Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 01.05.2021

దిన ధ్యానము(Telugu) 01.05.2021

సంరక్షించే దేవుడు.

"భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము" - యెషయా 41:10

గడిచిన సంవత్సరంలో కరోనా వలన అనేక నెలలు లాక్ డౌన్ లో ఆర్థిక సమస్య ఆనే పెద్ద సమస్య గుండా నడుస్తూ వెళ్ళాము. మరల ఈ సంవత్సరంలో కూడా కరోనా వలన ప్రపంచమంతా కూడా ఈ రోగము వలన ఇబ్బంది పడుతువుంది. ఎప్పుడు ఇది ముగింపుకు వస్తుంది, తరువాత ఏమి జరుగుతుంది అన్న భయము మానవ జాతిని పీడిస్తూ ఉంది.

మరలా లాక్ డౌనా అని ప్రజలు దిగ్భ్రాంతి చెందుతున్నారు. ఇంకను కొన్ని సంవత్సరాలు ఈ రోగము యొక్క ప్రభావము ఉంటుంది. దీనితో జీవించుటకు అలవాటు చేసుకోనండి అని చెప్పబడుతోంది. టీకాలు, మాస్కులు ఇతర సంరక్షణ విధి విధానములను ధరించుకోమని ప్రభుత్వము కఠోరముగా ప్రకటిస్తున్నారు. అయినప్పటికీ ప్రజలు మా జీవితాలు ఏమైపోతాయో, ఎప్పుడు నా దేశం సహజ పరిస్థితికి వస్తుందా అనే భయము కనబడుతూనే ఉంది. 

లోకాన్ని సొంతం చేసుకోవాలి అని ఆసించిన నెపోలియన్ యుద్ధంలో బ్రిటన్ యొద్ద అపజయాన్ని పొంది సైన్యం చేతిలో పట్టబడి ఆఫ్రికా చెరసాలలో బందింపబడ్డారు. మిక్కిలి మనో దుఃఖం వలన తన జీవితాన్ని ఒంటరిగా ఆయన గడిపారు. ఆయనను కలవడానికి వచ్చిన ఒక స్నేహితుడు చెస్ బోర్డ్ ఒకటి ఆయన చేతికి ఇచ్చి ఇది మీ ఆలోచనను బలపరుస్తుంది అని చెప్పారు. అధికమైన వత్తిడిలో ఉండిన నెపోలియన్ దానిని లెక్క చేయలేదు. కొన్ని దినముల తరువాత రోగము వలన మరణించారు. తరువాత దినాల్లో ప్రాన్స్ దేశంలో ఉన్న ఎక్జిబిషన్ లో ఆయన వాడిన ఆ చెస్ బోర్డును ప్రజల ముందు వేలంపాట పాడుటకు సిద్ధపరిచారు. దానిని పరిశీలించి నప్పుడు ఆ చెరసాలలో నుండి తప్పించుకోవడానికి గల మార్గం తరువాత కనబడింది. వత్తిడి వలన నెపోలియన్ దానిని గమనించలేదు. 

మన దేవుడు మన చేతుల్లో విలువ కలిగిన బైబిల్ ను మనకు సంరక్షణగా ఇచ్చియున్నారు. చింత, భయము కలిగినప్పడు దానిని తెరచి చదవడం మార్చిపోకండి. ప్రియమైన వారలారా బైబిల్ మాటలు మనకు గొప్ప ఔషధం, సంరక్షణ, ఆరోగ్యం అన్నింటిని కలిగి ఉంది కాబట్టి రోజు బైబిల్ ను చదివి, ధ్యానిద్దాం. ఈ రోగము గురించిన భయము మనకు అవసరం లేదు. సంరక్షించే దేవుడు మీ తోను మీ కుటుంబీకులతోను ఉన్నారు. దేవుని ప్రసన్నత మిమ్మల్ని కప్పుకొనును గాక. ఆమెన్!
-    శ్రీమతి. సరోజా మోహన్ దాస్.

ప్రార్థన అంశం:-
ఈ నెల అంతా జరగబోయే పరిచర్యలో దేవుని హస్తం తోడైయుండి నడిపించే లాగున ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)