Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 20.07.2024

దిన ధ్యానము(Telugu) 20.07.2024

 

అంశం:- కాపాడే దేవుడు 

 

"సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరిఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును" - 1 కోరింథీయులకు 10:13

 

మన ప్రభువు ఎప్పుడు మనతో ఉండటం మాత్రమే కాదు మనలో నివాసం చేస్తున్నారు. మనం వెళ్ళవలసిన మార్గంలో నడిపిస్తారు కూడా. ఆయనే ఒక క్షణం కూడా మనలను విడిచిపెట్టని దేవుడు. మనతోనే ఉన్నారు కానీ దేవుని పిల్లలైనా మన జీవితంలో కొన్ని శ్రమలు, శోధనలు, ప్రమాదాలు, అనారోగ్యాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. పై తరగతికి వెళ్ళుటకు విద్యార్థులకు పరీక్షలలో పెట్టి పై తరగతులకు పంపించే విధంగా పరలోకమునకు వారసులుగా ఉన్న మన జీవితంలో కొన్ని శ్రమలు ప్రమాదాలు శిక్షలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. దేవుడు కోరుకున్న ఆత్మీయ ఎదుగుదల మనం పొందుకుంటాం. గడిచిన మే 29వ తారీఖున నా భర్త ఉదయం 8 గంటల సమయంలో గ్రామమునకు పరిచర్యకు వెళ్లి ఉన్నారు. పరిచర్య ముగించుకోని ఇంటికి వస్తున్నప్పుడు ఎండ ఎక్కువ అవ్వడం వల్ల డిహైడ్రేషన్, లో షుగర్ అన్నీ కలిసి రావడం వలన తన ఆలోచనలన్నీ కూడా మర్చిపోయారు. టూ వీలర్ లో వెళ్లిన ఆయన మా ఇంటికి దారి తెలియక మార్గాన్ని మర్చిపోయి వేరే ఎక్కడికో వెళ్లి గోతిలో పడిపోయారు. శబ్దాన్ని విని వచ్చినవారు దేవదూతలు వలె సహాయం చేయుటకు దేవుడు కృప చూపించారు. ఒక తమ్ముడు నన్ను ప్రమాదం జరిగిన ప్రదేశమునకు తీసుకుని వెళ్ళాడు. ఆటో తమ్ముడు యొక్క ప్రేమ కలిగిన సహాయము వల్ల హాస్పిటల్లో చేర్చబడ్డారు. దేవుని కృప చేత పెద్ద దెబ్బలు గాని ఎలాంటి ఎముకలు విరిగిపోకుండా చిన్న గాయాలతో దేవుడు తప్పించారు.

 

అవును యెహోవా కృప కలిగిన వాడు ఆయన వాత్సల్యం దయతో నిలిచి ఉన్నది. కనుక మనం నిర్మూలము కాని వారుగా ఉంటున్నాం. (విలాపు వాక్యములు3:22) యదార్థ గల దేవుడు మనము ఎక్కువ శోధింప బడకుండా తప్పించుకునే మార్గాన్ని మనకు దయచేస్తున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 5:3 ప్రకారము శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షకు, పరీక్ష నిరీక్షణ కలుగజేయునని ఎరుగుడి అని పౌలు యొక్క మాటలను యదార్ధముగా చేసుకుని ఇక్కడ పాఠం నేర్పిస్తున్నారు.

 

నా ప్రియమైన వారలారా అన్ని పరీక్షలలో తప్పించుటకు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువు ప్రతి ఒక్కరినీ ప్రత్యేకముగా సేవకులందరినీ కూడా సంరక్షించి నడిపించును గాక. ఆమెన్! 

- ఎస్. ఎస్. సరోజా మోహన్ దాస్ గారు 

 

ప్రార్ధన అంశం:-

మన పత్రిక పరిచర్యలో పత్రికలు రాస్తున్న వారు దేవుని ఆత్మతో నింపబడి రాసేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)