Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 02.03.2024

దిన ధ్యానము(Telugu) 02.03.2024

 

అంశం: క్రీస్తుని ప్రకటించండి

 

"నేను యెహోవా నామమును ప్రకటించెదను మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి" - ద్వితియోపదేశకాండము 32:3

 

నాకు ఉన్న వ్యాధి నుండి స్వస్థపరచిన దేవుడు నా కన్నీరు తుడిచిన దేవుడు కన్నీరు కారుస్తున్నారని దర్శనాన్ని చూసిన నేను అతని కన్నీరు తుడవాలి అనుకున్నాను. ప్రజలు అతనికి ఎరుగకుండా ఉన్నారు అందుకే గద ఏడుస్తున్నారు. అతని గురించి ప్రజలకు వెళ్లి చెప్పాలి అని అనుకొని పక్కనే ఉన్న గ్రామమునకు వెళ్లి ప్రతి ఇంటికి వెళ్లి తలుపు కొట్టి యేసు ప్రభువే నిజమైన దేవుడు అతని అంగీకరించండి అని చెప్పాను. అతను నాకు స్వస్థత ఇచ్చారు. మీకును మంచి కార్యాలు చేస్తారు అని చెప్పి వచ్చాను అలా చెప్పి వచ్చినప్పుడు అక్కడ ఆ పక్క ఇంటిలో ఒక ముసలావిడ చచ్చిపోయిన పరిస్థితుల్లో మంచం మీద పడుకుని ఉన్నది. చుట్టూ ఆమె యొక్క చుట్టాలు బంధువులు ఉన్నారు. నేను ప్రతి ఇంటిలో చెప్పిన విధముగానే అక్కడ కూడా చెప్పాను. వెంటనే వారు యేసుప్రభుని ఎరిగినవారు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి కాబట్టి మీరు ప్రార్థన చేయండి అన్నారు. నేను భయపడి నాకు ప్రార్ధన రాదు అని చెప్పాను. వెంటనే వారు ఆమెను మంచముతో ఇంటి బయటకు తెచ్చి నా ముందు పెట్టారు. నా చొక్కా పట్టుకొని ప్రార్థించమని అడిగారు. వెంటనే వారు నన్ను కొడతారు అని భయంతో యేసయ్య ఈమెకు బాగా లేదంట మీరు ఏదైనా కార్యము చేసి బాగు చేయండి అని చెప్పి ప్రార్థన చేశాను. వెంటనే ఆమె యొక్క కాలు చేతులు కదలడం ప్రారంభించాయి. మంచం నుండి కింద పడిపోయింది. ఊపిరి లేకుండా పోయింది. ఒకాయన గిన్నెతో నీళ్లు తెచ్చి ఆమె ముఖము పైన చల్లారు చల్లిన వెంటనే ఆమె లెగిసి కూర్చుని మాట్లాడటం ప్రారంభించింది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. 

 

నా ప్రియమైన వారలారా! పేతురు, యోహాను ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఒక మనుష్యుడు పేతురు యోహాను ప్రకటించిన మాటలు విని నా యొద్ద వెండి బంగారం లేవు మాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాము అనే మాట పలికిన వెంటనే ఆ వ్యక్తి స్వస్థత పొందుకున్నాడనే మాట బైబిల్ గ్రంధంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా మీరు రక్షణ పొందిన వారైతే ఎంతమందికి అతని గూర్చి మీరు సువార్త ప్రకటించారు. నేను సేవ చేయడం ప్రారంభించినప్పుడు నా దగ్గర బైబిల్ లేదు ప్రార్థన నాకు రాదు. సంఘమునకు వెళ్లలేదు యేసుప్రభు ఏడుస్తున్నారు అనే దర్శనాన్ని చూశాను. అతని కన్నీరు తుడవాలని నా వలన నేను ఏమి చేయాలో దానిని చేయడము వెంటనే ప్రారంభించాను. మీరు యేసుప్రభువును అంగీకరించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎంతమందికి యేసుప్రభు గురించి చెప్పి ఉన్నారు? 

 

ఈరోజే అభిషేకము, వరాలు పొందాలి అప్పుడే దేవుని సేవ చేయడం అవుతుంది అనుకుంటున్నారా? కానీ నేను చెబుతున్నాను యేసుని మీరు అంగీకరించి అతను మీ జీవితంలో చేసిన కార్యాలను రుచి చూచి ఉంటే దానిని మిగతా వాళ్లకు చెప్పి చూడండి అప్పుడు మీరు దేవుని కొరకు బలముగా వాడబడతారు. మీ ద్వారా అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయ! 

- బ్రదర్. కే. డేవిడ్ గణేష్ గారు 

 

ప్రార్థన అంశం:-

శ్రమ దిన కూటములలో మాట్లాడుతున్న మన సేవకులను దేవుడు బలముగా వాడుకొనే లాగున ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)