Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 26.07.2024

దిన ధ్యానము(Telugu) 26.07.2024

 

అంశం:- పురుగు యొక్క కోరిక 

 

"తన యిల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు" - సామెతలు 27:8

 

అది ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో కరెంటు సదుపాయం లేనందువలన సాయంకాలం ఆ గ్రామం చీకటిగా ఉంటుంది. కానీ ఒక ఇంట్లో మాత్రం వెలుగు వచ్చింది అక్కడ వెలిగించిన దీపం వలన వచ్చిన వెలుగు అది. ఆ వెలుగును ఆకర్షించి వచ్చిన కొన్ని పురుగులు ఆ ఇంటిలోనికి వచ్చాయి. దాంట్లో ఒక పురుగు మరియొక పురుగును చూచి ఆహా ఎంత అందంగా ఈ యొక్క దీపం వెలుగుతుంది. అందరూ దీన్ని ఆసక్తిగా చూస్తున్నారు. కాబట్టి నేను కూడా ఈ అగ్నిలో పడితే నేను కూడా ఒక అగ్నిగా మారతాను అప్పుడు అందరూ నన్ను చూసి ఆనందిస్తారు అని అన్నది. దాని మాట వినని పురుగులు అయితే అయ్యో వద్దు యేసయ్య మనకు ఒక మంచి ప్రాముఖ్యత గల రూపాన్ని, అందాన్ని ఇచ్చి ఉన్నారు. దాన్ని నీవు విడిచిపెట్టి అగ్నిగా మారుటకు ఆశించవద్దు. నీ యొక్క ప్రత్యేకతను నీవు కోల్పోకు అన్నది. కానీ ఆ పురుగు అయితే ఎవరి మాట పట్టించుకోకుండా త్వరగా వెళ్లి ఆ మండుతున్న అగ్నిలో పడింది ఎంతో దుఃఖకరం అది కాలిపోయి బూడిద అయిపోయింది.

 

ఇలాగే జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక స్థానాన్ని ప్రభువు ఇచ్చి ఉన్నారు. మన కొరకు ఇవ్వబడిన స్థానంలో మనము ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చాలి. ఉదాహరణకు మనం బైబిల్లో చూసేటప్పుడు లూసిఫర్ అనే దూత దేవుని సన్నిధిలో ఉండి ఆయన స్తుతించుటకు స్థానం ఇవ్వబడింది కానీ ఆయన స్థానాన్ని మహిమను గ్రహించకుండా దేవుని యొక్క సింహాసనం ఆశించడం వలన పాతాళమునకు పడద్రోయబడ్డాడు. తన స్థానాన్ని కోల్పోయాడు. ఇలాగే మన జీవితంలో ప్రభువు మనల్ని పెట్టి ఉన్న స్థలమునకు ఒక ఉద్దేశం కలదు. 

 

ప్రియమైన వారలారా! దేవుడు మనలను ఉంచి ఉన్న స్థానాలకు గల మేలును, మహిమను గ్రహించకుండా ఇతరుల స్థానాల్లోకి మారాలి అని ఆలోచించుకొనకూడదు. కాబట్టి మనము మన యొక్క గర్వము నిమిత్తము లేదా కోరిక నిమిత్తము ప్రభువు మనకిచ్చిన స్థానాన్ని కోల్పోకుండా ఆయన ఉద్దేశాన్ని దేవుడు మనకిచ్చే స్థానం నుండి సంతోషంగా నెరవేరుస్తూ ఆయన మనకు నియమించబడిన మార్గంలో పరిగెడుతూ గెలుద్దాం. దేవుడు మీకు సహాయం చేయను గాక. ఆమెన్!

- సిస్టర్. ఎల్సి గారు 

 

ప్రార్థన అంశం:-

పార్ట్నర్షిప్ మిషనరీలుగా మనతో కలిసి ఉన్న సేవకుల యొక్క అవసరతలు తీర్చబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)