Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 08.01.2021

దిన ధ్యానము(Telugu) 08.01.2021

నేనే

"తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్నునిర్దోషినిగా తీర్చుము" - కీర్తనలు 19: 12

చార్లెస్ స్పర్జన్  ఒక సారి బానిస ఖైదీలు ప్రయాణం చేస్తున్న నావలో ప్రయాణం చేస్తున్నారు. అక్కడ ఉన్న అందరితో సహజముగా మాట్లాడుతూ అందరికి ఒక ప్రశ్న అడిగారు. మీరు ఎందుకు ఖైదీలుగా బందించబడ్డారు. అనేకులు తమ యొక్క పరిస్థితికి గల కారణం ఇతరులే అన్నారు. మరికొందరు పరిస్థితులే కారణం అన్నారు. మరియొకరు నా పరిస్థితికి నా ధనాషే కారణం అని అన్నారు. అందుకు  స్పర్జన్   దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారు అన్నారు. దీనిని గమనించిన అధికారి స్పర్జన్ దిగుతున్న పట్టణములో ఆ ఖైదీని కూడా  స్పర్జన్ తో పాటు విడిచిపెట్టారు. కొన్ని దినాల్లో ఆయన యేసుక్రీస్తును అంగీకరించి ఆ పట్టణంలో అనేక ఆత్మలను దేవునికి సొంతం చేసే సేవకునిగా మారాడు. 

సాదారణముగా మనము ఎవ్వరము కూడా మన తప్పిదములను ఒప్పుకొనుట అరుదు. ఏదేదో కారణములు చెప్పి మనలను నిరపరాదులుగా నిరూపించుకొనుటకు ప్రయత్నం చేస్తాం. ఇది ఆదాము, హవ్వ మొదలుకొని ఈ దినము వరకు కొనసాగుతున్న ఒక ప్రక్రియ. కాని ఎవడు తన తప్పిదములను ఒప్పుకుంటున్నాడో వాళ్ళను దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తారు. దావీదు యొక్క జీవితం దీనికి మంచి ఉదాహరణ. దావీదు ఊరియా భార్యతో పాపములో పడి ఊరియాను హత్య చేసినది నిజమే. కాని దేవుడు ప్రవక్తను పంపి తప్పిదమును చూపించిన వెంటనే దావీదు తన స్తానమును బట్టి తప్పిదములను కప్పివేయకుండా తన తప్పిదమునకు అనేకమైన కార్యములు చూపించకుండా తన తప్పిదమును బట్టి పశ్చాత్తాపం చెంది కీర్తనలు 51వ ఆధ్యాయం వ్రాస్తున్నారు. ఈ కీర్తన చదువుతున్నప్పుడు ఆయన మీద మనకు మర్యాద ఎక్కువ అవుతుందే తప్ప తక్కువ అవ్వడం లేదు. దావీదు రాస్తున్న కీర్తన అన్నింటిని పరిశుద్ధ గ్రంధంలో వ్రాయుటకు ఎంత మాత్రము వెనకంజ వేయలేదు. అవును తన తప్పిదమును గ్రహించే మనుష్యుని ఆయన వాడుకొనుటకు ఆయన ఎదురు చూస్తున్నారు.

ప్రియమైన వారలారా! దేవుడు మీతో మాట్లాడుతున్నారు మీ తప్పిదములకు పరిస్థితిని కారణము చూపించి వాటిని సరి చేయాలి అని ప్రయత్నం చేస్తున్నారా? దేవుని వాక్యంలో దేవుడు మనతో ప్రసంగం ద్వారా మాట్లాడుతున్నప్పుడు లోబడవలసిన కార్యాలలో మనలను సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. తన తప్పిదములను గ్రహించు వాళ్ళను దేవుడు ఆశీర్వదించి అంగీకరించుటకు ఎన్నడు ఆయన ఆలస్యం చేయరు. అవును ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే మన స్వనీతిని విడిచిపెట్టి మన యొక్క పరిస్థిని దేవుని ఎదుట ఒప్పుకుందాం. దీవించబడదాం.
-    బ్రదర్. ఎల్. అలగర్ సామి.

ప్రార్థన అంశం. 
జనవరి 21వ తారీఖున  రాగ్ ల్యాండ్ బైబిల్ కాలేజ్ 6వ బ్యాచ్ ప్రారంభించబడుతుంది. నూతన విద్యార్థులు అనేకులు ఆశక్తితో జాయిన్ అయేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)