Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 21.07.2024

దిన ధ్యానము(Telugu) 21.07.2024

 

అంశం:- రాజు ఎవరు?

 

"కోపోద్రేకియగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము నణచివేయును" - సామెతలు 15:18

 

ఒక అందమైన అడవిలో చాలా జంతువులు నివసిస్తూ ఉన్నాయి. అవి ఎప్పుడు తమలో తమ గొడవలాడుతు ఉండేవి. ఒకరోజు కుందేలు, లేడీ, ఎలుగుబంటి మూడు కొట్లాడుకుంటున్నాయి. అడవిలో రాజు లేనందున జంతువులన్నీ కూడా ఇలా గెంతులు వేస్తున్నారు అన్నది ఎలుగుబంటి. కుందేలు అవును మనకు ఒక రాజు ఉంటే మన సమస్యలన్నీ ఆయనతో చెప్పవచ్చు అని చెప్పింది. అవును అప్పుడే మన గొడవలన్నీ కూడా ముగింపుకు వస్తాయి కానీ ఎవరు ఈ అడవికి రాజు అవుతారు అని అన్నది గంభీరమైన స్వరముతో ఏనుగు. దాన్నిబట్టి మరలా మరియొక గొడవ ప్రారంభమైనది. కుందేలు నేనే అడవికి రాజు అని అన్నది కాదు నేనే అడవికి రాజు అన్నది ఎలుగుబంటి.

 

ఏంటి పిల్లలు మీరు కూడా ఇంట్లో ఇలానే గొడవలు పడుతున్నారా? గొడవలాడుతూ ఉండటం సాతాను యొక్క పని. వీలైనంతవరకు గొడవ లేకుండా ఉండాలి. సరేనా! తర్వాత జరిగినది ఏమిటో విందామా?

 

అందరూ మరలా మరలా నేనే నేనే అని అరుస్తున్న శబ్దము విని కళ్ళు తెరుచుకుంది ఒక వృద్ధాప్యంలో ఉన్న సింహము. అది పక్క అడవిలో నుండి ఈ అడవికి వచ్చి రెండు రోజులు అయింది. ఏమిటి ఈ శబ్దము అని అడిగిన సింహాన్ని చూసి జంతువులన్నీ కూడా నిశ్శబ్దం అయిపోయాయి. ఏనుగు ఏమి చెప్పిందో తెలుసా ఈ సింహమే మనకు రాజుగా ఉంటే ఏమిటి అని చెప్పగానే సరిగా చెప్పారు అని అన్నది ఎలుగుబంటి. తర్వాత జింక, కుందేలు అన్ని ఓకే ఓకే అని చెప్పాయి. రాజు సరే రాజుగా ఉండట నాకు సమస్య కాదు మీలో ఎవరికైనా గొడవలు ఎక్కువైతే నేను వారికి మరణశిక్ష విధిస్తానని చెప్పింది ఆ సింహము. దానికి సరే అని అంగీకరించాయి జంతువులన్నీ కూడా. వాడుక చొప్పున మరుసటి రోజు కుందేలు నక్కతో ఒక స్థలం కొరకు గొడవ పడింది. ఇది నా స్థలం అన్నది కుందేలు లేదు ఇది నాది అని నక్క ఇలా గొడవపడ్డాయి. తర్వాత రాజు వద్దకు న్యాయం కొరకు వెళ్లాయి. మరల మరల గొడవ పడుతూ ఉండగా రెండింటిని ఆహారంగా తినేసింది సింహం. మిగిలిన జంతువులన్నీ కూడా మనలో ఐక్యత లేకపోతే వలన మన స్నేహితులైన జంతువులను మనం కోల్పోయామని ఏడ్చి ఇకనుండి మనం అలా ఉండకూడదు అని నిర్ణయం తీసుకున్నాయి.

 

ఏంటి పిల్లలు గొడవలు పడకుండా తగ్గించుకుని జీవించుట మనకు మంచిది. కోపముతో గొడవలు ఆడుకుంటున్న గుణాన్ని సాతాను మనకు ఇస్తున్నాడు. యేసయ్య నామములో దానిని తరిమికొట్టాలి. సరైన పిల్లలు! 

- శ్రీమతి. జీవా విజయ్ గారు.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)