Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 30.12.2020

దిన ధ్యానము(Telugu) 30.12.2020

లెక్క అప్పగించుట:-

"బహు కాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారియొద్ద లెక్క చూచుకొనెను" - మత్తయి 25:19

ప్రతి సంస్థ కూడా మార్చి నెల ఆకరున తమ సంస్థ యొక్క రాబడులను, లెక్కలను   ప్రభుత్వమునకు సమర్పించవలసిన భాద్యత కలిగినవారుగా ఉంటున్నారు. లోకానుసారమైన ఒక సంస్థే ఖర్చు చేసే చిన్న లేదా పెద్ద మొత్తానికి ప్రతి దానికీ ఒక పట్టిక వేసి ఒక క్రమంగా పద్ధతిలో లెక్కలు చూపించ వలసి ఉంది. మన పరలోక యజమానుడు కూడా మన యొద్ద అప్పగించబడిన కార్యాల కొరకు తీర్పు దినమున లెక్క అడుగుతారు అనే దానిని మనము  మరచిపోకూడదు. మనము లెక్క అప్పగించవలసి కొన్ని కార్యాలని  ఈ దినం చూద్దామా?.

తన గురించి : (రోమీయులకు 14:12) మనలో ప్రతి వాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. అని వ్రాయబడినట్టు మనం జీవించే జీవితం గురించి మనమే దేవుని ఎదుట లెక్క అప్పచెప్పేవారమై యుండాలి. మన యొక్క సాక్ష్యం ఇతరులను దేవుని యొద్దకు నడిపించుటకు హేతువుగా ఉంటుందా? లేదా సాక్షి లేని జీవితం జీవించి ఇతరులకు అభ్యంతర పరుస్తున్నామా? క్రీస్తును కలిగియున్నవారే క్రైస్తవులు నేను క్రీస్తు లేని వ్యక్తిగా  జీవిస్తున్నానా? లేదా నన్ను  చూస్తున్న వాళ్ళు క్రీస్తును చూస్తున్నారా? నా యొక్క జీవితం మాదిరి కరమైన జీవితంగా ఇతరులను దేవుని యొద్దకు నడిపించే జీవితంగా ఉంటుందా? ఆలోచించి చూద్దాం.

నేను మాట్లాడుతున్న మాటల గురించి : ప్రభువైన యేసు (మత్తయి 12:36) మనుష్యులు పలుకు ప్రతి వ్యర్ధమైన మాటలను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి యుండెను అని చెప్తున్నదానిని చూస్తున్నాం. ప్రతిరోజు ఉదయం మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు మనం మాట్లాడే ప్రతి మాటలు అవసరమైన మాటలా లేక వ్యర్థమైన మాటలా? అపోస్తులుడైన పౌలు ఇతరులకు ప్రయోజనకమైన మాటలు మాత్రమే మాట్లాడమని సలహా చెప్తున్నారు. (లుకా16:2)లో నీ గృహ నిర్వాహాక  లెక్క అప్పగించుము అని వ్రాయబడినట్టు ప్రభు వలన మనము పొందియున్న తలాంతులను ఆయన కొరకు ఆయన నామ మహిమార్ధం వాడాలి నాకు ఏ తలాంతు లేదు అని ఎవ్వరూ అనలేరు మన ప్రతి ఒక్కరికి దేవుడు తలాంతులను, తెలివితేటలను దయచేసి యున్నారు. సమయము, ధనము, ఆస్థి వీటన్నింటిని దేవుడు మనకు దయచేసి యున్నారు. దేవుడు దయచేసిన వీటన్నింటిని ఆయన నామ మహిమార్ధం వాడవలసినది మన మీద మోపబడిసియున్న బాధ్యత. 

స్నేహితులారా! దేవుని ఎదుట లెక్క అప్పగించవలసి యున్న వారమైన మనము  ఆ దినం వైపు పరిగిడుతూ ఉన్నాం. కాబట్టి ఆ దినం కొరకు సిద్ధపడదాం. 
-    ఆర్.జయశీల

ప్రార్థన అంశం:
నూతన సంవత్సరం దీవెన కరముగా ఉండేటట్లు ప్రార్ధిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)