Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 15.10.2024

దిన ధ్యానము(Telugu) 15.10.2024

 

అంశం: విజయానికి పుట్టినవారు

 

"అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము" - రోమీయులకు 8:37

 

ఒక గొప్ప సైన్యాధిపతి తన దేశానికి సమీపంలో ఉన్న ఒక ద్వీపాన్ని ఆక్రమించాలనుకున్నాడు. ఆ ద్వీపాన్ని అతని దేశంతో కలుపుతున్నది ఒక్క వంతెన మాత్రమే. ఒక రాత్రి, తన సైనికులను ఆ వంతెన ద్వారా ద్వీపానికి చేరుకోవాలని ఆదేశించాడు. వారు ఆ ఆదేశాన్ని అనుసరించి ద్వీపాన్ని చేరుకున్నారు. ఆపై సైన్యాధిపతి ఆ వంతెనను పూర్తిగా ధ్వంసం చేయాలని ఆజ్ఞ ఇచ్చాడు. సైనికులు ఆశ్చర్యపోయారు, ఒక సైనికుడు ప్రశ్నించాడు, "మాకు తప్పించుకోవడానికి ఈ వంతెన తప్ప వేరే మార్గం లేదు; దీన్ని ధ్వంసం చేస్తే ఎలా తిరిగి వెళ్లగలము?" అని అడిగాడు. అప్పుడు సైన్యాధిపతి ఇలా చెప్పాడు, "మనం ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి రాలేదు; విజయాన్ని సాధించడానికే వచ్చాము." వంతెన ధ్వంసం చేయబడింది, విజయాన్ని సాధించారు. ఆ వంతెన విజయ వంతెనగా మళ్లీ నిర్మించబడింది.

 

ఈ సందేశాన్ని చదువుతున్న దేవుని పిల్లలారా, మీరు ఏదైనా పని ప్రారంభించే సమయంలో "ఇది జరగకపోతే, ఇది సఫలం కాకపోతే, ఇది అసాధ్యమైతే" అని ప్రతికూలంగా ఆలోచించకండి. అలా ఆలోచిస్తే, మీరు చేపట్టిన పనిలో విజయం దక్కదు. "నన్ను బలపరచే క్రీస్తు ద్వారా నేను అన్నింటినీ చేయగలను" అనే వాక్యాన్ని విశ్వాసంతో మీ హృదయంలో గాఢంగా దాచుకోవాలి.

 

పరలోక క్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకున్న మా క్రైస్తవ యాత్రలో, మనం వెనుకకు తిరిగి చూడకూడదు. మేఘం వలె ఉన్న అనేక మంది సాక్షులు తమ విశ్వాసయాత్రను పూర్తిచేసినట్లు వాక్యంలో మనం చూడవచ్చు. హెబ్రీయులకు 11:15-16 లో మన పూర్వికులు, వారు విడిచిపెట్టిన దేశానికి తిరిగి వెళ్లాలనే కోరిక లేకుండా, కష్టాలు, పోరాటాలు, సమస్యల మధ్య పరలోక దేశాన్ని ఆశించి, దేవుని వద్ద నమ్మకమైన సాక్ష్యాన్ని పొందారు.

 

ఎలీయా ఎలీషాను పిలిచినప్పుడు, ఎలీషా తన పొలాన్ని దున్నే ఎద్దులను దహనం చేసి వచ్చాడు. తన హృదయం పాత పనిలోకి తిరిగి వెళ్లకుండా ఉండేందుకు ఇలా చేసి ఉండవచ్చు. యేసు ప్రభువు కూడా “నాగటిపై తన చేయిని ఉంచి, వెనక్కి చూసేవాడు దేవుని రాజ్యానికి తగినవాడు కాడు” అని చెప్పారు. నేటి వాక్యంలో మనలను ప్రేమించే యేసు క్రీస్తు, మనలను పూర్తిగా విజయకాంక్షులుగా మారుస్తారు. కాబట్టి మనం నిరుత్సాహపడకుండా, వెనక్కి తిరగకుండా, మన లక్ష్యంపై గురించి పరుగెత్తి విజయాన్ని సాధిద్దాం!

- శ్రీమతి ప్రిసిల్లా తియోఫిలస్

 

ప్రార్థన అంశం:

ఈ సంవత్సరం ముగిసే నాటికి ఒక లక్ష (100,000) మంది పిల్లలకు సువార్త చేరాలని ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)