Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 27.04.2021

దిన ధ్యానము(Telugu) 27.04.2021

దాచి పెట్టకుము.

"అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును" - సామెతలు 28: 13

తమ ఇంటిలో గల 10 బాతులను పెంచవలసిన బాధ్యత కళ మరియు ఆమె తమ్ముడైన సుందర్ యొక్క పని. ఒక దినము సుందర్ అడుకుందాము అని ఒక రాయి తీసి బాతుల గుంపు పైకి విసిరాడు అది ఒక బాతు తల మీద తగలడం వలన అది కింద పడి విలవిల లాడుతూ చనిపోయింది. అయ్యో నాన్నకు తెలిస్తే కొడతారు అని సుందర్ అక్క నువ్వు నాన్నకు చెప్పకు అన్నాడు. కళ అయితే నేను చెప్పిన పనులన్నీ నీవు చేస్తే నేను నాన్నకు చెప్పాను. ఆ ఇంటిలో కళ చేయవలసిన పనులన్నింటిని సుందర్ ద్వారా చేయించుకొనేది. నేను చేయను అని సుందర్ అంటే అరేయ్ బాతు అని బెదిరించేది. ఇలాగు తన పనులన్నింటిని సుందర్ ద్వారా చేయించుకొనేది. సుందర్ తన తప్పిదములను దాచిపెట్టుకొని అనేక పనులు చేయుట వలన జ్వరం వచ్చేసింది. చివరికి ఒక రోజు జరిగినది సుందర్ నాన్నతో చెబితే ఇంతేనా నాకు ముందే చెప్పియుంటే నిన్ను క్షమించి ఉండేవాడిని కదా అని అన్నారు నాన్న. దానిని గ్రహించని కళ అరేయ్ నా పనులన్నీ చేసి పెట్టు అని పిలిచింది. అందుకు సుందర్ తిరస్కరించాడు వెంటనే కళ ఒరేయ్ బాతు అని అనగానే బాతు సంగతి నిన్న అయిపోయింది అని సంతోషముతో ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. అవును మనం చేస్తున్న తప్పిదములను యేసయ్య దగ్గర ఓప్పుకొనుట మంచిది దాచిపెడితే ప్రమాదం. ఒప్పుకుంటేనే దానిని విడిచిపెట్టాలని ఆలోచన మనలో నిశ్చయముగా కలుగుతుంది. 

 

 దావీదు తాను చేసిన పాపాన్ని దాచిపెట్టకుండా ఒప్పుకొనుటను ఈ దినము లేఖన భాగంలో చదువుతున్నాం. రాజు అని తన యొక్క అంతస్తును అడ్డం పెట్టుకొని తాను చేసిన తప్పును దాచిపెట్టకుండా ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకుంటున్నారు. ప్రభువు మాత్రమే పాపమునుండి విమోచించ గలరు అని గ్రహించిన దావీదు మీరు నన్ను కడిగి పవిత్ర పరచండి అని దేవుని యొద్ద ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా మీకు వ్యతిరేకంగా పాపము చేసాను అని ఒప్పుకుంటున్నాడు. విరిగినలిగిన హృదయంతో ప్రార్థన చేస్తున్నాడు. అంతమాత్రమే కాక శుద్ధ హృదయం నాకు దయచేయండి అని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఆయన క్షమాపణ పొందుకున్నాడు. 

 

దీనిని చదువుతున్న మనం కూడా పాపాన్ని దాచిపెట్టకుండా దానిని దేవుని యొద్ద ఒప్పుకొనిన యెడల రక్షణను పొందుకుంటాం. పాపాన్ని దాచిపెట్టిన యెడల తప్పిదమైన ఆలోచనతో దుఃఖాన్ని అనుభవించ వలసి వస్తుంది. యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే మన పాపాన్ని క్షమించ గలిగే వ్యక్తి. ఆయన యొద్ద మన కార్యములను దాచిపెట్టకుండా ఒప్పుకుందాం కనికరమును పొందుకుందాం.

- బ్రదర్. టి. శంకర్ రాజ్

 

ప్రార్థన అంశం:-

మన పరిచర్యను కానుకల ద్వారా సపోర్ట్ చేస్తున్న పార్టనర్స్ కుటుంబాలను దేవుడు దీవించేటట్లు ప్రార్థిద్దాం.

 

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి

వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 

ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 

హిందీ కొరకు +91 93858 10496

తెలుగు +91 94424 93250

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)