దిన ధ్యానము(Telugu) 24.12.2024
దిన ధ్యానము(Telugu) 24.12.2024
అంశం: ఆత్మను రక్షించే దేవుడు
"అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను" - ఆదికాండము 6:8
ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు, అందమైన లోకాన్ని ఏర్పరిచి, అందులో ఒక కుటుంబాన్ని స్థాపించాడు. అయితే దేవుడు మంచిదని చూచిన ప్రతిదీ అపవిత్రమైపోయింది. దేవుడు భూమిపై మానవులను సృష్టించినందుకు చింతించెను, అది ఆయన హృదయానికి బాధ కలిగించింది (ఆదికాండము 6:6). దేవుని హృదయానికి ఆదరణ కలిగించే వారెవరు లేకపోయారు. అయితే దేవుని చూపులో ఒక వ్యక్తి కనిపించాడు. అతనెవరో తెలుసా? నోవహు.
"నోవహు" అనే పేరు "ఇతడు మమ్మల్ని ఆదరణ కలిగించును" అని అర్థం (ఆదికాండము 5:29). దేవుని కను దృష్టి లోకమంతా సంచరించినప్పుడు, నోవహు మాత్రమే ఆయనకు యోగ్యుడుగా, ఆయన హృదయానికి ఆదరణ కలిగించేవాడిగా కనిపించాడు. భూమి అంతా నాశనమైపోతున్న సమయంలో, నోవహును మరియు అతని కుటుంబాన్ని దేవుడు తన కృపతో నౌకలో రక్షించాడు. దేవుని హృదయాన్ని నోవహు ఎలా సంతోషపెట్టగలిగాడు తెలుసుకుందాం.
ఆయన నీతిమంతుడాయెను (ఆదికాండము 6:9):
పాపంతో నిండిన ప్రపంచానికి నోవహు లోనవ్వలేదు. తన కాలంలోని ప్రజలందరిలో నోవహు నీతిమంతుడిగాను, నిర్దోషిగాను జీవించాడు. మీ చుట్టూ ఉన్న పరిసరాలు ఎలా ఉన్నా, మీ ఆలోచనలు, కార్యాలు, ప్రవర్తనలు దేవునికి ప్రీతిపాత్రంగా ఉంటే, దేవుని చూపు మీపై పడుతుంది, మీకూ ఆయన కృప లభిస్తుంది.
ఆయన దేవునితో నడిచెను (ఆదికాండము 6:9):
దేవునితో నడవడం అనేది ఆయనతో సహవాసంలో ఉండటం. దేవునితో నడిచేవారు నిరంతరం ఆయనతో సంభాషిస్తారు. మన జీవనంలో దేవునితో నడిచే అనుభవం ఉందా? ఈ విషయాన్ని ఆలోచించుకుందాం.
ప్రియమైన వారలారా, నోవహు నీతిమంతుడు కావడంతో, అతని మొత్తం కుటుంబం రక్షించబడింది. నోవహు కాలంలో జరిగినట్లే, నేడు మనం నివసిస్తున్న ప్రపంచంలో పాపం మరియు దుర్మార్గం పెరుగుతూ పోతోంది. మానవుని పాపం, దుర్మార్గం దేవుని హృదయాన్ని బాధిస్తోందనడంలో సందేహం లేదు. ఈ పరిస్థితుల మధ్య, నోవహులా మీ జీవితం దేవున్ని సంతోష పరిచేదిగా ఉండాలి. ఆమెన్.
- శ్రీమతి. జెబకని శేఖర్ గారు
ప్రార్థనా అంశం:
మన ప్రాంగణంలో నిర్వహించిన క్రిస్మస్ సువార్త సమావేశానికి హాజరైన ప్రజల హృదయాలను దేవుడు దర్శించేలాగున ప్రార్థించండి.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250