Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 14.05.2021

దిన ధ్యానము(Telugu) 14.05.2021

క్రూరత్వము.

"దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును" - యాకోబు 1:15

ఒక యవ్వన స్త్రీ యొద్దనుండి దేవుని దాసునకు ఒక ఫోన్ వచ్చింది. ఆమె ఇలాగు చెప్ప సాగింది. నేను దేవుని వాక్యమును  టి.వి లో ఆశక్తితో చూస్తుంటాను. కాని ఇప్పుడైతే మీ సందేశమును వినుటకు ఆశక్తి లేదు. నా హృదయములో సమాధానము లేదు. నా హృదయము రాయి వలె అయినట్లుంది. అంతే కాదు కనికరము లేని హృదయము వలె మారిపోయింది. నా తల్లిని నెట్టేసి క్రింద త్రోసివేశాను. ఆమె ఇప్పుడు నడవలేని పరిస్థితిలో ఉన్నారు. కొన్ని రోజులుగా నాకు నేనే నచ్చలేదు. అయ్యా నేను ఇప్పుడు పెద్ద పాపిగా మరిపోయాను అన్నది ఆమె . కారణం ఏమిటి అని ఆ సేవకుడు అడిగినప్పుడు నేను ఇప్పుడు సోషల్ మీడియాకు బానిస అయిపోయాను. ఒక దినము ఫేసుబుక్ లో ఒక అకౌంట్ ప్రారంభించి అనేకుల యొక్క పిలుపుని అందుకున్నాను. నా జీవితమే మలుపు తిరిగింది. దాని కోసమే ఎక్కువ సమయం కేటాయించడం ప్రారంభించాను. బైబిల్ చదవడానికి, ప్రార్థన చెయ్యడానికి సమయం లేదు. మీ యొక్క సందేశాన్ని ఇప్పుడు చూడనే చూడలేదు. నా యొక్క తల్లి నా దగ్గరకు వచ్చి ఎందుకు ఇలాగు మరిపోయావు అని అడిగినందుకు ఆమెను నెట్టి త్రోసివేశాను. ఆమె నడుముకు గాయం ఏర్పడింది అయినను ఆమె ఏడుస్తూ మరల మరక నువ్వు ఎందుకు బైబిల్ చదవ లేదు, ప్రార్థన చెయ్యలేదు అని అడిగారు. ఆమె వేదన చూచి నాకు ఏడ్పు రాలేదు. నా హృదయం గట్టిపడిపోయింది. అయ్యో నేనెందుకు ఇలా అయిపోయాను అని నా కొరకు ప్రార్థన చెయ్యండి అని చెప్పింది ఆమె. 

యేసుక్రీస్తు శిష్యుడైన ఇస్కరియోతు యూదా లోను కొంచం కొంచంగా ధన ఆశ వచ్చి ఆఖరికి  యేసు క్రీస్తును అప్పగించే అంతగా అతనిలో పాపము పెరిగిపోయింది. ఆయన యొక్క హృదయ కఠిన్యత వలన ఆయన హృదయము కఠిన పరచబడింది. ప్రియమైన తమ్ముడు, చెల్లి నీ జీవితపు పరిస్థితి ఏమిటి? దింట్లో ఏముంది అని సరదాగా ఒక మేస్సేజ్ నీ జీవితపు యొక్క గమ్యమునే మార్చేస్తుంది అనే విషయాన్ని మరవకు. చిన్న పాపమే కధ అని ప్రారంభించి ఇంటర్నెట్ గేమ్స్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్, చాట్ వీటిలో పాపము ఏముంది అని  ఆశ్రద్ద చేసి పాపములో చిక్కుకు పోతున్నాము. కొందరు ఆత్మహత్య వైపు వెళ్తున్నారు. అదికాండం 4:7 లో నీ పాపం నీ వాకిట పొంచి యుండును అని బైబిల్ చెబుతుంది. ఆ ఉచ్చులో చిక్కుకొని మరల లేవలేని పరిస్థితిలో అనేకులు వుంటున్నారు. కాబట్టి రోజు బైబిల్ చదివి ధ్యానించుటకు నిర్ణయించుకుందాం. దేవుడు మన ప్రతి ఒక్కరినీ ఇలాంటి మాయకరమైన ఉచ్చులో  పడిపోకుండా, చిక్కుకొనకుండా కాపాడును గాక! 
-    బ్రదర్. పి.వి. విలియమ్స్

ప్రార్థన అంశం:-
పీస్ సెంటర్ కొరకు చాపల్ కట్టే పనిలో దేవుని హస్తం తోడై యుండేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)