Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 25.04.2021 (Kids Special)

దిన ధ్యానము(Telugu) 25.04.2021 (Kids Special)

సమస్తాన్ని చేయగలడు.

ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం.

“యెహోవా నా పక్షమున కార్యము సఫలముచేయును” - కీర్తనలు 138: 8

సిక్స్ కొట్టాడు సూపర్ అని కేక వేస్తూ జాలిగా ఆడుకుంటున్నాడు రాబర్ట్. క్రికెట్ ఆట అంటే అబ్బాయిలకు చాలా ఇష్టమే కదా? చరణ్ మరియు రాబర్ట్ పక్కయింటి స్నేహితులు. చరణ్ పేద కుటుంబమునకు చెందిన వాడు. సండే స్కూల్ కి క్రమంగా వెళ్తుంటాడు. వాళ్ళ నాన్న తాగేసి ఇంట్లో సమస్యలు తెచ్చి పెడుతుంటారు. చరణ్ ఇంట్లో భోజనం చేసేటప్పుడు రెండు చేతులు జోడించి ప్రార్థన చేసే తింటాడు. అమ్మ నాన్నను కూడా అలానే ప్రార్థన చేయమని చెబుతుంటాడు. మీరు కూడా తినే ముందు, పడుకునే ముందు, ఆడుకునే ముందు ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. సరేనా? చరణ్ మరిచిపోకుండా ప్రార్థిస్తాడు. వీటన్నింటిని. చూచిన నాన్న త్రాగుడు మనేసారు. ఈ విధంగా మంచి పిల్లవాడిగా పేరు పొందుకున్నాడు చరణ్. 

ఒక దినము రాబర్ట్, చరణ్ ఇద్దరు క్రికెట్ ఆడుకుంటున్నరు. అమ్మ రాబర్ట్ ను షాప్ కి వెళ్లుటకు పిలిచి పంపించారు. రాబర్ట్ షాప్ కి వెళ్ళాడు కాబట్టి చరణ్ ఇంటికి వెళ్ళిపోయాడు. రాబర్ట్ షాప్ నుండి వచ్చి చూసేసరికి వాడి యొక్క క్రికెట్ బాల్ కనిపించలేదు. నేను మరియు చరణ్ మేము ఇద్దరమే కదా ఆడుకున్నము అయితే తానే బాల్ తీసుకొని వెళ్ళిపోయి ఉంటడు అని అందరితో చెప్పాడు రాబర్ట్. ఆ రోజునుండి చరణ్ నా బాల్ దొంగతనం చేసాడు కాబట్టి నేను వాడితో మాట్లాడను అని అందరితో చెప్పాడు రాబర్ట్. చరణ్ వాళ్ళ వీధిలో ఉన్న పిల్లలందరికీ ఇదేవిదంగా చెప్పాడు రాబర్ట్. అందుకు చరణ్ కి చాలా ఏడ్పు వచ్చింది. చెయ్యని నేరం కొరకు అందరితో మాటలు కాయడం చాలా బాధ అనిపించింది. దానిని గుర్తు చేసుకుంటూ చాలా ఏడ్చాడు చరణ్. అందుకు అమ్మ చెప్పారు సహనంతో ఉండు నిజము ఒక రోజు బయట పడుతుంది. మనం యేసయ్య యొద్ద ప్రార్థన చేద్దాం అని ఓదార్చారు అమ్మ. చరణ్ మరియు అమ్మ కలిసి ప్రార్థన ప్రారంభించారు. ప్రార్థన ముగిసిన వెంటనే రాబర్ట్ పరిగెత్తుకొని వచ్చాడు. చరణ్ వెరీ సారి రా నేను నిన్ను తప్పుగా అనుకున్నాను. మా ఇంటి కుక్క పిల్ల ఆ బాల్ ను తీసికెళ్లి మా తోటలో పడేసింది. ఈ దినము తోటకు నీళ్లు వేసినప్పుడు ఈ బాల్ ను అక్కడ చూసాను అన్నాడు. ప్రభువా మీరు నా కొరకు కార్యం చేశారు అని వందనాలు చెప్పాడు చరణ్. మరల ఇద్దరు కలిసి ఆదుకోవడం ప్రారంభించాడు. 

హాలో పిల్లలు మీరు కూడా చెయ్యని నేరం కొరకు ఏడుస్తున్నారా? డోంట్ వర్రీ యేసయ్య మీ పక్కనే ఉండి మీకు సహాయం చేస్తారు. దానిని విడిచి వ్యతిరేకంగా వుంటూ గొడవలు ఆడితే సమాధానం కొల్పతుంది కదా! కాబట్టి దేని కొరకైనా ప్రార్ధించి సహనంతో ఉంటే యేసయ్య మీ కొరకు కార్యం చేస్తారు. ఒకే నా !
-    శ్రీమతి. జీవా విజయ్.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)