దిన ధ్యానము(Telugu) 19.04.2021
దిన ధ్యానము(Telugu) 19.04.2021
మ్యాజిక్ షో.
"నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెదకు చున్నావా? వెదకవద్దు" - యిర్మియా 45: 5
ఒక మారు ఒక గ్రామంలో చిన్న పిల్లల పరిచర్య చేస్తున్నాం. నిజాయితీగా ఉండు అనే అంశం క్రింద పాటలు, కంటత వాక్యములు, ఆటలు అన్ని నేర్పిస్తున్నాం. చిన్నారులు చక్కగా నేర్చుకున్నారు. తరువాత మ్యాజిక్ ఒకటి చేసి చూపించాము. దానిని చూసిన పిల్లలు అందరూ చప్పట్లు కొట్టారు దాంతో ఆ చిన్న పిల్లల పరిచర్య ముగిసింది. పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు ఒంటరిగా ఒక బాలుడు వచ్చి అన్న ఆ మ్యాజిక్ ఎలా చేశారు అని అడిగాడు దానిని మేము అది నీకు అర్ధం కాదు అని చెప్పినప్పుడు వాడు మీరు అబద్ధం చెప్పకూడదు నిజాయితీగా జీవించాలి ఇతరులను మోసం చేయకూడదు అని మీరు ఇప్పుడే కదా చెప్పారు మరి మమ్మల్ని మోసం చేస్తున్నారే అన్నారు. ఆ బాబు చెప్పిన మాట మాకు చెంప మీద కొట్టినట్లుగా అయింది. ఆ దినము మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. మనల్ని గొప్ప వారిగా చూపించు కోవడానికి లేదా పిల్లలను ఆకర్షించేందుకు ఈ మ్యాజిజ్ వాడుతున్నాం కాని జాగ్రత్తగా వాడాలి. అవసరమైన చోట, అవసరమైనప్పుడే వాడాలి. సేవకులైన మనము మ్యాజిక్ చేస్తున్న వారిగా మరిపోకూడాదు. మన సాక్ష్యం ప్రాముఖ్యం అని నిర్ణయించుకున్నాం.
అపోస్తులకార్యం 8:9 లో సీమోను అనే వ్యక్తి ప్రజలను మంత్రముల ద్వారా మాయచేసేవాడిగా ఉన్నాడు. మాయ గాడైన సీమోను ఫిలిప్ చేసిన అద్భుతములు తాను కూడా చేయాలి అనుకున్నాడు. పేతురు చేత పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడుట చూసి ఆయన తన డబ్బును తీసుకొని వచ్చి ఆ వరములు కొనుటకు ప్రయత్నించాడు అని చూస్తున్నాం. తరువాత పేతురు అతనిని కఠినంగా హెచ్చరించారు అని చూస్తున్నాం.
అవును ప్రియమైన వారలారా! తనను గొప్ప వాడిగా చూపించాలి అని ఆలోచించి పడిపోయిన వ్యక్తుల గురించి మనకు అనేక ఉదాహరణలు తెలుసు. మన తలంపులలో ఇతరుల ఎదుట గొప్పగా ఉండాలి అని మనల్ని మనము హెచ్చించుకోకుండా ఇతరుల యొక్క మేలు కొరకు మనము ప్రయాసపడాలి. దేవుని దృష్టిలో ఇది ఎలా ఉంటుంది మనల్ని మనమే ఆలోచించి చూద్దాం. మన జీవితంలో దేవుడు మాత్రమే ఘనపరచబడాలి. పరిశుద్ధత మాత్రమే మన జీవిత గురిగ ఉండాలి.
- బ్రదర్. వై. అనిష్ రాజా
ప్రార్థన అంశం:-
ప్రతి దినము ధ్యాన సందేశాన్ని వాట్సాప్, ఫేస్ బుక్, ఈమెయిల్, ట్విట్టర్ ద్వారా చదువుతున్న ప్రజలు ప్రయోజనం పొందుకొని దీవించబడేటట్లు ప్రార్దిద్ధాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250