దిన ధ్యానము(Telugu) 18.04.2021 (kids Special)
దిన ధ్యానము(Telugu) 18.04.2021 (kids Special)
ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం
లోబడిన చేప
"...ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడు దురు.” - రో్మీయులకు 5:19
లోబడిన చేప.
హాలో పిల్లలు ఈరోజు బైబిల్లో జరిగిన నిజ సంఘటనను విన బోతున్నాం. ఒక పెద్ద చేప ఎలాగు దేవునికి లోబడింది అనే కథను విందమా.
నీనెవె అనే గొప్ప పట్టణం ఉంది. అక్కడ జీవిస్తున్న ప్రజలు మిక్కిలి పాపం చేసున్న వాళ్లుగా ఉండేవారు. తరుచుగా చేస్తున్న పాపము దేవునికి కోపాన్ని తీసుకొస్తుంది కదా మీరుకుడా పేరెంట్స్ కి నచ్చని కార్యములు చేస్తూ ఉండేటప్పుడు మిమ్మల్ని కండిస్తుంటారు, లోబడకపోతే శిక్షితుంటారు. అలాగే దేవుడు మిమ్మల్ని పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను అని నీనివే పట్టణస్తులకు చెప్పడానికి యోనాని దేవుడు పంపించారు. కాని యోనా అయితే నెనివే కు వెళ్లకుండా తర్షీషునకు వెళ్ళాడు. అప్పుడు ఇప్పుడున్న కారు, బైకు, విమానం లాంటివి ఏమి లేవు. మరి ఎలా వెళ్లి వుంటారు అవును ఓడలో వెళ్లారు కరెక్టుగా చెప్పారు. తరువాత ఏమిజరిగిందో తెలుసా?
సముద్రంలో అలలు ఎక్కువగా లేచి గాలికి సముద్రమంత అల్లకల్లోలం అయింది. అది పెద్ద తుఫానుగా మారింది. ఓడలో ప్రయాణం చేస్తున్న అందరు బయపడిపోయి వాళ్ళ వాళ్ళ దేవున్ని వేడుకోవడం ప్రారంభించారు. ఏ ప్రయోజనము లేదు వెంటనే ఓడలో గల సరుకులు అన్ని కూడా సముద్రంలో విసిరివేసారు. ప్రాణం ఉంటే చాలు అనుకున్నారు. దేని వలన మనకు ఇలాంటి ప్రమాదం సంభవిస్తుంది అని మాట్లాడుకుని ఒక ముగింపునకు వచ్చి మన అందరి పేర్లు మీద చీట్లు వేసి చూద్దాం అని చీట్లు వేయగా యోనా పేరుమీద చిటి వచ్చింది. యోనా దేవునికి లోబడకుండా వచ్చిన దానిని తాను ఎవరో అనే దాన్ని వాళ్లకు చెప్పాడు. అది మాత్రమే కాదు నన్ను సముద్రంలో పడేయండి వెంటనే సమస్తము మాములుగా అయిపోతుంది అని అన్నాడు యోనా. ఆ మాట విన్న వాళ్ళందరూ కూడా చాలా దుఃఖ పడ్డారు. ఓడ పగిలిపోతున్నతంగా సముద్రంలో గాలి ఎక్కువ అవ్వడంతో వేరే దారి లేక యోనాను ఎత్తి సముద్రంలో పడవేశారు. ఎంత ఆశ్చర్యం వెంటనే సముద్రం నిశ్శబ్దంగా అయింది. యోనాను మింగి వేయుటకు గొప్ప చేపను దేవుడు ఆజ్ఞపించారు. ఆ చేప కూడా దేవుని మాటకు లోబడింది యోనాను కరవకుండా మింగివేసింది. మూడు దినముల తరువాత దేవుడు ఆ చేపకు ఆజ్ఞపించారు వెంటనే ఆ చేప దేవుని మాటకు లోబడి సముద్రపు ఒడ్డున కక్కివేసింది. దేవుడు చెప్పినట్లుగా ఆ చేప చేసింది.
ప్రియమైన తమ్ముడు, చెల్లి ఒక సాదారణమైన చేప కూడా దేవుని మాటకు లోబడుతుంది చూసావా? మూడు దినములు ఏమి తినకుండా అంత దూరం ప్రయాణం చేయడంలో ఎంత కష్టపడి ఉంటుంది ఆ చేప. అయినప్పటికీ దేవునికిలోబడి ఆయన చిత్తాన్ని నెరవేర్చిన చేప వలె నీవు లోబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు దేవుడు నిన్ను పిలుస్తున్నారు. సమర్పించుకుంటావా? లోబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చుతావా?
- శ్రీమతి. జీవా విజయ్
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250