Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 06.01.2021

దిన ధ్యానము(Telugu) 06.01.2021

నిషేధించబడిన రాయి.

"వ్యసనమువలన నా ప్రాణము నీరైపోయెను నీ వాక్యముచేత నన్ను స్థిరపరచుము" - కీర్తనలు 119: 28

ఒక దినము స్కూల్ నుండి వచ్చిన థామస్ అల్వా ఎడిషన్ చేతిలో ఉన్న లెటర్ తన తల్లికి ఇవ్వమని టీచర్ చెప్పి పంపించారు. ఆ లెటర్ ను ఆ తల్లి కన్నీరుతో తన కుమారుడు వినేటట్లు చదివింది. మీ  కుమారుడి యొక్క తెలివితేటలు ముందు  మా  స్కూల్ చాలా చిన్నది. కాబట్టి మీరే  మీ కుమారునికి నేర్పించుకోమని వ్రాసిన లెటర్ ను ఆ తల్లి చదివి ముగించారు. అప్పుడు మొదలుకొని తన కుమారునికి ఇంట్లో పాఠములు నేర్పించడం ప్రారంభించారు. చాలా సంవత్సరాలు తరువాత ఎడిషన్ యొక్క తల్లి కూడా మరణించారు. ఎడిషన్ ఆ శతాబ్దంలోనే గొప్ప శాస్త్రవేత్తగా పేరు పొందుకున్నారు. చాలా సంవత్సరాలు గడిచాయి పాత వస్తువులు అన్ని కూడా తీసి పెడుతున్న సందర్భంలో తన తల్లి గారు చదివి వినిపించిన ఆ లెటర్ అతని కంట్లో పడింది. దాంట్లో మెదడు ఎదగని మీ కుమారుడికి మిరే ఇంట్లో పాఠములు చెప్పుకోమని అందులో వ్రాసి ఉంది. దానిని చదివిన ఎడిషన్ కు కంట్లో కన్నీరు రావడం ప్రారంబించింది. తరువాత తన డైరీలో మెదడు ఎదగని ఎడిషన్ తన తల్లి వలన  గొప్ప శాస్త్రవేత్తగా మారాడు అని వ్రాసారు. 

గెరాసేనియుల  దేశంలో అనేక మంది అపవిత్ర ఆత్మల చేత పట్టి పీడింపబడిన వారు కలరు. ఆయన అందరి వలన వెళ్లగొట్టబడిన వాడిగాను, తృణీకరింప బడిన వాడిగాను వున్నాడు. కాని యేసుక్రీస్తు మాత్రం అతనిలో ఉన్న అపవిత్ర ఆత్మ అతని లోనుండి బయటకు పారద్రోలి అతనిని విడిపించారు. దాని ద్వారా ఆ పట్టణమునకే సువార్త ప్రకటించుటకు అతనిని వాడుకొన్నారు. ఆయనను గొప్ప  సేవకునిగా మార్చు కున్నారు. మనము అనేక సమయాల్లో శరీరంలో బలహీనత కలిగిన వాళ్ళను, విశ్వాసంలో వెనకబడిన వాళ్ళను చూచి మనస్సులో బాధపడి వాళ్ళను దాటి వెళ్లిపోతున్నాము. మెదడు ఎదగని ఎడిషన్ ను స్కూల్ టీచర్స్ త్రోసి వేశారు కాని ఈ రోజు మన ఇళ్లల్లో వెలుగు ఇస్తున్న బల్బు ను కనుగొన్నది ఆయనే. మనుస్యులు వలన తిరస్కరించబడిన ఆయన చివరికి ఆ పట్టణంలో సువార్తను ప్రకటించే గొప్ప సేవకునిగా మార్చబడ్డాడు. మన యొక్క దేవుడు కూడా అల్పంగా ఉన్న వాళ్ళను, త్రోసివేయబడిన వాళ్ళను తన కృపతో ఘనంగా వాడుకుంటున్నారు. కాబట్టి బలహీనమైన వాళ్ళని బలపరుద్దాం. వాళ్ళు దేవుని చేత వాడబడే బలమైన పాత్రగా మారనివ్వండి.
-    బ్రదర్. ఎస్. మనోజ్ కుమార్.

ప్రార్థన అంశం:-
అనుదిన ధ్యానము యొక్క తయారీ పనిలో పాలి బాగస్తులైన దేవుని పిల్లలను దేవుడు విశేష జ్ఞానం అనుగ్రహించేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)