దిన ధ్యానము(Telugu) 04.12.2024
దిన ధ్యానము(Telugu) 04.12.2024
అంశం: ఎవరైనా కావాలి
"వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు"? - రోమీయులకు 10:14
పుట్టుకతో చూపు లేని ఒక మనిషి రహదారి పక్కన కూర్చొని భిక్షము అడుగుతున్నాడు. యేసు ఆ మార్గంలో వస్తున్నారని విన్న వెంటనే, "దావీదు కుమారుడా, నా మీద కరుణ చూపించు" అంటూ గొంతెత్తి అరిచాడు. యేసు ఆగి అతని వద్దకు వచ్చి, "నువ్వు ఏమి చేయమని కోరుతున్నావు?" అని అడిగాడు. అతను, "నా చూపు తెరవాలి" అని అన్నాడు. అప్పుడు యేసు, "నీ విశ్వాసం నిన్ను రక్షించును" అని చెప్పి, వెంటనే అతనికి చూపు ఇచ్చాడు.
మరియు అతను ఎలా విశ్వాసం చూపగలిగాడు? ఎవరో అతనికి యేసు గురించి చెప్పారు. అప్పటి నుంచి అతని హృదయంలో విశ్వాసం కలిగింది. ఒకసారి యేసుని కలుసుకోవాలని అతనికి తపన కలిగింది. అందుకే, యేసు తన దారిలోని వస్తున్న ఆ అవకాశాన్ని మిస్ అవకుండా, గట్టిగా అరచి, ఒక అద్భుతాన్ని పొందాడు.
ఇదే విధంగా, విలేజ్ మిషనరీ మూవ్‌మెంట్ స్థాపకుడు బ్రదర్ డేవిడ్ గణేశన్ కూడా, తన గ్రామమైన పుల్లలకోట్టాయిలో ఎవరో యేసు గురించి చెప్పడం విని, యేసు తన గుండె సమస్యను స్వస్థపరుస్తారని నమ్మాడు. అతను యేసుని పిలిచాడు. స్వస్థత పొందిన తరువాత, గ్రామాలకు వెళ్ళి యేసు గురించి చెప్పడం ప్రారంభించాడు. ఈరోజు, 7000 మంది మిషనరీలు మరియు లక్ష గ్రామాలు యేసునికి చెందాలని ఒక దృష్టితో పని చేస్తున్నారు.
ఎవరో ఒకరు నీకు యేసు గురించి చెప్పారు కాబట్టి నువ్వు రక్షించబడ్డావు. నీకు స్వస్థత లభించింది. కాబట్టి, నువ్వు ఆ "ఎవరో" కావాలి. యేసు పేరు తెలియని వారితో పంచుకో. నీ ద్వారా యేసును తెలుసుకొని అనేక మంది రక్షించబడాలి.
- బ్రదర్ వేణు విలియమ్స్ గారు
ప్రార్థనా అంశం:
ప్రతి రాష్ట్రంలో 10 ఎకరాల భూమి కొనుగోలు చేయడానికి మరియు మా శిబిరంలో జరుగుతున్న పనులు విజయవంతంగా కొనసాగించడానికి ప్రార్థించండి.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250