Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 20.04.2021

దిన ధ్యానము(Telugu) 20.04.2021

నీవు ఎవరికొరకు జీవిస్తున్నావు?

"మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము" - 2కోరింథీయులకు 4: 17

రక్షణ దళం సంఘ వ్యవస్థాపకుడు అయిన సహోదరుడు విలియం బూత్ రాసిన ఒక సందేశంలో తాను చూసిన ఒక కల గురించి ఇలా రాస్తున్నారు. ఆ కలలో తాను ఒక సాధారణ విశ్వాసిగా కనిపించారు. ఆయన మరణించి పరలోకంలో అడుగుపెడుతున్న దృశ్యం అతనికి కనబడింది. అక్కడ పరలోకంలో జీవగ్రంధంను విలియం బూత్ చూసారు. అందులో క్షమించ బడ్డాడు అనే పదము మాత్రము పెద్దగా వ్రాయబడి ఉండుట చూసాడు. మొదట్లో ఆయన క్షమించబడి పరలోకంలో ఉండుట చూచి సంతోషించారు. 

కాని పరలోకంలో మరియొక విశ్వాసుల గుంపును కూడా చూసారు వారు చెప్పలేనంత గొప్ప మహిమ గల వారిగా ఉన్నారు. ఎవరు వీళ్ళు ఈ భూలోకంలో దేవుని కొరకు తమ ప్రాణములను అర్పించిన వారు. వీళ్ళ యొక్క చెప్పలేనంత మహిమ తేజస్సును చూసి బూత్ హృదయంలో అసూయ ఏర్పడింది. యేసుక్రీస్తు ఆయన దగ్గరకు వచ్చి నీవు చూస్తున్న, చెప్పలేనంత మహిమతో ప్రకాశిస్తున్న ఈ ప్రజలలో నీవు కలిసి పోలేవు, వాళ్ళతో ఎన్నడూ కలవలేవు ఎందుకో తెలుసా? నీవు ఇలాంటి మహిమగల ప్రజల వలె జీవించకుండా ఈ భూలోకంలో నీ కొరకే నీ జీవితమును జీవించావు అని దుఃఖంతో చెప్పారు. విలియం బూత్ వెంటనే మెలుకువ వచ్చి కళ్ళు తెరిచారు. అప్పుడు తాను ప్రాణముతో ఉండుటయు తాను చూసినది కల అని గ్రహించారు. ఆ దినము నుండి మిగిలిన తన జీవితము సమస్తాన్ని కూడా నిస్వార్థంగా ప్రభువు కొరకు జీవించాలరని నిర్ణయం తీసుకున్నారు. 

మనలో అనేకులు క్రీస్తును అంగీకరించి యున్నాము రక్షింపబడి యున్నాము, అభిషేకించబడి యున్నాము, చర్చికి వెళ్తున్నాము, కానుక అర్పిస్తున్నాము కనుక పరలోకమునకు వెళ్ళిపోతున్నాము అని నిశ్చయత కలదు. వాటికి పైగా ఒక ప్రాముఖ్యమైన క్రైస్తవ సత్యం కలదు. అదేమిటి అంటే ఒకడు నన్ను వెంబడింప గోరిన యెడల తన్నతాను ఆపేక్షించు కొని తన సిలువను ఎత్తుకొని అనుదినం నన్ను వెంబడింప వలెను అన్నదే. క్రీస్తు నాలోనే జీవిస్తున్నారు అని చెప్పి ఇంకను స్వార్థంతో మనలను ఆపేక్షించ కుండా కనబడిన యెడల దానివలన ప్రయోజనము లేదు. 

ప్రియమైన వారలారా! మన హృదయంలో ఇహలోక ఆశీర్వదములు పైగా క్రీస్తు ఆలోచనలు కలిగి యున్నామా? మనకొరకే మనము జీవించినది చాలు. నిస్వార్థంగా క్రీస్తు యొక్క ఆలోచనలతో జీవిద్దాం. ఆ చెప్పలేనంత మహిమ గుంపుతో మనము కూడా కనబడుటకు ప్రయాసపడదాం. ఒకే ఒక  దాన్ని మనకోరకే జీవించి, మన కొరకే సంపాదన చేసి, దాన్ని మనమే అనుభవించి ఇతరుల యొక్క ఘనతను, పొగడ్తలు పొందుకొని జీవిస్తున్న జీవితాన్ని విడిచి త్యాగముతో క్రీస్తు యొక్క ఆలోచనలతో నిండిన జీవితాన్ని జీవించి ముగిద్దాం. ఆమెన్, హల్లెలయా!
-    శ్రీమతి. శశికళ పరమశివం

ప్రార్థన అంశం:-
తమిళ్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడం, మలయాళం, ఒడియా, పంజాబీ అనే 8 భాషల్లో వస్తున్న మన దిన ధ్యాన సందేశం ద్వారా అనేకులు బలపరచబడేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)