దిన ధ్యానము(Telugu) 18.05.2025 (Kids Special)
దిన ధ్యానము(Telugu) 18.05.2025 (Kids Special)
ప్రత్యేకంగా చిన్న పిల్లల కొరకు
అంశం: అడుగుడి మీకు ఇవ్వబడును
“అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును.” - మత్తయి 7:7
పిల్లలు మాట్లాడుకోవడం, నవ్వడం మరియు ఆనందంగా ఆడుకోవడం వినిపిస్తుంది. ఈ శబ్దం స్కూల్ ప్లేగ్రౌండ్ నుండి వస్తోందని మీరు అనుకోవచ్చు, సరియైనదా?
అనాథ పిల్లలు నివసించే తెరాస హోం నుంచి వస్తున్న శబ్దం ఇది. ఈ అనాథాశ్రయాన్ని డేవిడ్ అనే అంకుల్ నడుపుతున్నాడు మరియు ఇక్కడ పిల్లలు పాటలు మరియు కథలు వినడానికి ఇష్టపడతారు. ఆ అంకుల్ ఈ పిల్లలను ప్రార్థనలో నడిపించాడు. వారి అవసరాలకు డబ్బు ఏదీ విదేశాల నుంచి రాలేదు. ఈ అనాథాశ్రయం పూర్తిగా విశ్వాసంతో నడిచేది. మీకు ఏదైనా అవసరమైతే, మీరు మొదట మీ తల్లిదండ్రులను అదిగుతారు కానీ ఇక్కడ పిల్లలకు ఏదైనా అవసరమైతే, వారు మొదట యేసును అడుగుతారు, ఆపై వారు ఆ అంకుల్ ను అడుగుతారు. అలా పెంచారు.
ఓ రోజు అనాథ శరణాలయంలో రాత్రి భోజనం చేస్తుండగా వంటగ్యాస్ అయిపోయింది. ఆ సమయంలో డేవిడ్ అంకుల్ అక్కడ లేరు. ఎన్ని ఫోన్లు చేసినా అప్పట్లో గ్యాస్ నింపుకునే పరిస్థితి లేదు. అప్పటికే రాత్రి 8:45 గంటలైంది, పిల్లలు చదువుకునే సమయం ముగించుకుని భోజనానికి వచ్చారు. కానీ అక్కడ ఆహారం సిద్ధంగా లేదు. ఈ చిన్నారులు తమ ఆకలిని భరించలేక ఏడవడం ప్రారంభించారు. ఆ సమయంలో, సంరక్షకులలో ఒకరు, "అందరం మోకాళ్లపై నిలబడి ప్రార్థన చేద్దాం. దేవుడు ఏలీయాను కాకుల ద్వారా ఎలా పోషించాడో, యేసు కూడా మనకు ఆహారం ఇస్తాడు" అని చెప్పాడు. కాబట్టి, పిల్లలందరూ హృదయపూర్వకంగా ప్రార్థించారు. వాళ్ళు పూర్తి చేసి తలుపు తీసినప్పుడు, వారికి ఆశ్చర్యంగా, ఒక తెలియని అంకుల్ పెద్ద బుట్టతో గుమ్మం వద్ద నిలబడి ఉన్నాడు. అతను కేర్‌టేకర్‌కి ఒక పార్శిల్‌ని అందజేసి, "ఇక్కడ ఆహారం ఉంది. దయచేసి తినండి" అని చెప్పి వెళ్ళిపోయాడు. పార్శిల్ తెరిచి చూడగా లోపల పరోటాలు, ఇడ్లీలు ఉన్నాయి. పిల్లలు యొక్క ఆనందానికి అవధులు లేవు . "యేసయ్య మన ప్రార్థనకు వెంటనే జవాబిచ్చాడు!" అని వారు చెప్పారు మరియు దేవునికి కృతజ్ఞతలు చెప్పి సంతోషంగా తినడం ప్రారంభించారు. యేసు యొక్క విస్తారమైన దయకు సూచనగా ఆహారం కూడా మిగిలి ఉంది
ఇది ఎంత పెద్ద అద్భుతమో చూసారా? ఇంట్లో కూడా సరిపడా ఆహారం లేదని లేదా మీకు మంచి బట్టలు లేవని మీరు ఆందోళన చెందుతున్నారా? ఆ పిల్లలలాగే, యేసును అడగండి - ఆయన మీకు కూడా దయచేస్తారు!
- శ్రీమతి. జీవా విజయ్ గారు
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250