Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 14.03.2021 (Kids Special)

దిన ధ్యానము(Telugu) 14.03.2021 (Kids Special)

ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం.

తృప్తి కలిగి ఉండుము. 

"సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమైయున్నది" - 1తిమోతికి 6:6

ఒక రాజు తన దేశాన్ని చక్కగా పరిపాలిస్తున్నారు. ఆయనకు మంచి సలహాలు ఇచ్చుటకు మంత్రి ఒకరు ఉండేవారు. రాజు మంత్రి యొక్క శ్రేష్ఠమైన సలహాలు, ఆలోచనలవలన చక్కగా దేశాన్ని పరిపాలిస్తున్నారు. 

ఆ మంత్రికి ఒక తమ్ముడు ఉండేవాడు. ఆయనకు చదువు లేదు మరియు మిక్కిలి దురాశపరుడుగా ఉండేవాడు. ఆయన తన మంత్రి అయిన తన అన్న యొద్ద మీరు ఎన్నో సంవత్సరాలుగా మంత్రి బాధ్యత వహించారు కదా నేను అయితే పొలములో పనిచేస్తూ ప్రయాస పడుతున్నాను. కనుక నాకు మూడు రోజులు మంత్రిగా పని చేయాలి అని ఆశ పడుతున్నాను. మీరు నా పొలమును మూడు దినములు మాత్రమే చూసుకోమని చెప్పాడు. మంత్రి తన సహోదరుని యొక్క కోరికను రాజు దగ్గర చెప్పారు. రాజుకు వేరే మార్గం లేక మంత్రి యొక్క కోరికను నెరవేర్చారు. వ్యవసాయం  చేస్తున్న తమ్ముడు వచ్చి మంత్రి యొక్క వస్త్రాన్ని దరించుకున్నారు. 

రాజు ఆ కొత్త మంత్రిని చూసి బయట బండ్లు శబ్దం వస్తున్నది చూడు అనగా ఆ మంత్రి బయటకు వెళ్లి చూసి అవును రాజుగారు బండ్లు వస్తున్నాయి అని చెప్పాడు. వెంటనే రాజు ఎన్ని బండ్లు, ఎక్కడి నుండి వస్తున్నాయి, ఏమి తెస్తున్నాయి అని అడిగారు అందుకు ఆ మంత్రి మీరు ఇన్ని ప్రశ్నలు అడిగితే నేను ఏమి సమాధానము చెప్పాలి అని వెంటనే ఎదురు ప్రశ్న వేశాడు మంత్రి. దానికి రాజుగారి భవనం నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ సమయం చూసి పెద్ద వాడైన మంత్రి వచ్చి రాజా 38 బండ్లు, ఒక బండిలో 10 బస్తాలు చొప్పున మొత్తం 380 బస్తాలు దించారు. పొరుగు దేశపు రాజు వీటిని మీకు పంపించి యున్నారు అని చెప్పగానే రాజు మొకములో కోపము పోయి సంతోషం వచ్చింది. 

దానిని చూసిన తమ్ముడు రాజా ఈ గొప్ప బాధ్యత గలిగిన ఈ పని నాకు వద్దు నేను అర్హుడను కాను దీనికి తెలివిగల వాడైన మా అన్నయ్యకు దీనిని ఇచ్చేయండి అని చెప్పి నాకు వ్యవసాయ పనే సరైనది. అర్హతకు మించి ఆశించకుండా తృపి కలిగి జీవించుట నేర్చుకున్నాను కనుక నన్ను క్షమించండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. 

ప్రియ తమ్ముడు చెల్లి దురాశ ఎప్పుడు నష్టాన్నే తీసుకు వస్తుంది నీకు ఉంటున్న ఇల్లు, సెల్ ఫోన్, డ్రెస్ అన్ని కూడా యేసయ్య ఇచ్చినవే. కనుక చి ఇది బాగోలేదు అని ఎన్నడూ ఇతరుల యొద్ద ఉన్నది బాగున్నది అని ఆలోచించకు. నీ యొద్ద ఉన్నదే చాలు అని జీవించడం నేర్చుకొనిన యెడల యేసయ్య సంతోషిస్తారు.
-    శ్రీమతి. లెబానోన్ రాజ్ కుమార్

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)