Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 07.12.2023

దిన ధ్యానము(Telugu) 07.12.2023

 

అంశం:- యేసు గురించి మాట్లాడుడి

 

"మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి" - అపో.కార్యములు 4:20

 

అఫీషియ అన్నది మాట్లాడే శక్తిని కోల్పోయే ఒక రోగం. గాయం వలన లేక రోగం వలన మెదడులో నుండి నాలుకకు పంపించబడవలసిన సందేశం నిలిపివేయబడినప్పుడు ఈ రోగము వస్తుంది. కానీ ఈ దినములలో ఆత్మీయ అఫీషియ వలన క్రైస్తవులు బాధపడుతున్న సందర్భము మనము చూస్తూ ఉన్నాం. వాళ్లకు యేసయ్య అంటే తెలుసు కానీ ఆయన గురించి ఎన్నడును మాట్లాడరు. వాళ్లకు దేవుని యొక్క రక్షణ ప్రణాళిక గురించి తెలుసు కానీ దాని కొరకు ఎవరితోనూ పంచుకోరు. మేము చూసిన వాటిని విన్నవాటిని ప్రకటించకుండా ఉండకూడదే అనేటటువంటి ఆది క్రైస్తవుల యొక్క పౌరుషాన్ని ఈ దినము అనేకులు వ్యక్తపరచడం లేదు. మన జ్ఞానమునకు సాక్ష్యంనకు మధ్యన బంధము తెగిపోయి ఉండటం మనం చూస్తున్నాం. దానిని మనం బాగు చేయాలి. అనేక సందర్భాలలో భయము మరియు పాపము క్రీస్తుని ప్రకటించుటకు ఆటంకముగా ఉంటున్నాయి. మన పాపములను ఒప్పుకొని పరిశుద్ధాత్మ బలము కలిగిన వారే క్రీస్తును గూర్చి ఇతరులతో మాట్లాడగలరు. 

 

సువార్తను ప్రకటించుటకు అనేకమంది క్రైస్తవులు క్రిస్మస్ కాలాన్ని మాత్రమే వాడుతున్నారు. ఈ క్రిస్మస్ కాలములో యేసుక్రీస్తు ప్రభువుని ఇతరులకు పరిచయం చేయడంలో చూపిస్తున్న వేగము అన్ని దినాలలో కనబడిన యెడల ఎంత బాగుండును. ఒకపక్క చూస్తే క్రిస్మస్ రోజుల్లోనైనా సువార్తను ప్రకటిస్తున్నారే అనే సంతోషం మనకు కలుగుతుంది. యేసును ఇతరులకు పరిచయం చేయడంలో ఎలాంటి సంకోచము ఆటంకము ఉండకూడదు. మనుషుల ముందు నన్ను ఎవరైతే ఒప్పుకుంటున్నారో వాళ్లను నా పరలోకపు తండ్రి ఎదుట ఒప్పుకుంటాను అని యేసు చెబుతున్నారు. అపోస్తుల కార్యములలో యేసుని గురించి శిష్యులు అన్ని స్థలములలో ధైర్యముతో మాట్లాడుతున్నారు అని చదువుతున్నాం. ప్రియమైన వారలారా! మనము ధైర్యముగా ఇతరులతో యేసయ్య గురించి ప్రకటిద్దాం. యేసయ్య వలె అనుదినము జీవిద్దాం. దీవించబడదాం. 

- బ్రదర్. జాకబ్ శంకర్ గారు

 

ప్రార్థన అంశం:

మన ఆమెన్ విలేజ్ టీవీ శాటిలైట్ ఛానల్ గా మార్చబడడానికి మరియు కిడ్స్ ఛానల్ ప్రారంభించబడడానికి ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)