Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 26.04.2021

దిన ధ్యానము(Telugu) 26.04.2021

ఉదయాన్నే లేచుట.

"ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను" - మార్కు 1: 35

అమెరికా దేశం యొక్క 16వ రాష్టప్రతి అయిన అబ్రాహామ్ లింకన్ ను చూచి ఒక ప్రాముఖ్యమైనలహా తీసుకొనుటకు కొంత మంది ఉన్నత అధికారులు ఆయన ఇంటికి వెళ్లారు. ఆయనకు ఉదయాన్నే లేచే ఆలవాటు ఉంది కాబట్టి ఉదయాన్నే వెళ్లారు. ఆయన గది దగ్గరకు వెళ్ళగానే ఆయన ఎవరితోనో మాట్లాడుట విని ఆయనను డిస్ట్రబ్ చేయుట మంచిది కాదు అని బయట వేచి యున్నారు. చాలా సేపు తరువాత ఆయన బయటకు రాగానే అయ్యా మేము ఉదయమునే 5 గంటలకు వచ్చాము కాని ఆ సమయంలో మీరు ఎవరితోనో మాట్లాడుతున్నారు కాబట్టి వేచి ఉన్నాము అని అన్నారు. అందుకు ఆయన వేరెవ్వరితో కాదు ప్రభువుతో మాట్లాడుతున్నాను అని అబ్రాహాము చెప్పిన వెంటనే వాళ్ళకు గొప్ప ఆశ్చర్యం వేసింది. వాళ్ళ యొక్క ఆశ్చర్యం చూసి లింకన్ చిన్న వివరణ ఇచ్చారు. మా అమ్మమ్మ ఉదయమునే లేచి ప్రభువుతోనే మొట్ట మొదటిగా మాట్లాడాలి అని నాతో చెప్పారు. కాబట్టి ఆ పాఠమును నేను ఇంకను విడిచిపెట్టకుండా ప్రభువుతో మాట్లాడుతున్నాను. ఇదే నేను చక్కగా పరిపాలించుటకు గల ప్రాముఖ్యమైన కారణం అన్నారు.

యేసుక్రీస్తు ఉదయమునే లేచి బయలుదేరి అరణ్యంలో ఒక స్థలములో ప్రార్ధించారు అంటే ఆయన జీవితంలో ఉదయమునే లేచి ప్రార్ధించే వ్యక్తిగా వున్నారు కాబట్టి తన పరిచర్యను విజయవంతంగా చేసి ముగించారు. ప్రభువైన యేసుక్రీస్తు మొట్టమొదటిగా తండ్రితో మాట్లాడేవారు. దేవుని చిత్తాన్ని గ్రహించి పని చేయుటయే ఆయనకు ప్రధానమైన కార్యముగా ఉండేది. అందుకొరకె ఆయన చీకటి ఉండగానే లేచి. ప్రార్ధించి మనకు మాదిరిగా ఉన్నారు.

ప్రియమైన వారలారా! ఉదయకాలపు ప్రార్థన మిక్కిలి విలువ గలిగినది. మనకు ఉదయమునే లేచే అలవాటు ఉందా? ఒక వేళ లేచిన ఎవరిని వెతుకుతున్నాం సెల్ ఫోన్ నా? మొట్టమొదట ఎవరితో మాట్లాడాలి అని కోరుకుంటున్నాం? ఆలోచించి చూద్దాం. ఉదయాన్నే దుప్పటిని కప్పుకొని పడుకొనుట అందరికి ఇష్టం కాని దానిని విడిచిపెట్టి లేచుటలోనే ఆ దినపు విజయము ప్రారంభం అవుతుంది. పళ్ళు తొమి, మొఖం కడుక్కొని ఆయనను కలుసుకొనుటకు సిద్ధంగా ఉండండి. ఉదయాన్నే దేవునితో మాట్లాడి అప్పుడు మిగిలిన కార్యములు చేయండి. ఉదయమునే లేద్దాం, ఉదయకాలపు ప్రార్ధనలో ఈ లోకాన్ని జయించే శక్తిని పొందుకుందాం. 
-    శ్రీమతి. శక్తి శంకర్ రాజ్

ప్రార్థన అంశం:-
మన పరిచర్యను ప్రార్థనతోను, ధన సహయంతోను సపోర్ట్ చేస్తున్న పార్టనర్స్ ను దేవుడు ప్రార్థన ఆత్మతో నింపి ప్రార్ధించే వారిగా ఉండేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)