దిన ధ్యానము(Telugu) 05.11.2024 (Gospel Special)
దిన ధ్యానము(Telugu) 05.11.2024 (Gospel Special)
అంశం: వారు ఎలా నమ్మగలరు?
"వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు?” - రోమీయులకు 10:14
ఒక క్రైస్తవుడు ఒక న్యాయవాది గదిలో ప్రవేశించాడు. బయటకు వెళ్ళే ముందు అతని మనసులో ఎప్పటి నుండో ఉన్న ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న ఏమిటి అంటే “సార్, మీరు క్రైస్తవుడు కాదేమిటి?” ఆ న్యాయవాది ఈ ప్రశ్నకి ఏమాత్రం సిద్ధం కాకుండా ఆశ్చర్యపోయాడు. కొద్దిగా సిగ్గుపడుతూ తల వంచాడు, “బైబిల్లో మద్యపానులు స్వర్గ రాజ్యానికి వెళ్లరు అంటుంది కదా. అదే నా బలహీనత. అందుకే నేను క్రైస్తవుడిని కాదు” అని అతను సమాధానమిచ్చాడు. ఆ క్రైస్తవుడు మళ్ళీ ఆ ప్రశ్న అడిగాడు. అతను చెప్పాడు, "నాకెప్పుడూ ఎవ్వరూ ఈ ప్రశ్న అడగలేదు. నేను ఎలా క్రైస్తవుడిని అవగలను? చెప్పండి." అప్పుడు ఆ ప్రశ్నదారుడు న్యాయవాదికి వేదాంత సత్యాలను అర్థమయ్యేలా వివరించాడు. ఈ చిన్న ప్రార్థన చేయండి: "ప్రభూ, నా బలహీనత నాకు తెలుసు. దానిని నాకంటికి దూరం చేయుము." ఆశ్చర్యకరంగా ప్రభువు మద్యపాన బలహీనత నుండి విముక్తిని ప్రసాదించారు.
ప్రియమైన దేవుని ప్రజలారా! మన దేవుడు అన్ని రకాల పాపాలను క్షమిస్తాడు. దేవుడు క్షమించలేని పాపం ఏది లేదు. నేడు చాలామంది నా పాపం చాలా గొప్పదని భావిస్తున్నారు. దానికి ఎలాంటి క్షమా లేదని అనుకుంటున్నారు. మరికొందరు ఆ పాపాన్ని వదులుకొని, మరచిపోలేక ఆ పాపం పట్ల బాధతో జీవిస్తున్నారు, “నేను ఏమి చేయాలి?” అని సందేహిస్తున్నారు. కాని ప్రవక్త యెషయా తన గ్రంథంలో ఇలా వ్రాసాడు: "మీ పాపాలు ఎరుపురంగులో ఉన్నా, అవి మంచువలె తెల్లగా మారును; అవి రక్తవర్ణంలో ఉన్నా, పత్తి వలె తెల్లగా మారును" (యెషయా 1:18). మీరు స్వచ్ఛందంగా వినగలిగితే, మీరు క్షమాపణ పొందుతారు. మీ పాపాలను క్షమించే ఒక యేసు క్రీస్తు ఉన్నారని వారికి తెలియచేయాలి. మీరు వారికి చెప్పకపోతే వారు ఎలా తెలుసుకోగలరు?
ఈ రోజు కూడా పాపంలో చిక్కుకోని దానినుండి బయటపడలేని చాలా మంది ఉన్నారు. వారికీ యేసు క్రీస్తును విమోచకుడిగా స్వీకరించడానికి మార్గం చూపే వ్యక్తులు అవసరం. బోధించే వారు లేకపోతే వారు ఎలా వినగలరు? మనం ఎందుకు సువార్తికులుగా ఉండకూడదు? మనం మన విధిని నిర్వర్తిద్దాం, దేవుడు తన విధిని నిర్వర్తిస్తాడు. ఆమేన్! హల్లెలూయా!
- బ్రదర్. ఎస్.ఏ. ఇమ్మానుయేలు
ప్రార్థన అంశం:
సువార్తిక మిషన్‌లో 25,000 గ్రామాల్లో పంచబడిన కరపత్రికలు మరియు సువార్త పుస్తకాలను అందుకున్న ప్రజల హృదయాలలో దేవుడు కార్యసాధనం చేయమని ప్రార్థించండి.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250