Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 14.10.2024

దిన ధ్యానము(Telugu) 14.10.2024

 

అంశం: మీకు నిజమైన ఆనందం కావలెన?

 

"...నీ రక్షణనుబట్టి సంతోషించుచున్నాను” - 1 సమూయేలు 2:1

 

అమెరికా దేశంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. ఆయనకైతే అనేక విధమైన సమస్యలు మరియు హృదయంలో అనేకమైన కలతలు, మరణ భయము ఆయనను కృంగతీసింది. ఆయన సంపాదించిన ఆస్తులు అన్నిటిని కూడా సంతోషంగా అనుభవించలేకపోయేవాడు. ఒక దినం ఆయన ఒక దేవుని సేవకున్ని చూచి మీ యొక్క జీవిత సంతోషమునకు గల రగస్యం ఏమిటి అని అడిగాడు. అందుకు ఆ సేవకుడు ఆయనకు కలువరి ప్రేమను యేసయ్య ఎలాగా ప్రేమిస్తున్నారో ఆయనకు వివరించారు .ఆయన మారుమనస్సు పొంది రక్షణ ఆనందాన్ని పొందుకున్నారు. లోకంలో గల సమస్త కార్యాలు కూడా కొత్తదిగా మారిపోయినట్టు ఆయనకు అనిపించింది .

 

ఈ లోకంలో మూడు విధములైన సంతోషాలు కలవు. మొదటిది లోకానుసారమైన కార్యాల్లో విజయం సాధించినప్పుడు హృదయంలో కలుగుతున్న సంతోషం .ఇది యధావిధి అయినది అందరికీ వస్తున్నదే .రెండోది సాతాను తీసుకొస్తున్న సంతోషం అది పాపపు సంతోషం అది నిజమైన సంతోషం కాదు. ఆశాశ్వతమైన పాపపు సంతోషం . ముగింపులో అది మనలను పాతాలములోనికి, అగ్నిగుండంలోనికి త్రోసి మనము నిత్య జీవాన్ని కోల్పోయేటట్లు చేసేస్తుంది. మూడోదిగా దేవుని చేత కలుగుతున్న సంతోషం. ఇది ఈ లోకం ఇవ్వలేని, తీసుకోలేని సంతోషం. మన పాపాలు క్షమించబడుతున్నప్పుడు రక్షణ సంతోషం కలుగుతుంది. ఆయనను స్తుతించి ఆరాధించినప్పుడు పరలోక సంతోషం మనలోనికి వస్తుంది యేసుక్రీస్తు ఇస్తున్న ప్రధానమైన సంతోషము రక్షణ సంతోషం .నా పాపాలన్నిటిని క్షమించి వేశారు ఆయన నన్ను తన బిడ్డగా చేర్చుకున్నారు. నా హృదయంలో నివాసం చేస్తున్నారు అని తలంచేటప్పుడు గొప్ప ఆనందం మన హృదయాన్ని నింపుతుంది. రక్షింపబడుతున్నప్పుడు మనం దేవుని పిల్లలుగా ఆయనను అబ్బా తండ్రి అని పిలుస్తున్న దత్తపుత్ర ఆత్మను పొందుకుంటున్నాం. ఆయన మనకు ఇస్తున్న సమస్త శ్వాస్యతను అనుభవిస్తున్నాం. మన యొక్క పేర్లు పరలోక జీవ గ్రంథంలో రాయబడుతుంది. దేవుడు నూతన జీవాన్ని దయచేస్తున్నారు ఈ దిన లేఖన భాగంలో జక్కయ్య గురించి చదువుతున్నాం. జక్కయ్య నువ్వు త్వరగా దిగి రమ్ము ఈ దినం నేను నీ ఇంటిలో ఉండవలెను అని యేసయ్య చెప్పినప్పుడు జక్కయ్య త్వరగా దిగి సంతోషముతో యేసయ్యను తమ ఇంటిలోనికి తీసుకొని వెళ్ళాడు అని చదువుతున్నాం లూకా 19:6 జక్కయ్య హృదయంలో మార్పు కలిగింది ఆయన ఇంటికి రక్షణ వచ్చింది.

 

ప్రియమైన వారలారా ! ఈ దినపు నాగరీకత నైపుణ్యత గల లోకములో జీవిస్తున్న మనము ఎక్కడెక్కడో సంతోషాన్ని, సమాధానమును, నెమ్మదిని వెతుకుతూ తిరుగుతున్నాం. ఉచితంగా మీకు సంతోషాన్ని సమాధానాన్ని ఇవ్వగలిగిన యేసయ్య యొద్దకు రండి ఆయన మీ హృదయములో సంతోషాన్ని మీ ఇంట్లో ఆనందాన్ని సమాధానాన్ని నింపుటకు సిద్ధంగా ఉన్నారు. మీ జీవితాన్ని ఆయనకు సమర్పించండి. 

- శ్రీమతి. జబకని శేఖర్ గారు.

 

ప్రార్థన అంశం :

ప్రతి రాష్ట్రంలోనూ 500 మంది మిషనరిలు లేచేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)