులు పాల్గొనేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)