Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 29.02.2024

దిన ధ్యానము(Telugu) 29.02.2024

 

అంశం: సిలువ ఇచ్చిన నమ్మకం

 

"అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును గాక; దానివలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువవేయబడియున్నాము" - గలతియులకు 6:14 

 

రష్యాలో చెర ఖైదీగా చాలా కష్టాలు అనుభవించిన ఒక క్రైస్తవ వ్యక్తి అలెగ్జాండర్. ఒక రోజుకు 12 గంటలు పనిచేయవలసిన కష్టమైన పనిని అతనికి అప్పగించారు. తక్కువ ఆహారమును, కఠినమైన వ్యాధి, చాలా బలహీనత వీటన్నిటి మధ్యలో మట్టిని తీసే పనిని అతను చేయవలసి వచ్చింది. అలసిపోయిన అతను కొంతసేపు విశ్రాంతి తీసుకుంటాను అని నిలబడినప్పుడు అలా నిలబడిన ఖైదీలను పోలీసులు చాలా గట్టిగా కొట్టేవారు. అలా కొట్టినప్పుడు అక్కడ దేవున్ని తెలుసుకొనిన ఒక అతను దగ్గరకు వచ్చి మట్టిలో సిలువ సిలువను రాసి ఎవరూ చూడక ముందు దానిని చెరిపి అక్కడ నుండి వెళ్లిపోయాడు. సిలువను చూసిన అలెగ్జాండర్ హృదయం చాలా ఆనందంతో నిండిపోయింది. అప్పటి నుండి అతను బయటికి వచ్చిన ప్రతిసారి సిలువను తలంచుకొని కష్టాలను సహిస్తూ వచ్చేవాడు. 

 

అపోస్తులుడైన పౌలు గలతీ రాసిన పత్రికలో సిలువను గూర్చి ప్రత్యేకంగా మాట్లాడతాను గాని దేని గురించి గొప్పగా మాట్లాడను అని చెబుతున్నారు. చాలా విషయాలను మాట్లాడారు ఇంకను అనేకమంది ప్రజలను వాక్యానికి నేరుగా నడిపించారు. ఇలా గొప్పగా చెప్పడానికి ఎన్నో కార్యాలు ఉన్నను సిలువను మాత్రమే గొప్పగా చెబుతాను కానీ వేరే దేని గురించి నేను గొప్పగా చెప్పను అంటున్నారు. 

 

ప్రియమైన వారలారా! ఆయన మన ద్వారా మహిమను పొందాలి అంటే మనకు వస్తున్న అన్ని కష్టాలను ఎలాంటి పరిస్థితుల్లోనూ వాటిని అంగీకరించే వారిగా ఉండాలి. ఈ శపింపబడిన భూమిలో జీవిస్తున్న మనకు వస్తున్న కష్టాలు చాలా ఉన్నాయి. అలాంటి సమయంలో మనం ఇలాంటి తలంపులతో నింపబడాలి. యేసుప్రభు శిలువలో సహించిన కష్టాలను పైగా నేను సహిస్తున్నానా? సహించబోతున్నానా? లేనే లేదు. నిశ్చయముగా మన కష్టాల ద్వారానే పరలోకానికి వెళ్ళవచ్చు కాబట్టి కష్టాలను, ఇబ్బందులను, సంతోషంగా గడుపుదాం. వాడబారని స్వాస్యం పొందుకుందాం. 

- శ్రీమతి. బేబీ కామరాజు గారు 

 

ప్రార్థన అంశం

24 గంటల చైన్ ప్రేయర్ చేసేవారు మన ఫీల్డ్ లో దొరికేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)