Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 15.04.2021

దిన ధ్యానము(Telugu) 15.04.2021

నిజాయితీ ఉత్సహము.

"దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి" - 1పేతురు 5: 6

బైబిల్ కళాశాలలో చదివి బైబిల్  జ్ఞానం ఎక్కువ నేర్చుకొని ఉన్న ఒకరు తన కళాశాల చదువును పూర్తి చేసుకొని ఒక సంఘంలో పరిచర్యకు వెళ్లారు. ఆయన వేదిక మీద ఆరాధన నడిపించుటకు మరియు ప్రసంగం చేయుటకు ఎదురు చూస్తున్నారు. కాని ఆయనకు ఇవ్వబడిన పరిచర్య అందరు భోజనము చేసిన తరువాత పాత్రలు కడిగే పరిచర్య. దానిని విని దిగ్భ్రాంతికి గురైన ఆయన నేను బైబిల్ కాలేజీలో చదివి నేను బైబిల్  జ్ఞానం పొందుకున్న వ్యక్తిని కాని ఇలా పాత్రలు కడిగే పనియా అని మనసులో సణుగు కున్నాడు. కాని పరిశుద్ధాత్ముడు ఇలాంటి గర్వమైన పని మంచిది కాదు అని ఆయన హృదయంలో తలంపు కలుగ జేసిన వెంటనే ఆయన ఆ దినము మొదలుకొని ఆ పాత్రలు కడిగే పనిని ఉత్సాహంతో చేశారు. ఇలాగు అనేక నెలలు గడిచాయి. ఆ సంఘంలో కూడికలు ఏర్పాటు చేయబడినవి. వాక్య పరిచర్య చేయడానికి పిలువబడిన సేవకుడు చివరి సమయంలో రాలేను అని కబురు పంపించారు. అందువలన ఆ చివరి గడియాలో ప్రసంగించే అవకాశం ఈయనకు ఇవ్వబడింది. దేవుడు అతనిని బలముగా వాడుకున్నారు. తరువాత ఆ సంఘ పెద్దలు ఆయనను అనేక చోట్లకు దేవుని సందేశము ఇవ్వమని పంపించారు. 

రాజైన దావీదు దినములలో తన కుమారుడైన   అబ్షాలోమునకు బయపడి దావీదు పారిపోతుండగా ఇత్తయి అనే మనుష్యుడు మరియు ఆయన యొక్క జనంగాము దావీదునకు తోడుగా ఉండే వారు. దావీదు వాడిని చూసి నీవు నిన్నే గదా వచ్చావు నీవు వెళ్లి మరల రాజుతో ఉండు అని చెప్పారు. కాని ఇత్తయి అయితే నేను చనిపోయినను, బ్రతికినను నీతోనే ఉంటాను అని చెప్పి ఎలాంటి కష్టమునైన ఎదుర్కొనుటకు సిద్ధమయ్యాడు. తరువాత మూడు గుంపులలో ఒక గుంపు సైన్యమునకు ఇత్తయిని   నాయకుడిగా చేశారు దావీదు. 

ప్రియమైన వారలారా! మనము కూడా నూతనంగా ఒక స్థలంలో పనికొరుకు వెళ్ళియుండవచ్చు , మనకు ఇవ్వబడిన బాద్యతలు, పదవులు కొత్తవై ఉండవచ్చు. ఆ పనిని చాలా కష్టంగా లేదా మన అర్హతకు తగినది కాకపోవచ్చు కాని ఇత్తయి వలె మనము కూడా దేవుని సేవకుని వలె నిజాయితీతోను, ఉత్సహంతోను, ఇవ్వబడిన పనిని నెరవేర్చబడినప్పుడు దేవుడు మనలను హెచ్చిస్తారు. ఆమెన్!
-    బ్రదర్. ఎస్. మనోజ్ కుమార్

ప్రార్థన అంశం:-
12 మిషనరీలు ప్రతి రాష్టం నుండి వచ్చుటకు ఆలాగు 500 మంది మిషనరీలను దేవుడు లేపేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)