దిన ధ్యానము(Telugu) 16.04.2021
దిన ధ్యానము(Telugu) 16.04.2021
ప్రార్ధన యొక్క మహోన్నతం:-
"యెడతెగక ప్రార్థనచేయుడి" - 1థెస్సలొనికయులకు 5: 17
జార్జ్ విలియమ్స్ పని నిమిత్తము లండన్ పట్టణమునకు వెళ్ళారు. అక్కడ లడ్గేట్ హిల్ అనే స్థలం లో బట్టల దుకాణం లో పని చేస్తూ వచ్చిన 140మంది పని వాళ్ళ లో ఒకరిగా ఉండేవారు.
జార్జ్ విలియమ్స్ ఒకరినొకరు కలిసి ప్రత్యేకమైన వ్యక్తి గా ఉండే వాడు అదే అతని జీవితమునకు ద్యేయంగా ఉండేది. ఆయన జీవిత చరిత్రను వ్రాసిన జాన్ బోలక్ 20వ శతాబ్దంలో నివసిస్తున్న ఒక యవ్వనస్తుడు లండన్ పట్టణంలో ఎన్నో సంతోషాలను భోగాలను అనుభవించి ఉండవచ్చు. ఆయన కొరకు ప్రార్ధించవలసినది అనేక కార్యాలు ఉన్నప్పటికి ఆయన అయితే తనతో ,పని చేస్తున్న 139 మంది కొరకు ఎక్కువగా ప్రార్ధించే వారు. అందరి పేర్లు తన డైరీ లో వ్రాసుకుని వారి యొక్క రక్షణ కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూవచ్చారు. ఆ దుకాణంలో చేరినప్పుడు ఈయన మాత్రమే క్రైస్తవుడు 2 సంవత్సరాల తరువాత 20మంది ని క్రీస్తు లోనికి నడిపించారు.
విలియమ్స్ 12మంది తో కలిసి ప్రార్ధించి ఒక సంఘాన్ని స్థాపించారు. ఆయన అనేగమైన బట్టల దుకాణమునకు లెటర్ వ్రాసి అంధరిని పిలిపించారు. 150మంది యౌవనస్తులు మొదటి దిన కూడికకి హాజరయ్యారు. ఆ సంఘమునకు YMCA క్రైస్తవ యవ్వన సంఘము అని పేరు పెట్టారు. అది పెరిగి మిగిలిన ప్రాంతాలకు,దేశాలకు విస్తరించింది. ఒక ఒంటరి యౌవనస్తుని యొక్క జీవితం దేవునితో నడుస్తున్న,జీవిస్తూ ఉండటం వలన దేశమంతా ప్రభంచామంతా కూడా ఉజ్జీవం రావడానికి కారణం అయ్యింది.
బైబిల్లో కూడా ఏలీయా ప్రవక్త ఒంటరిగా గొప్ప అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలను చేశారు. ఆయన తరచుగా చెప్తున్న మాట సైన్యములకు అధిపతియగు యెహోవా ఆయన ప్రాణముతో చెబుతున్నాను అని అంటారు. ఇలాగు చెప్పుటకు ఆయనకు ఎంత ధైర్యం వచ్చింది! దేవునితో మంచి సంబంధం కలిగి ప్రార్ధించే వ్యక్తిగా కనబడ్డారు. దీవి ఫలితం వెంబడించిన గొప్ప జనం యెదుట ప్రభువే నిజమైన దేవుడు అని చెప్పగలిగారు.
క్రీస్తు నందు ప్రియమైన వారలారా! ప్రార్డన మన ఊపిరి వంటిది ఊపిరి ఆగిపోతే మన జీవితం పోతుంది. మన జీవితానికి ప్రార్ధన అవసరమే నన్ను దీవించండి, నా వ్యాపారము దీవించండి, అని కాకా ఈ మనిషిని కలవడానికి సహాయం చేస్తున్న దేవునికి వందనాలు అని ఇతరుల కొరకు ప్రార్ధన చేసేవారంగా మనం ఉండాలి. మన యొక్క ప్రార్ధన ఎప్పుడు ఇతరుల కొరకు ఉండిన యెడల ఆ ప్రార్ధన గొప్ప ఉజ్జీవాన్ని తీసుకువచ్చేదిగా మారిపోతుంది. హల్లెలూయ! శ్రీమతి. జీవా విజయ్.
ప్రార్థన అంశం:-
7000మిషనరీలు, 7000మిషనరీలని సపోర్ట్ చేస్తున్న పాట్నర్స్, 7000ఇంటి ప్రార్ధనా గుంపులు ప్రారంభించబడేటట్లు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250