దిన ధ్యానము(Telugu) 03.11.2024 (Kids Special)
దిన ధ్యానము(Telugu) 03.11.2024 (Kids Special)
అంశం: ఏది ముఖ్యం
ప్రత్యేకంగా చిన్న పల్లల కొరకు
“పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు” - మత్తయి 6:20
హలో పిల్లలు! రోజులు ఎంత త్వరగా గడిచిపోతున్నాయో మీకు తెలుస్తుందా? క్వటర్లి పరీక్ష ముగిసింది, అర్థ వార్షిక పరీక్ష కూడా త్వరలోనే రానుంది. అందరూ బాగా చదవండి, సమయాన్ని వృధా చేయవద్దు. ఎందుకో మీకు తెలుసా ? సమయం బంగారం కన్నా విలువైనది. అందరూ బంగారాన్ని ఇష్టపడతారు కదా! ఒక చిన్న స్టడ్ కొనడానికి ఎంత ఖర్చు పెట్టాలి? మనం బంగారాన్ని చాలా ముఖ్యం అనుకుంటాము. కానీ నిజంగా ఏది ముఖ్యం? ఆ విషయం గురించి మనం ఒక కథ వినబోతున్నాము.
ఒక వృద్ధుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పట్లో ఒక మనిషి బైక్ పై వెళ్తున్న ఒక మహిళ మెడలో ఉన్న గొలుసును తీయడం కోసం ప్రయత్నించి, ఆమెను కింద పడవేశాడు. ఆ మహిళ గాయపడి పడిపోతే, ఆ వృద్ధుడు "జీవితం బంగారు గొలుసు కన్నా తక్కువా?" అనుకుంటూ ఆమెకు సహాయం చేశాడు. అప్పటి నుంచి అతను తన చిన్నప్పుడు జరిగిన సంఘటనల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు.
తన స్నేహితునితో కలిసి ఆదివారం క్లాస్‌కు వెళ్లేవాడు. అక్కడ స్వర్గం, నరకం గురించి తనకు నేర్పించారు. అతను యేసు గురించి విన్నాడు కానీ ఆమోదించలేదు. ఇప్పుడు అతను కోట్లు సంపాదించిన ధనవంతుడు అయ్యాడు. ఒక రోజు వృద్ధుడు తన మొత్తం ఆస్తిని అమ్మేసి, చాలా బంగారు నాణేలు ఒక సూట్‌కేసులో పెట్టుకుని "నేను చనిపోయి స్వర్గానికి వెళ్తే ఈ బంగారంతో వెళ్ళాలి" అని అనుకున్నాడు. స్వర్గానికి వెళ్ళినప్పుడు దేవదూత అతన్ని చూసి, "సూట్‌కేసులో ఏముంది?" అని అడిగాడు. వృద్ధుడు సంతోషంగా "బహుమూలమైన బంగారు నాణేలు ఉన్నాయి" అన్నాడు. దేవదూత అతనికి "ఇవి రోడ్డుకు ఉపయోగపడతాయి" అని చెప్పాడు. తాను చేసిన మంచిపనులు, ప్రార్థనలు, మరియు యేసు సువార్త ద్వారా రక్షించబడిన ఆత్మలు మాత్రమే స్వర్గంలో విలువైనవి అని అతనికి అర్ధమైంది. కానీ అది కలే!
ప్రియమైన పిల్లలారా, మనకు స్వర్గం ఎంత ముఖ్యమో, మనం దాని కోసం ఏమి చేయాలో తెలుసుకున్నాం కదా! మనమూ మన చుట్టూ ఉన్నవారితో యేసును గురించి చెబుదాం. స్వర్గంలో ధనాన్ని సేకరించండి. అది క్షేమంగా ఉంటుందని గుర్తుంచుకోండి. ఆల్ ది బెస్ట్!
- శ్రీమతి. దేబోరా గారు
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250