Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 24.04.2021

దిన ధ్యానము(Telugu) 24.04.2021

ఒకే ఒక ప్రశ్న.

"...ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలను" - అపో.కార్యములు 8:31

బీహార్ లో పోలీసుల చేత వెతకబడుతున్న నక్సల్ తీవ్రవాది ఒకరు జమ్స్ మిషనరీ సంస్థ యొక్క నాయకుడైన ఆగస్టీన్ జబ కుమార్ ను చూచుటకు ఆయుదములతో వచ్చి మీరు నడిపిస్తున్న స్కూల్లో నా కుమారుడికి చదువుటకు చోటు ఇవ్వాలి అని అడిగారు. అది సంవత్సరం మధ్య కాలం అయినందున 3 నెలలు తరువాత రండి తప్పకుండా సిటు ఇస్తాను అన్నారు. వెంటనే అతను నేను ఎవరో తెలుసా? నన్ను చూస్తానే అందరూ భయపడతారు అని బెదిరించాడు. అందుకు ఆ స్కూల్ నాయకుడు నీవు ఎవరైతే నాకెందుకు నిన్ను నీవే గొప్పవాడిగా అనుకుంటున్నావే నేను నా భార్య పిల్లలతో కలసి ధైర్యముగా మార్కెట్ కి వెళ్ళ గలను . నీవు అలా వెళ్ల గలవా? అని అడిగారు. అందుకు ఆయన కోపముతో లేచి వెళ్ళి పోయాడు. మరుసటి దినము ఆయుధములు అన్ని తెచ్చి మిషనరీ సంస్థ నాయకుడి ముందు పెట్టి అయ్యా మీరు నిన్న అడిగిన ఆ ఒక్క మాట నా నెమ్మదిని, సమాధానాన్ని పాడుచేసింది. నా భార్య, పిల్లలను అనేక నెలలు నుండి చూడలేని పరిస్థితుల్లో అడవుల్లో దాక్కుని తిరుగుతున్నాను. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి అని అడిగాడు. అందుకు అతడు యేసయ్య గురించి ఆయనకు చెప్పిన వెంటనే అతను యేసయ్యేను అంగీకరించారు. పాత పాపములన్ని అనగా మునుపు చేసిన హత్యాలన్నింటి కొరకు పోలిష్ వారి వలన శిక్ష విధించబడ్డాడు. నేను చెడ్డవాడిగా ఉన్నప్పుడు నాకు శిక్ష ఏమి లేదు మరి నేను మారుమనస్సు పొంది మంచివాడిగా మారితే శిక్ష ఎందుకు అని తాను ఆలోచించ సాగాడు. అందుకు నీతిమంతునికి భూమి మీద లెక్క సరిచేయ బడుతుంది అని ఆ మిషనరీ ఆదరించారు. 11 సంవత్సరాల జైలు శిక్ష తరువాత బయటకు వచ్చిన అతనికి ఒక ఆశ కలిగింది. హాంతకుడైన నాకు మీరు యేసయ్య గురించి చెప్పినట్లు నేను కూడా ఇతరులకు యేసయ్య గురించి చెప్పాలి అన్నదే ఆశ. బైబిల్ కాలేజ్ కి వెళ్లి చదివి ప్రస్తుతం పరిచర్య కూడా చేస్తున్నారు.

ఐతీయోపియ మంత్రి యొక్క రధముతో  కలుసుకోమని పరిశుద్ధ ఆత్మ దేవుడు ఫిలిప్ తొ చెప్పిన వెంటనే ఫిలిప్ రధమును కలుసుకొనగానే ఒకడు నాకు వివరించని యెడల నాకు ఎలా అర్థం అవుతుంది అనే మంత్రి యొక్క ప్రశ్నకు యేసుక్రీస్తు గురించి జవాబు చెప్పి బాప్తిస్మమునకు నడిపించారు. ఒక పాపి మారుమనస్సు పొందేటప్పుడు పరలోకంలో మిక్కిలి సంతోషం కలుగుతుంది. ఈ దినములలో మనము చేయవలసిన కార్యములు అనేక మైనవి ఉన్నవి. నశించి పోతున్న ఆత్మల కొరకు మనము ప్రయాస పడుతూ ఉండాలి అనేది మన బాధ్యత. ఒకే ఒక ప్రశ్న ఒక తీవ్రవాదిని మార్చివేసింది. దేవుని హస్తంలో మనము ఉండి పరిశుదాత్ముని వలన మనము నడిపించబడేటప్పుడు మనం మాట్లాడే సాదరణమైన మాటలైన ప్రజలను దేవుని యోద్దకు నడిపిస్తాయి. అప్పుడు మనము దేవుని రాజ్యాపు పనులు చేసేవారిగా కనబడతాం.
-    బ్రదర్. అనిష్ సమూయేలు

ప్రార్థన అంశం:-
మన హోమ్ పిల్లల యొక్క సంరక్షణ మరియు వాళ్ళ యొక్క భవిష్యత్తు దీవేనకరముగా ఉండేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)