Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 27.07.2024

దిన ధ్యానము(Telugu) 27.07.2024

 

అంశం:- గాయములు మాన్పును 

 

"వారుఎవరును లక్ష్యపెట్టని సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరుపెట్టుచున్నారు; అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను నీ గాయములను మాన్పెదను; ఇదే యెహోవా వాక్కు" - యిర్మియా 30:17

 

బౌద్ధ మతానికి చెందిన ఒక వ్యక్తి అధికమైన అనారోగ్యము చేత మరణించే పరిస్థితిలో ఉండినప్పుడు ఒక చిన్న అమ్మాయి రోజు ఆయనను దర్శించి యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అని చెబుతూ వచ్చేది. మిక్కిలి కోపిష్టి అయిన ఆయన క్రైస్తవ కుక్క బయటకు వెళ్ళు అని చెప్పి రోజు తరిమేవాడు. ఒకరోజు బైబిల్ ను తీసుకోని వచ్చింది. దానిని లాక్కొని చించిపడేస్తాడు. అయినను మరుసటి రోజు మనలా మరొక బైబిల్ తీసుకోని వచ్చింది. అప్పుడు ఆయన నువ్వు చిన్నదానివి కనుక వదిలేస్తున్నాను అని చెప్పి ఆ బైబిల్ ను లాగి టేబుల్ పైన పెట్టేసాడు. కొంత సమయం అయిన తర్వాత దాన్ని తీసి దీనిలో ఏమి ఉంది? రోజు ఈ అమ్మాయి ఎందుకు తీసుకొస్తుంది? అని చదవడం ప్రారంభించాడు. తర్వాత స్వస్థత పొంది సంపూర్ణ ఆరోగ్యముతో లేచాడు. ఆయనే దక్షిణ కొరియా దేశం ఉజ్జీవంలో దేవుడు వాడుకున్న పాల్ యాంగిచో.

 

దేవుని మాటలు మనసులో గల గాయములను మార్పును, హృదయము గాయపడిన వారిని స్వస్థపరచును వారి యొక్క గాయములను కడుతున్నారు అని కీర్తన 13:3 లో చదువుతున్నాం. మరియు ఆయన మనసులో గల గాయములను మాన్పేవాడు లేక స్వస్థపరిచేవాడు మాత్రమే కాదు మన శరీరానుసారమైన బలహీనతలను కూడా స్వస్థపరిచే దేవుడు. 30 సంవత్సరాలుగా పక్షవాతాలతో పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని యేసుక్రీస్తు నువ్వు లేచి నీ పరుపెత్తుకోని నడవమని చెప్పారు. అన్ని సంవత్సరాలు పడుకున్న వ్యక్తి వెంటనే లేచాడు. అలానే దొర్క అనే పేరు గల శిష్యురాలు మరణించినప్పుడు పేతురు యేసు నామములో ఆమెను బ్రతికించారు. ప్రభువు ఆయన మాటలు పంపించి స్వస్థపరిచారు. దేవుని యొక్క మాటలు ఎక్కువగా చదివేటప్పుడు వాటిని సొంతం చేసుకున్నప్పుడు అవి మన జీవితంలో ప్రయోజనకరంగా ఉంటుంది.

 

ప్రియమైన వారలారా! మనసులో భారముతో శరీర వ్యాధులతో కొట్టుమిట్లాడుతున్నారా? దేవుని మాట మిమ్మల్ని ఆదరిస్తుంది. దేవుని మాటలైన బైబిల్ ను ఎక్కువగా చదివి వాటితో మీ హృదయాన్ని నింపుకొనుడి. ఒకవేళ మీ హృదయము బద్దలైపోయిన పరిస్థితలో ఉండవచ్చు మనలను అరచేతుల్లో చెక్కుకున్న దేవుని చేతులకు మీ హృదయాన్ని ఇవ్వండి. క్రీస్తు తన గాయముల చేత మిమల్ని తాకనివ్వండి. నలిగిన హృదయముగలవారికి దేవుడు సమీపముగా ఉండి విరిగిన ఆత్మను రక్షించే దేవుడు (కీర్తన 34: 18). గాయపడిన హృదయము క్రీస్తు యొక్క గాయపడిన హస్తమునకు సమర్పించండి అప్పుడు మానని గాయమును కూడా స్వస్థపరచబడతాయి. మీ ద్వేషములు అన్నీ కూడా కనబడకుండా పోతాయి సమాధానముతో నింపబడతారు.

- సిస్టర్. జాయ్ గ్రేస్ గారు 

 

ప్రార్థన అంశం:-

మన క్యాంపస్ లో జరుగుతున్న స్వస్థత ఆరాధనలో అనేకమంది పాల్గొనేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)